Breaking News

ధృఢసంకల్పం తో ఉంటే ఏదైనా సాధ్యం….

“Opportunities don’t happen. You create them.”

— Chris Grosser

ఉదయాన్నే వాట్సప్ లో వచ్చిన ఈ కొటేషన్ చూడగానే నాకు గణపతి గుర్తొచ్చారు🙂 🙂 ..గణపతి ఎవరంటే..

తమిళనాడు లోని Tuticorin కి చెందిన “ప్రేమ్‌ గణపతి” అతి సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇంట్లో సంపాదనకి రెండింతలు ఉన్న జనం ,దిగువ మధ్యతరగతి కుటుంబం లోని బాధలన్నీ గణపతి అనుభవించినవే. విసిగిపోయి ఏమీ తెలీని అయోమయం లో పదో తరగతి మాత్రమే చదివిన ప్రేమ్‌ ఇంట్లో చెప్పకుండా ముంబై వెళిపోయాడు,అతనికి ఎక్కడా పని దొరకలేదు .వెంటనే నెలకి 150 రూపాయల జీతానికి ఒక బ్యాకరీ లో గిన్నెలు కడిగే పనికి కుదిరిపోయాడు.

అక్కడ నుండి నెమ్మదిగా పిజ్జా బ్రెడ్ డెలివర్ చేసేవాడు.కొన్ని రోజులకి సొంత బండి మీద ఇడ్లీలు,దోశలు అమ్మడం మొదలుపెట్టిన గణపతి, సాయంత్రాలు ఇంటర్ నెట్ గురించి,కంప్యూటర్ గురించి తన ఫ్రెండ్స్ ని అడిగి తెలుసుకుని ఒక సైబర్ కేఫ్ లో రోజూ ఓ రెండు గంటలూ గడుపుతూ సమాచారాన్ని సేకరించేవాడు.

అలా నెలకి 5 వేలు రెంట్ ఇచ్చేలా ఇంటి ఓనర్ తో మాట్లాడుకున్న ప్రేమ్‌ కొద్దిరోజులకే “ప్రేమ్‌ సాగర్ దోశా ప్లాజా” అనే రెస్టారెంట్ అదే ఇంట్లోస్టార్ట్ చేసాడు.

కొత్తగా ఉంటే తప్ప కస్టమర్స్ ఆదరించరనే నిజాన్ని తెలుసుకున గణపతి, 26 వెరైటీ దోశలని..పన్నీర్ దోశ ,పన్నీర్ చిల్లీ దోశ,చీజ్ దోశ ఇలా పేర్లు పెట్టి రుచిగా తయారు చేసి అందిస్తుంటే కస్టమర్స్ బాగా పెరిగారు.అలా 108 రకాల దోశలని అందించాడు గణపతి

ఇంక వెనక్కి తిరిగి చూడలేదు గణపతి.తన కుటుంబాన్ని కలిసాడు, అన్నదమ్ములని తన వ్యాపారం లో పార్టనర్స్ ని చేసాడు.

మనదేశం లో “దోశా ప్లాజా” పేరుతో 45 ఔట్ లెట్స్ ని విదేశాలలో(UAE, Oman and New Zealand) 7 ఔట్ లెట్స్ ని నడుపుతున్న గణపతి ఫ్రాంచైజీలని కూడా సపోర్ట్ చేస్తా అని చెప్తున్నాడు..ఇప్పుడు 40 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న గణపతి ప్రస్థానం ఇది.

ధృఢసంకల్పం తో ఉంటే ఏదైనా సాధిస్తారనడానికి గణపతి పెద్ద ఉదాహరణ.ఇవాళ మీరెక్కడైనా వెరైటీ దోశలని తింటున్నారంటే అవి గణపతే చలవే..

……….Vydehi Murthy……..

 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *