Breaking News

జంగు పిల్లి

జంగు పిల్లి

jangu pilli (1)పునుగు పిల్లి జంగు పిల్లి – ఈ రెండూ జంతు ప్రపంచంలో మాంసాహారుల తరగతి( Order Carnivora ) లోని రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన జంతువులు. పునుగు పిల్లి ( Civet), బింటూరాంగ్ (Binturong), ముంగిస
( Mongoose), మీర్ కాట్ (Meerkat) వంటి జంతువులన్నీ కార్నివోరాకు చెందిన వైవెర్రిడే ( Viverridae) కుటుంబానికి చెందినవి.

జంగు పిల్లి ఫెలిడే కుటుంబానికి ( Family Felidae) కి చెందినది. పులులూ, సింహాలూ, కొండ సింహాలు, అడవి పిల్లులు, చిరుతపులులు వంటివన్నీ కూడా ఇదే కుటుంబానికి చెందుతాయి. జంగు పిల్లి లేక జంగురు పిల్లి ని ఆంగ్లంలో సెర్వాల్ (The Serval, a spotted reddish wild cat) అంటారు. అడవి పిల్లులు ( Wild Cats) దట్టమైన అరణ్యాలలో నివసిస్తే, జంగు పిల్లులు చిలిపి అడవులలో నివసిస్తాయి. శరీరంపై మచ్చలతో జంగుపిల్లి చిన్నపాటి చిరుతపులిలా ఉంటుంది. వీటి కాళ్ళు కొంచెం పొడుగు ఎక్కువగా ఉంటాయి. ఫెలిడే కుటుంబంలోని జంతువులలో మానవులకు సుపరిచితమైనవి జంగుపిల్లులే. ఒకప్పుడు ఇవి గ్రామాలకు సమీపంలోని చిలిపి అడవులలో నివసిస్తూ అప్పుడప్పుడూ గ్రామాలలోకి వస్తూ ఉండేవి. అందుకే గతంలో వీటిని ప్రజలు ఎక్కువగానే చూడడం జరిగేది. అయితే ప్రస్తుతం మానవ జనాభా పెరుగుదల కారణంగా గ్రామాలకు సమీపంలోని చిలిపి అడవులన్నీ నరికేసి జనావాసాలుగా మార్చివేయడంతో తమ నివాస ప్రాంతాలు కోల్పోయి ( Loss of Habitat) అవి మరింత దట్టమైన అడవులకు తరలిపోవడమో, కొంతమేరకు అంతరించిపోవడమో జరిగింది. 1960 ప్రాంతాలలో నా చిన్నతనంలో కూడా నేను ఒక జంగు పిల్లి ని చూశాను. అది అప్పుడప్పడూ తనిఖీకి వచ్చినట్లు నిశ్శబ్దంగా, హుందాగా వచ్చి వెళుతూ ఉండేది. జంగు పిల్లులు చిత్తడి భూముల 
( Wet Lands) కి సమీపంలోని జమ్ము పొదలలో ఉండేందుకు ఇష్టపడతాయి. జంగు పిల్లులు సాధారణంగా ఎలుకలు, పందికొక్కుల వంటి పంటలను నాశనంచేసే జంతుజాలాన్ని చంపి తింటూ రైతులకు మేలుచేస్తాయి. పక్షులు, కప్పలు, చేపలను కూడా ఇవి ఇష్టంగా తింటాయి. ఇవి అప్పుడప్పుడూ కుందేళ్ళ వంటి చిన్న జంతువులనూ తింటాయి. అయితే పశువులపైనగానీ, మానవులపైనగానీ అవెప్పుడూ దాడిచేయవు.

జంగు పిల్లి శాస్త్రీయనామం Felis serval. ఫెలిడే (Felidae ) కుటుంబం. జంగు పిల్లుల మూల జన్మస్థానం ఆఫ్రికా. కొద్దిపాటి తేడాలతో వీటిలో పలురకాలున్నాయి. అడవి పిల్లులలోనిదైన లింక్స్ (Lynx) తోనూ దీనికి దగ్గర పోలికలుంటాయి.

— మీ.. రవీంద్రనాథ్.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *