Breaking News

పనీర్ బటర్ మసాలా…

14572865_1793311314225169_606644931546486_n 14573028_1793311294225171_1808395229934122142_n

పనీర్ బటర్ మసాలా…

కావలసినవి:–
పనీర్ ..ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
అంత ఓపిక తీరిక ఎక్కడున్నాయి కనుక…
250 grms
కొద్దిగా అల్లం,వెల్లుల్లి పేస్ట్
టమాటో పెద్దది 1…చిన్నవి అయితే 2
దాల్చిన చెక్క…చిన్నది
లవంగాలు ..6
యాలుకలు 2
ఎండుమిర్చి 12
జీడిపప్పు 20
కొత్తిమీర కొంచెం
పుదీనా ఇంకా కొంచెం
పచ్చిమిర్చి 2
పసుపు కొద్దిగా
ఉప్పు సరిపడినంత
తరిగిన ఉల్లిపాయలు
నేను పిల్లల కోసం కార్న్..మొక్కజొన్న గింజలు
కాసిన్ని పచ్చిబటాని కూడా వేస్తాను..
పాల మిద మీగడ…లేదా బయట cream దొరుకుతుంది

తయారుచేసే విధానం :-

ముందుగా..ఓక చిన్న గిన్నెలో….కాసిన్ని నీళ్ళు పోసి యాలుకలు,లవంగ,చెక్క,జీడిపప్పు,ఎండుమిర్చి వేసి మూత పెట్టు కోవాలి..
ఓక అరగంట నానాక మిక్సీలో వేసి పేస్టు చేసుకోవాలి.

చిన్న గిన్నెలో నీళ్ళు మరిగించాలి..
అందులో టమాటోలను వేసి 2 mins ఉంచాలి
స్టవ్ అఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి

చల్లారాక టమేటో పై తొక్కను తీసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి..

కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి వేడి అయ్యాక ..ఉల్లిపాయలు ,పచ్చిమిర్చి,కొత్తిమీర,పుదీనా చక్కగా వేయించి పక్కన పెట్టుకోవాలి..
చల్లారాక మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి..

కళాయిలో కొద్దిగా నూనె వేసి కాగాక పనీర్ ముక్కలుగా చేసి కొద్దిగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి..
పనీర్లో నీటి శాతం ఉంటుంది కాబట్టి అన్ని ముక్కలు ఒక్కసారి కాకుండా కొంచెం కొంచెం వేయించాలి..

అదే కళాయిలో ఉల్లిపాయల పేస్ట్ ,
కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి
కార్న్ మరియు బటాని కూడా వేసి వేయించుకోవాలి
టమేటో ప్యూరీ కూడా వేసి పచ్చివాసన పోయేవరకు వేయించుకోవాలి
అప్పుడు జీడిపప్పు ముద్దని కూడా వేసి 2నుండి 3 నిమిషాలు వేయించి పనీర్ ముక్కలని వేయాలి
మూతపెట్టి మరో 3 నిముషాలు ఉంచాలి..
తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి..
క్రీమ్ వేస్తే పనీర్ బటర్ మసాలా రెడీ…
.
.
.@తులసి..

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *