సిరిధాన్యాల వినియోగదారుల కు వచ్చే సాదరణ సందేహాలు… సమాధానాలు…. సిరిధాన్యాలు అంటే ఏమిటి ?
వరి బియ్యం, గోధుమలు వలె ఇవికూడా ఆహారంగా స్వీకరించడానికి అనువైన ధాన్యం. పూర్వం అంటే సుమారు 100 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు మన నేలల్లో/ భూమిలో పండించి సంపూర్ణ ఆహారంగా స్వీకరించిన ధాన్యాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సిరిధాన్యాలే…కాలక్రమంలో నీటి డ్యాముల నిర్మాణం,నీటి లభ్యత, వ్యవసాయ విప్లవం, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆధిపత్య ప్రభావంతో మన ప్రాచీన, సంప్రదాయ పంటలయిన కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, అండుకొర్రలు అనే పంచ చిరు (సిరి) ధాన్యాల సాగు మన ప్రాంతాల్లో కనుమరుగై వాటి స్థానంలో నీటి ఆధారిత పంటలయిన వరి, గోధుమలు మన భూముల్లో పండించడం ప్రారంభించి , వరి బియ్యం, గోధుమలు మన ప్రధాన ఆహారంగా తీసుకోవడం ప్రారంభించాము, ఈ ఆహారం వల్ల గ్లూకోస్ ఏక మొత్తం లో ఓకే సారి రావడం వల్ల, గ్లూకోస్ మనకు కావాల్సిన డానికి కంటే ఎక్కువైనది ఫ్యాట్ గ మారి బరువు పెరగడం, తద్వారా మన శరీరం లోకి అన్ని దీర్ఘకాలిక రోగాలు , సాధారణ రోగాలు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ అరుగుదల రావడం ప్రారంభించాయి.
సిరిధాన్యాలను ఎలా వండుకోవాలి ?
ఏ సిరిధాన్యము అయినా 8 గంటలు నానబెట్టి వండుకోవాలి. రాత్రి నానబెట్టి ఉదయం వండుకోవడం, ఉదయం నానబెట్టి రాత్రి వండుకోవడం ఉత్తమం.
ఎందుకు నాన బెట్టాలి.?
అన్ని సిరిధాన్యాల్లో ఫైబర్ శాతం మన శరీరానికి అవసరం అయినంత ఉంటుంది, ఫైబర్ నిష్పత్తి 65:8 నుండి 65:12.5 వరకు ఉంటుంది . అంటే పిండి పదార్థం 65 ఉంటే పీచు పదార్థం (ఫైబర్) కనీసం 8 శాతం ఉంటుంది…
వరి బియ్యంలో పిండి పదార్థం నిష్పత్తి 395: 0.2 అంటే దాదాపు పీచు పదార్థం శూన్యం…
ఆవాల పరిమాణం కంటే కొద్దిగా పెద్ద పరిమాణం లో వుండే సిరిధాన్యాల కేంద్రం నుండి పై వరకు పొరలు పొరలు గా ఫైబర్ ఉంటుంది . భగవంతుని అద్భుత సృష్టి తో సుమారు ఏడు పొరల్లో నిక్షిప్తమయిన ఈ ఫైబర్ పూర్తిగా నానడానికి 8 గంటలు పడుతుంది. అందుకే ఉదయం నానబెట్టి రాత్రి, రాత్రి నానబెట్టి ఉదయం వండుకోవాలి.