Breaking News

ఆఫ్రికన్ స్పియర్

ఆఫ్రికన్ స్పియర్  చూడటానికి అచ్చం మునగకాయలలా అనిపించే ఆకులు కలిగిన ఈ మొక్కను స్పియర్ శాన్ సెవీరియా ( Spear Sansevieria) అంటారు. ఆఫ్రికా ఖండంలోని అంగోలా దేశం ఈ మొక్క తొట్టతొలి జన్మస్థలం. అందుకనే దీనికి ఆఫ్రికన్ స్పియర్ ప్లాంట్ ( African Spear Plant) అనే మరో పేరు ఏర్పడింది. బల్లెం (Spear) ఆకారంలో ఉండే ఆకుల్నిబట్టి దీనికాపేరు. భూమిలోపల దుంప (Rhizome) ఉండి పైన పాము తోకల వంటి ఆకులు కలిగిన ఈ మొక్కను స్నేక్ టేల్ ప్లాంట్ (Snake Tail Plant) అని కూడా అంటారు. దీనికి సిలిండ్రికల్ స్నేక్ ప్లాంట్
( Cylindrical Snake Plant) అనే మరొక పేరు కూడా ఉంది.
నీరు కలిగుండే ఈ మొక్క ఆకులు (Succulent Leaves) మూడు సెంటీమీటర్ల వ్యాసం వరకూ, ఏడు అడుగుల పొడవు వరకు సిలిండర్ల లాగా పెరుగుతాయి. ఆకులలో ఉండే ఈ నీటి కారణంగా ఈ మొక్కలు నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. మొక్కలు పెరిగేటప్పుడు వారానికి ఒకసారి, ఆ తరువాత రెండు వారాలకు ఒకసారి, చలికాలంలో అయితే నెలకు ఒకసారి నీరు పెడితే సరిపోతుంది. అయితే ఈ మొక్కల పెరుగుదలకు సూర్యరశ్మి బాగా అవసరం. అందుకే బాగా వెలుతురు ఉండే బహిరంగ ప్రదేశాలలో వీటిని పెంచుకోవాలి. ఈ మొక్క ఆకులమీద ఆకుపచ్చ, తెలుపు వన్నెలు కలగలిసిన, లేత ఎరుపు దాళు కలిగిన గొట్టం పూలు పూస్తాయి. అవి మూడు సెంటీమీటర్ల వరకు పొడవుంటాయి. దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్ దేశంలో ఈ మొక్కను ‘the Sword of Saint Barbara’ అనే పేరుతో వ్యవహరిస్తారు. క్రీ.శ. 273 – 306 మధ్యకాలంలో లెబనాన్ లో జీవించి, యుద్ధంలో వీరమరణం పొందిన బార్బరాను ఈస్ట్రన్ ఆర్థోడాక్స్ చర్చ్ ( Eastern Orthodox Church) అనుయాయులు
Saint గా పరిగణిస్తారు. ఈ మొక్క బాకుల వంటి ఆకులు బార్బరా కత్తిని పోలి ఉన్నందున దీనికా పేరు వచ్చింది. యాస్పరాగేసీ
( Asperagaceae) కుటుంబానికి
చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం శాన్ సెవీరియా సిలిండ్రికా
( Sansevieria cylindrica). దీనికి డ్రసీనా అంగోలెన్సిస్ ( Dracaena angolensis) అనే మరో శాస్త్రీయ నామం కూడా ఉంది. అంగోలెన్సిస్ అంటే అంగోలా దేశంలో జన్మించిన మొక్క అని అర్థం. మొట్టమొదటిసారి నౌకలో భూమిని చుట్టివచ్చిన ఆంగ్ల నౌకాదళ అధికారి సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ ( Sir Francis Drake 1540 – 1596 ) కు
గౌరవ సూచకంగా ఈ తరహా అలంకార పొద మొక్కలకు డ్రసీనా అనే పేరు పెట్టారు. ఇక ఆగ్నేయ ఇటలీలోని శాన్ సెవీరో రాజ్యపు యువరాజు ( Prince of Sanseviero) అయినట్టి రైమాండ్ డి శాంస్ గ్రియో ( Raimond de Sansgrio 1710 – 1771) కి గౌరవ సూచకంగా ఈ చాగ (సాగ) నార జాతి మొక్కలకు శాన్ సెవీరియా అనే పేరు పెట్టారు. ఈ మొక్కను ఒక అలంకార మొక్కగా ఇళ్ళ ఆవరణలు, ఉద్యానవనాలలో పెంచుకోవడం తప్ప దీనికి ఆహార, వైద్యపరమైన ప్రయోజనాలు ఏవీ లేవు.
ఇవండీ ఆఫ్రికన్ స్పియర్ మొక్క విశేషాలు.
— మీ.. రవీంద్రనాథ్.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *