Breaking News

కృష్ణ నగర్ లో చిట్టి టొమాటోలు

కృష్ణ నగర్ లో చిట్టి టొమాటోలు

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కృష్ణనగర్ క్యాంప్ లో నా శ్రీమతి రాజ్యలక్ష్మి వాళ్ళ పిన్నిగారి పెరట్లో చిట్టి టొమాటోలు విరగ కాస్తున్నాయి. ఈ చిట్టి టొమాటోల కథ ఏమిటో ఇప్పుడు వివరిస్తాను. లైకోపెర్సికాన్ ఎస్కులెంటం (Lycopersicon esculentum) అనేది సాధారణ టొమాటో శాస్త్రీయ నామం కాగా, చిట్టి టొమాటో శాస్త్రీయ నామం లైకోపెర్సికాన్ పింపినెల్లి ఫోలియం (Lycopersicon pimpinellifolium). దీని ఆకులు సోంపు మొక్క ఆకుల్లాగా ఉన్న కారణంగా దీనికా పేరు వచ్చింది. చిట్టి టొమాటోలను కరంట్ టొమాటోలు (Currant Tomatoes) అనికూడా అంటారు. చిట్టి టొమాటోలు చెర్రీ పళ్ళలా ఉండే కారణంగా కొందరు వీటిని చెర్రీ టొమాటోలు(Cherry Tomatoes) అని కూడా అంటారు. టొమాటో పళ్ళ కంటే చిట్టి టొమాటోలు తియ్యగా ఉంటాయి. అవి త్వరగా పండి, కోతకొస్తాయి. మామూలు టొమాటోల కంటే వీటిలో ‘సి- విటమిన్’ ఎక్కువగా ఉంటుంది కూడా. అసలు సిసలు చిట్టి టొమాటోల జన్మస్థలం దక్షిణ అమెరికా ఖండంలోని పెరు, ఈక్వడార్ దేశాలు. మన భారతదేశంలోని చిట్టి టొమాటోలు విదేశీ చిట్టి టొమాటో మొక్కను, సాధారణ టొమాటో మొక్కతో సంకరం చేసి సృష్టించారు. దీనిని పూసా రెడ్ ప్లం (Pusa Red Plum) అని పిలుస్తున్నారు. డబ్బాలలో నింపి విదేశాలకు ఎగుమతిచేసే పళ్ళ రకాలలో చిట్టి టొమాటోలదే అగ్రస్థానం. పెద్ద పెద్ద స్టార్ హోటళ్ళలో ఉదయపు అల్పాహారంలో మిగిలిన పళ్ళతో పాటు ఆకర్షణీయమైన చిట్టి టొమాటోలను కూడా సర్వ్ చేస్తారు. ఈ ఫోటో కృష్ణనగర్ లో 2017 ఫిబ్రవరి 6 వ తేదీన తీసినది. 
— మీ .. రవీంద్రనాథ్.

9849131029

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *