Breaking News

ఆరె చెట్టు

ఆరె చెట్టు

21151500_1549805618423497_4825100954448773709_n 21151560_1549810331756359_4582701187241060001_n 21151612_1549810878422971_5380879501329870691_n 21191867_1549806481756744_3315081042407484449_n 21192158_1549806351756757_7927872070526523835_n 21192167_1549804725090253_6686151497693384685_n 21192394_1549805135090212_4342210155239034064_n 21192883_1549805428423516_7722962222383487070_n 21192938_1549809701756422_1485302754937091522_n 21231568_1549810078423051_4649682925850230562_n 21231743_1549805871756805_858053736381718909_n 21231911_1549806138423445_1312269978481967889_n 21246466_1549810541756338_1043730229723137887_o 21270884_1549804488423610_7835096809059284351_n 21270953_1549804131756979_3260965620824399774_n 21271234_1549803855090340_1521061695325738259_n 21272228_1549804935090232_6495619915250879965_n21272228_1549804935090232_6495619915250879965_n 21271234_1549803855090340_1521061695325738259_n

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మహారాష్ట్రీయులు (ఆరె వారు) మన తెలుగు ప్రాంతాలకు వలస వస్తూ తీసుకువచ్చిన మరో వృక్షాన్ని కూడా తెలుగు ప్రజలు ‘ఆరె చెట్టు’ అనే పిలుస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో దీనిని ‘ఆరి చెట్టు’ అని కూడా అంటున్నారు. ఇది గుబురుగా పెరిగే చిన్న వృక్షం. కొమ్మలు కిందికి వేళ్ళాడేస్తూ పెరిగే ఈ వృక్షాలను మనం దాదాపు భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోనూ చూడవచ్చు. సీజాల్పినియేసీ కుటుంబానికి (Caesalpiniaceae) చెందిన ఈ చిన్న వృక్షం శాస్త్రీయనామం Bauhinia racemosa. దీనిని సంస్కృతంలో ‘అశ్మంతక’ , ‘చంద్రక’ , ‘తామ్ర పత్రికా’, ‘వాలుకా పర్ణ’ అనే పేర్లతో పిలుస్తారు. దీనికి సంస్కృతంలో ‘శ్వేత కాంచన’ అనే పేరు కూడా ఉంది. దీనికి ఆ పేరు రావడానికి ఒక కారణం ఉంది. కోవిదార, దేవ కాంచన, రక్త కాంచన అనే పలు పేర్లతో పిలిచే ఎర్ర పూల కాంచన ( Butterfly Tree – Bauhinia purpurea) వృక్షాన్ని అన్నివిధాలా పోలి ఉండే కారణంగానూ, ఆరెచెట్టు పూలు మాత్రం కొద్ధి లేత పసుపు దాళుతో తెల్లగా ఉండే కారణంగానూ దీనికి ‘శ్వేత కాంచన’ అనే పేరు వచ్చింది. ఆరె చెట్లు పదిపదిహేను అడుగుల ఎత్తుకు మించి పెరగవు. గరుకుగా ఉండే దీని కాండంపై బెరడు నీలి – నలుపు వర్ణాల కలగలుపుగా ఉండి, లోపల ఎర్రగా ఉంటుంది. ఆకులు రక్త కాంచన ఆకుల్లాగే ‘ఱ’ అక్షరాన్ని పోలి రెండుగా చీలి ఉంటాయి. ఆకులు పొడవు కంటే వెడల్పు ఎక్కువగా ఉంటాయి. ఆకుల్ని వేళ్ళతో తడిమితే అవి చర్మంలా (coriaceous) ఉంటాయి. ఆకులు కింది (ventral) పక్క బూడిదరంగు నూగుతో కప్పబడి ఉంటాయి. మహారాష్ట్ర ప్రాంతంలో ఆరె ఆకుల్ని ‘సోనా పత్తా’ (బంగారు ఆకులు) అంటారు. దానికో కారణముంది. విజయదశమి (దసరా) రోజున ఈ ఆకులను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుని, బంగారం ఇచ్చిపుచ్చుకున్నట్లే భావిస్తారు మహారాష్ట్రీయులు.వారు దీనిని ఆప్త వృక్షం అని కూడా పిలుస్తారు. ఆరె చెట్టు ఫిబ్రవరి – మే నెలల మధ్యలో పూత పూస్తుంది. పూలు లేత పసుపు వన్నెలో పొట్టి కాడ కలిగుంటాయి. కాయలు తమ్మ (చమ్మ) కాయల్లా ఉంటాయి. అయితే కొడవలిలా వంపు తిరిగి, నున్నగా మెరుస్తూ కొంచెం ఉబ్బి ఉంటాయి. గింజలు ముదురు ఎరుపు, గోధుమ వన్నెల మేళవింపుగా ఉంటాయి.

ఆరె చెట్టు భూక్షయం (నేల కోత) కాకుండా కాపాడేటందుకు పనికొచ్చే వృక్షం. అరణ్యాలలో ఏర్పడే ఖాళీ తరుగులను పూరించడానికి ఆరె మొక్కల్ని పెంచుతారు. విత్తనాలు ఏడాది వరకు మొలకెత్తే శక్తి కలిగుంటాయి. ఈ చెట్టు పెరుగుదలకు వెలుతురు బాగా అవసరం. ఇది నీడను ఎంతమాత్రం భరించదు. అందుకే బహిరంగ ప్రదేశాలలో దీనిని పెంచుతారు. పొగ మంచు ఈ మొక్కలకు కొంత చెరుపు చేస్తుంది. ఆరె చెట్టుకు వేరు పిలకలు వస్తాయి. విత్తనాల ద్వారానూ అది పునరుత్పత్తి చేసుకుంటుంది.

ఆరె చెట్టు ఆకుల్ని కొన్ని ప్రాంతాలలో బీడీలు చుట్టడానికి ఉపయోగిస్తారు. అయితే బీడీల తయారీకి ఎక్కువ ప్రాంతాలలో తునికి ( Diospyros melanoxylon) చెట్టు ఆకును ఉపయోగిస్తారు. మన తెలంగాణ గ్రామసీమలలో దాదాపు ప్రతిగ్రామం వెలుపల తునికి చెట్లు చిట్టడవులలాగా పెరుగుతాయి. తునికి ఆకును సేకరించడం, ఎండబెట్టి కట్టలు కట్టడం, ఆ తరువాత బీడీలు చుట్టడం మొదలైన పనులు పలు తెలంగాణ జిల్లాలలో గ్రామీణ పేదలకు చక్కటి ఉపాధి కల్పిస్తున్నాయి. ఆంగ్లంలో Coromandel Ebony లేక East Indian Ebony అనే పేర్లతో పిలిచే తునికి చెట్టును ఉత్తరభారత దేశంలో ‘తిందు’ అని కొన్ని ప్రాంతాలలో, ‘ కెందు’ అని మరికొన్ని ప్రాంతాలలో పిలుస్తున్నారు.

ఇక తునికి చెట్టు సంగతి అలా ఉంచి తిరిగి ఆరె చెట్టు విషయానికి వద్దాం. ఆరె చెట్టు కాండం పై పట్ట నుంచి మన్నికైన గట్టి నార లభిస్తుంది. దీని కాండం బెరడు(చెక్క) కషాయం స్రావాలను అరికట్టే గుణం (Astringent) కలిగున్న కారణంగా నీళ్ల విరేచనాలను నివారిస్తుంది. వాపుల్ని తగ్గిస్తుంది. గాల్ బ్లాడర్ ని కుంచింపజేసి పైత్యరసాన్ని జారీచేయడంలో (Cholagogue) తోడ్పడుతుంది. దీని చెక్క కషాయం చేదుగా, వగరుగా ఉంటుంది. దగ్గు, కళ్లె, కుసుమరోగము, అతిపైత్యము, రక్తపైత్యము, చర్మం మీది పుళ్ళు, చెవిలో పుళ్ళు మొదలైనవాటికి ఈ కషాయం బాగా పనిచేస్తుంది.అయితే ఈ కషాయానికి మలబద్ధం కలిగించే గుణం ఉంది. అతిసారం రోగికి ఆరె చెట్టు ఆకులను పెద్ద ఉల్లిపాయతో కలిపి తినిపిస్తారు. ఈ ఆకులలో క్రిమినాశక గుణం కూడా ఉంది. ఆకుల కషాయం మలేరియా నివారణకు కూడా ఉపయోగిస్తారు. పశువులకు మేతగానూ ఈ ఆకులు వినియోగిస్తారు.

ఆరె కలప గోధుమ వన్నెలో అక్కడక్కడా చాకొలెట్ రంగు మచ్చలు కలిగుంటుంది. నాగలి, ఎడ్ల మెడలపై వేసే కాడి వంటివి ఆరె కలపతో చేస్తారు. వంట చెరకుగానూ దీనినుపయోగిస్తారు.

ఇదే కుటుంబానికి చెందిన దేవ కాంచన లేక రక్తకాంచన వృక్షం (Bauhinia purpurea ) లాగే Bauhinia variegata అనే శాస్త్రీయ నామం కలిగిన మరో వృక్షం కూడా ఉంది. దానిలో ఎరుపు, తెలుపు – ఇలా పలు వర్ణాల పూలు పూసే రకాలున్నాయి. కొన్నిప్రాంతాల ప్రజలు దానిని కూడా దేవకాంచన, రక్తకాంచన, కోవిదార, కాచనార్, కాంచన వంటి పేర్లతోనే వ్యవహరించడం చిత్రం.

ఇక చివరిగా మనం విస్తళ్ళు కుట్టుకునే అడ్డాకులు Bauhinia vahlii అనే ఇదే కుటుంబానికి చెందిన ఒక తీగమొక్క ఆకులే. దీనికి Phanera vahlii అనే మరో శాస్త్రీయ నామం ఉంది. దీనికి మాలూ క్రీపర్ (Maloo Creeper ) అనే వాణిజ్యనామం కూడా ఉంది. మహారణ్యాలలోని పెద్ద పెద్ద వృక్షాలపైకి ఎగబాకే ఈ తీగమొక్క తగినంత సూర్యరశ్మికోసం వృక్షాల పైభాగానికి చేరుకొని అక్కడ ఆ వృక్షాలను పూర్తిగా కమ్మేసి విస్తరిస్తుంది. గిరిజనులు ఈ అడ్డాకులను సేకరించి ఎండబెట్టి మధ్యదళారులకు అమ్ముతారు. ఈ ఆకులు కూడా అచ్ఛం ఆరె ఆకులలాగే రెండుగా చీలి ఉంటాయి. అయితే అడ్డాకులు బాగా పెద్దవిగా ఉంటాయి. మన తెలంగాణ రాష్ట్రంలోని అనంతగిరి పర్వతాలలోని అడవులలో నేను ఈ అడ్డాకు తీగ మొక్కల్ని చూశాను.

ఈ జాతిలోని అన్ని వృక్షాలలో ఆకులు ఇలాగే జమిలి (జంట) ఆకులుగా ఉండడాన్నిబట్టి స్విట్జర్లాండ్ కు చెందిన అన్నదమ్ములైన John Bauhin (1541-1513) , Caspar Bauhin
( 1560-1624) అనే పేరొందిన వృక్షశాస్త్రవేత్తలకు స్మారకంగా, ఈ జాతికి Bauhinia అని పేరు పెట్టడం జరిగింది. వృక్షశాస్త్ర పరిశోధనలలో ఉమ్మడి కృషి సాగించి, ఎడబాయని జంటగా పేరొందిన ఆ శాస్త్రజ్ఞుల జంట ఇలా జంట ఆకుల వృక్షాల రూపంలో చిరస్ధాయిగా కీర్తిని పొందగలగడం గొప్ప విశేషం.

— మీ..రవీంద్రనాథ్.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *