Breaking News

మిద్దె మీది సాగు- కోతుల బెడద

మిద్దె మీది సాగు- కోతుల బెడద

70891690_3019528161451228_7249593994634592256_n 71028337_3019530008117710_7575479895258562560_n 71707306_3019528524784525_4151532666967031808_n 72234968_3019528031451241_460676950923411456_n

మిత్రులందరికీ శుభోదయం. మా మిద్దె మీది సాగుకు కోతులు ఒక బెడదగా తయారయ్యాయి. ఎప్పుడు వస్తాయో తెలియదు. ఉన్నట్టుండి ఊడిపడి వంకాయలు, టొమాటోలు, బీరకాయలు, చిక్కుడు, గోరుచిక్కుడు, అలసంద కాయల్ని పీక్కు తినేస్తున్నాయి. అంతేనా? పచ్చి మిరపకాయలు, పండుమిరప కాయల్నీ కూడా పరపరా నమిలిపారేస్తున్నాయి. చివరికి తోటకూర, గోంగూర, బచ్చలి, పుల్లబచ్చలి, పుదీనా వంటి ఆకుకూరల్నీ ఆవురావురంటూ ఆరగిస్తున్నాయి. కొండమిరప ఘాటు వాటికీ తెలుసేమో మరి- వాటి జోలికి మాత్రం అవి పోవడం లేదు. కోతులకు విరుగుడు కొండముచ్చులనీ, కొండముచ్చులు పెంచేవాడిని డబ్బులిచ్చి పిలిపించుకుని కోతుల బెడద ఉన్న ప్రదేశాలలో రెండు రౌండ్లు తిప్పితే కోతులన్నీ పరారైపోతాయనీ నాకు తెలుసు. అయితే ఇప్పటికిప్పుడు కొండముచ్చులు పెంచేవాడు మనకెక్కడ దొరుకుతాడు? గన్పిశెట్టి రాంబాబు అనే నా మిత్రుడొకాయన తెనాలిలోనే టింబర్ డిపో నిర్వహిస్తారు. రోజూ ఉదయపు నడకలో కలిసినప్పుడు పిచ్చాపాటీ మాట్లాడుకుంటుంటాం. ఒకరోజు మాటలమధ్య ఈ కోతులబెడద ప్రస్తావన వచ్చింది. కోతుల పీడ వదిలించుకోవడానికి ఇటీవల అందరూ కొండముచ్చుల
బొమ్మలున్న ఫ్లెక్స్ బానర్లు కడుతున్నారనీ, అవి చూసి కోతులు ఆ చాయలకే రావటంలేదనీ ఆయన చెబితేనే తెలిసింది. నాకైతే నమ్మకం కుదరలేదు. ఎందుకంటే కోతులు తెలివిలోనూ మనుషులకు తాతలే. నిజం కొండముచ్చుకూ, బానర్ లోని కొండముచ్చు బొమ్మ కూ తేడా కనిపెట్టలేనంత తెలివితక్కువవా కోతులు? – అనుకున్నాను. అయితే రాంబాబు మాత్రం ‘ అందరూ వాడుతున్నారు. మీరూ వాడిచూడండి. ప్రయోజనం ఉంటుంది’ అన్నారు. అనటమే కాదు. అప్పటికప్పుడు
మూడు బానర్లు వేరే మనిషికిచ్చి పంపించారు. కోతులు ఏ దిక్కు నుంచి వస్తున్నాయో, ఆ దిశకు ఎదురుగా వాటిని కట్టించమన్నారాయన. మాకు ఈ కోతులు ఉత్తర దిశగా ఉన్న పార్క్ నుంచే వస్తాయి కనుక బానర్లను ఉత్రదిశకు అభిముఖంగా కట్టించాను. మరి ఈ కోతిమూక
దూరాన్నుంచే ఈ కొండముచ్చు బొమ్మల్ని చూసి దడుచుకుని పారిపోతున్నాయో, లేక వేరే ప్రాంతానికి మకాం మార్చాయో తెలియదుగానీ ఒక వారంరోజులుగా వాటి జాడలేదు. చూద్దాం. ముందు ముందు ఏం జరగనుందో ?? ముఖపుస్తక మిత్రులు కొందరు తమకు కోతుల బెడద ఎక్కువగా ఉందనీ దాని నివారణకు మీరు ఏమి చర్యలు తీసుకున్నారనీ నన్ను అడిగిన మీదట నేను ఈ టపా పెట్టాను.

— మీ..రవీంద్రనాథ్.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *