Breaking News

షాంగై ఫిల్మ్ ఫెస్ట్ లో సందడి చేయనున్న మహానటి చిత్రం …

 

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రానికి కరెక్ట్ గా ఒక సంవత్సరం అయ్యింది. రీలీజైన కొద్దీ రోజుల్లోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి ఇప్పటివరకు ఎన్నో అవార్డులు రివార్డులు అందాయి. అయితే ఇప్పుడు తెలుగు సినిమా ఉనికిని చాటి చెప్పేలా మహానటి చిత్రానికి అంత్యంత గౌరవం లభించింది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం.

తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని నటి సావిత్రి. దక్షిణాదిలో తొలి సూపర్‌స్టార్ హోదా దక్కించుకొన్న మహానటి. అలాంటి మహోన్నతమైన నటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకొన్న అతికొద్ది మంది హీరోయిన్లలో సావిత్రి ఒకరు. అలాంటి నటి జీవిత కథ ఆధారంగా మహానటి పేరుతో దర్శకుడు నాగ అశ్విన్ చిత్రాన్ని తెరకెక్కించారు. తెరకెక్కించిన కొద్దిరోజుల్లోనే సూపర్ సక్సెస్ సాధించిన ఈ చిత్రానికి దేశ విదేశాల్లో గౌరవం లభిస్తుంది. తాజాగా చైనా లో జరగనున్న షాంగై ఫిల్మ్ ఫెస్ట్ లో మహానటి చిత్రాన్ని ప్రదర్శించేందుకు సిద్ధం అయ్యారు. జూన్ నెలలో ప్రారంభం కానున్న 22వ షాంగై ఫిల్మ్ ఫెస్ట్ లో మహానటి మూవీ వేయడం గొప్ప గౌరవంగా చెప్పుకుంటు మెరిసిపోతున్నారు అబిమానులు. 

మే 9వ తేదీ మహానటి చిత్రం విడుదల అయి కరెక్ట్ గా ఒక సంవత్సరం.. ఈ సంవత్సర కాలంలో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నది ఈ చిత్రం.ఇక్కడి వరకు తెలిసిన విషయమే కానీ ఊహించని గెలుపుని సొంతం చేసుకున్న నటీనటుల గురించి..డైరెక్టర్ నాగ్ అశ్విన్ శ్రమ గురించి సావిత్రి అభిమానులు పొగుడుతూ ఉబ్బి తబ్బిబైపోతున్నారు.

సావిత్రి బయోపిక్ చిత్రం మహానటి గురించి మాట్లాడాలంటే మాటలు రావడం లేదంటు..  అది సినిమా కాదు ఒక కళాకారుని జీవితం అయిన సావిత్రి యదార్ధ సంఘటనలు, అనుభవాలు,అభిరుచులు,  ఆమె అందం ఆమె అభినయం హావభావాలు మంచితనం మానవత్వం కలబోసినది అనుకుంటున్నారు..

 మహానటి పాత్రలో కీర్తి సురేష్ కనపడకుండ అంతా సావిత్రి నే చూపించిన గొప్ప తనం డైరెక్టర్ ది అని ప్రసంసిస్తున్నారు. షాంగై లాంటి పెద్ద ఫిల్మ్ ఫెస్ట్ లో మహానటి ఉండటం చెప్పలేని ఆనందంగా ఉందని అంటున్నారూ విజయవాడ సావిత్రి కల పీఠం మెంబెర్స్.

సినిమాలో చూపించిన ప్రాణ స్నేహితురాలు..చిన్న నాటి గుర్తులను నెమరు వేసుకున్నారు. సుశీల పాత్ర ద్వారా అందరికి పరిచయమైన సావిత్రి ప్రాణ స్నేహితురాలు.సావిత్రి కి దక్కాల్సిన అన్ని కొంచం ఆలస్యంగా ఇప్పుడుడు దక్కుతున్నాయని ఆమె అన్నారు. అన్నింటిలో రాణించి సావిత్రి ల అవ్వాలి ఒకానొక సమయంలో అనుకునేవారూ కానీ విధి నాటకంలో అన్ని కనుమరుగు అయ్యాయని అన్నారు. లేడీ ధాన కర్ణురాలు అని ఆమె అన్నారు. షాంగై ఫిల్మ్ ఫెస్ట్ లో మహానటి చిత్రాన్ని ప్రదర్శించడం గొప్ప విశేషం అన్నారు. ఈ సత్కారం సావిత్రికి, తెలుగు ప్రజలకు, స్నేహితురాలైన నాకు జరుతున్న సత్కారంలా ఆమె భావించారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *