Breaking News

ఆధునిక టెక్నాలజీతో వ్యవసాయం చేస్తున్న రైతులు

ఆధునిక టెక్నాలజీతో వ్యవసాయం చేస్తున్న రైతులు

డ్రోన్ స్పెర్స్ తో పంటలపై పురుగు మందు పిచికారి చేస్తున్న రైతులు

యంత్రాల ప్రయోగంతో తగ్గుతున్న పెట్టుబడులు

డ్రోన్ స్పెర్స్ వినియోగంతో సంతోషం వ్యక్తం చేస్తున్న మూలపాడు రైతు పరిటాల కృష్ణ

అభివృధి చెందిన దేశాలు ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకున్నాయి.

నేడు మన దేశంలో కూడా ఈ ఆదునిక టెక్నాలజీ ఉపయోగించి వ్యవసాయ పనిముట్లు తయారుచేసి సాగు చేస్తున్నారు.ఈ తరుణంలో గ్రాడ్యుయేట్స్ కూడా ఉద్యోగాలపై ఆధార పడ కుండా
వ్యవసాయ రంగాన్ని ఆసరా చేసుకొని తక్కువ ఖర్చు తో, ఎక్కువ మంది మనుషులతో పని లేకుండా , ఫెర్టి సైడ్స్ స్ప్రే చేయడానికి ఆదునిక టెక్నాలజీ తో తయారు చేయబడ్డ డ్రోన్ స్ప్రేయర్స్ ఉపయోగించి పంటలపై పిచికారి చేయడం భారతీయ వ్యవసాయ రంగం అభివృద్ధికి చాలా దోహద పడుతుంది.

ఇబ్రహంపట్నం,మూలపాడు గ్రామములో పరిటాల కృష్ణా గారు, తాను సాగు చేస్తున్న 60 ఎకరాల వరి పొలానికి మందులు స్ప్రే చేయడానికి తైవాన్ వంటి పంపులతో కనీసం 6 రోజులు పడుతుందని, ఈ డ్రోన్ స్ప్రేయర్ ఉపయోగించి మేము 2 రోజుల్లో 60 ఎకరాల పైరు మొత్తానికి మందు స్ప్రే చేస్తున్నామని, కూలీల ఖర్చు, పెట్రోల్ ఖర్చు తగ్గిపోయిందని చాలా సంతోషంగా చెప్పారు.

ఇప్పుడు కురుస్తున్న వర్షాల వల్ల రైతులకు చాలా సంతోషంగా ఉందని అంటున్నారు, పేను బంక, నల్లి, తెగుళ్లు,తగ్గి బెట్టకొట్టిన ప్రత్తి పొలాలు చాలా బాగున్నాయని సంతోషం వ్యక్తం చేస్తూ,, 20 రోజుల్లో వరి పొలాలు పొట్ట దశకు వస్తాయని అప్పుడు ఇలాంటి వర్షాలు కురిస్తే తాలు కంకి ఏర్పడుతుందని పంటకి నష్టం వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

అంతే కాక ఇటువంటి టెక్నాలజీ తో యంత్రాలు తయారుచేసి ప్రభుత్వాలు రైతులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పెట్టుబడి తగ్గి లాభాలు పొందే టటువంటి ఒక అద్భుతమైన ఉద్యోగ బృతి గా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి,తద్వారా నిరుద్యోగం నిర్మూలించవచ్చు

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *