వర్షం ఐతే తప్పదన్నట్టుగా వచ్చి.
నలుగు చినుకుల్ని కాస్త గాలితో కలిపి
తనవి కాదన్నట్టు దులిపేసి పోయింది
నేల తల్లి మాత్రం ఎంత అపురూపంగా
దాచుకుందో తనలో..
కొన్ని తనలో నింపేసుకుని..
తన చేతులలో (గుంటలు,కొలనులు,చెరువులు) కొన్నింటినీ నిలుపుకుంది
తడిచి మెరుస్తుందేమో ఆ ఉయ్యాల బల్ల
తనని తాను చూసుకోవటమే సరిపోతుంది
ఎక్కడెక్కడి నుండో కొట్టుకు వచ్చిన ఆకులు
కొత్త రాజ్యంలో అడుగు పెట్టి బిక్కుబిక్కు మన్నట్టు
నలు మూలలా చెరిగి ఉన్నాయి..
అన్నీ తమని తాము ఆ వాన నీటితో కడిగేసుకుని
మనసులన్నీ మెరుస్తున్నాయి(వాటి హృదయాల్లా)
ఒక్క మనిషే ఎంత తడిచినా..
హృదయం విప్పలేడు..
మురికిని,కుళ్ళుని,కడగలేడు..
పాపం అందుకేనేమో….
వర్షం పిలిస్తే రాదు..పొమ్మంటే పోదు..
తాను మారని మనసుల కోసం రాదేమో..
తనని కావాలని కోరుకునే ఆ నిర్మలత్వపు
ప్రక్రుతికి,ప్రాణం లేకున్నా…
తనని గుండెల్లో అదుముకునే
మూగ జీవుల కోసం మాత్రమే వస్తుందనుకుంటా..@తులసి