1. చక్కెరను నియంత్రించే దాల్చిన చెక్క :
దాల్చిన చెక్కలో ప్రోటీన్లు, పీచు, ఐరన్, సోడియం, విటమిన్ సి ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీనిలోని ఔషధ విలువల వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
ఇది రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం చూపుతూ, కొలెస్ట్రాల్, ట్రెగ్లీసెరైడ్ స్థాయిని తగ్గిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
2. అల్లం పైత్యానికి విరుగుడు :
అజీర్ణ వ్యాధులకు అల్లం అద్భుతంగా పనిచేస్తుందని, ఉదర సంబంధ వ్యాధులకు అల్లాన్ని మించిన ఔషధం లేదని ఆయుర్వేదం గట్టిగా చెబుతోంది.
వికారం, వాంతులు, విరోచనాలకు చెక్ పెడుతుంది. గర్భవతులలో ఉదయం పూట వికారాన్ని, కెమోథెరపీతో పాటు ఎన్నో కారణాలవలన వచ్చే కడుపునొప్పిని అల్లం నివారిస్తుంది.
3. వెల్లుల్లి గుండెకు నేస్తం:
పచ్చివెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి.
ఆక్సీకరణ నుంచి శరీరంలోని కొవ్వును నివారించే కార్పినోజెనిక్ మిశ్రమ పదార్థాలు ఏర్పడే యాంటీ ఆక్సిడెంట్ ఇందులో మెండుగా వున్నాయి.
4. కుంకుంపువ్వు అందం ఆరోగ్యం:
ఇది చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం.
దేశ విదేశాలలో ఆహార పదార్థాలలో రుచి, రంగు, సువాసనకోసం వాడే కుంకుమపువ్వులో క్యాన్సర్ నిరోధక గుణాలు వున్నాయి.
5. లవంగాలు శ్వాసకు మేలు :
లవంగాలలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు దంత రక్షణనిస్తాయి.
నోటిని, శ్వాసను తాజాగా వుంచుతాయి. హృదయానికి ఆరోగ్యాన్నిస్తాయి.
యాంటిసెప్టిక్, యాంటీబయోటిక్ ఔషధాలలో లవంగాలను ఉపయోగిస్తారు.
6. జీర్ణశక్తికి జీలకర్ర:
జీర్ణశక్తిని బాగా పెంచుతుంది.
దీనిలోని క్యూమిక్ డీహైర్ అనే పరిమళం లాలాజల గ్రంధులను క్రీయాశీలం చేస్తుంది.
ఆకలిని పుట్టిస్తుంది.
శ్వాసక్రియ వ్యవస్థను ఎలాంటి అంటురోగాలు సోకకుండా ఆరోగ్యంగా వుంచుతుంది.
7. ఆవాలు:
ఆవాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
శరీరానికి కావలసిన విటమిన్లు వీటిలో ఉన్నాయి. కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు తగ్గిస్తుంది.
శ్వాస అవరోధాలను దూరం చేస్తుంది.
8. నల్లమిరియాలు:
ఘాటుగా వుండి నాలుకను చురుక్కుమనిపించే మిరియాలు జీర్ణక్రియకు తోడ్పడతాయి.
ఆహారం తేలికగా జీర్ణం కావడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను విడుదల చేయమని ఉదరాన్ని ప్రేరేపిస్తాయి.
బ్లాక్ కాఫీలో మిరియాలపొడి వేసుకుని తాగితే ఋతుక్రమ సమయంలో ఇబ్బందుల నుంచి ఉపశమనం ఇస్తుంది.
9. పచ్చి ఏలకులు:
ఊపిరితిత్తులలో కఫాన్ని కరిగించి, శ్లేష్మాన్ని తొలగించే శక్తి ఏలకులకు ఉంది.
శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడే పిల్లలకు ఏలకులు వేసిన పాలను తాగించాలి.
ఇవి జీర్ణక్రియ వ్యవస్థపై చక్కగా పనిచేస్తుంది.
అజీర్ణం, కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తుంది.
10. ఫెన్నల్:
ఇది మరువంలాంటి మొక్క.
దీన్ని కూరల్లో వాడుతారు.
ఫెన్నెల్స్ డైయూరిటిక్ గుణం కలిగి ఉంది.
ఇది ఋతుస్రావ సమయంలోని ఇబ్బందుల్ని తొలగిస్తుంది. పొత్తికడుపులకు ఉపశమనాన్నిచ్చే శక్తి ఫెన్నల్ తైలానికి ఉంది.
పాలిచ్చే తల్లులలో పాలు సమృద్ధిగా వుండడానికి ఎంతో తోడ్పడుతుంది