Breaking News

మిన‌ప గారెలు

menapagarelu minapa garelu

గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి. తెలుగువారి ప్రతి పండుగకు ఈ వంటకము తప్పనిసరి. దీనిని కొబ్బరి పచ్చడి తో గాని, వేరుశనగ పప్పు పచ్చడి తో గాని, అల్లం పచ్చడితో గాని,సాంబార్ లో కానీ తింటే రుచి అమోఘంగా ఉంటుంది. 

 మినప గారెలకు కావలసిన వస్తువులు:-

మినప్పప్పు : 2 కప్పులు,

ఉల్లిపాయలు : 2,

కొత్తిమీర : 1 కట్ట,

ఉప్పు : తగినంత,

నూనె : తగినంత

తయారుచేసే విధానం:-

ముందుగా మినప్పప్పును రాళ్ళూ, మట్టి బెడ్డలు లేకుండా శుభ్రం చేసుకోండి.ఒక పాత్రలో తగినన్ని నీళ్ళు పోసి కనీసం నాలుగు గంటలు నానబెట్టండి.
(ఉదయం గారెలు చెయ్యాలనుకుంటే ముందు రోజు మినప్పప్పు నానబెడితే మంచిది)బాగా నానిన మినప్పప్పును నీరులేకుండా వడగట్టి మిక్సీలో వేసి మెత్తనిపిండిగా చెయ్యండి. అయితే ఇది గట్టి ముద్దలా ఉండాలి.అంటే – మినప్పప్పును మిక్సీలో వేసినప్పుడు తొందరగా నలగడం కోసం నీళ్ళు పొయ్యవద్దు. నీళ్ళు ఎక్కువగా పోస్తే పిండి పలుచనై అట్లపిండిలా తయారయ్యే ప్రమాదం ఉంది. పిండి జారుగా ఉండకూడదు. ఎంత గట్టి ముద్దలా ఉంటే అంత బాగుంటుంది. గారెలు అంత రుచిగా వస్తాయి.
పిండి మిక్సీలో వేసేటప్పుడు ఓ నాలుగు పచ్చి మిరపకాయలు, తగినంత ఉప్పు అందులో వెయ్యండి.

  • ముందుగా స్టవ్ వెలిగించి, దాని మీద మూకుడు పెట్టి, అందులో నూనె పోసి బాగా వేడి చెయ్యండి.
  • పాల కవర్  తీసుకుని, దానిమీద ఓ పావువంతు టీస్పూను నూనె రామండి.
  • దానిపై సిద్ధంగా ఉంచుకున్న గారె పిండి కొద్దిగా వేసి. దళసరి బిళ్ళగా చెయ్యండి.
  • దానిని బాగా కాగుతున్న నూనెలో పేసి గోధుమ రంగు వచ్చేలా వేయించండి.
  • ఒకదాని తర్వాత ఒకటిగా గారెలు వేయించేటప్పుడు ఒకదానితో ఒకటి అతుక్కోకుండా చూసుకోండి.

అంతే ఎంతో రుచిగా గారెలు రెడీ. గారెలను తాలింపు వేసిన పెరుగులో నానబెట్టి పెరుగు గారెలను తయారు చేస్తారు. వీటిని అవడలు అంటారు.

 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *