Breaking News

డేమన్ అండ్ పితియస్ కథ

డేమన్ అండ్ పితియస్ కథ

అంకితభావంతో, ఒకరిపట్ల మరొకరు అత్యంత విశ్వాసంతో స్నేహంచేసే ఇద్దరు ఆప్త మిత్రులను ఆంగ్లంలో డేమన్ అండ్ పితియస్ ( Damon and Pythias) అనటం వాడుకైంది. ప్రాచీన గ్రీసులోని సిరాక్యూజ్ ( Syracuse) ప్రాంతపు నియంత
డయోనీసియస్ ( Dionysius) రాజద్రోహనేరానికి పితియస్ కి మరణ శిక్ష విధిస్తాడు. అయితే మరణించే ముందు ఇంటి దగ్గర తాను చక్కదిద్దుకోవలసిన కొన్ని అత్యవసరమైన పనులున్న కారణంగా ఇంటికి వెళ్ళిరావటానికి తనకు కొద్ది సమయం ఇవ్వమని పితియస్ రాజును వేడుకుంటాడు. తాను తిరిగి వచ్చే వరకు తన స్థానంలో వేరొకరు బందీగా ఉండటానికి, తాను తిరిగిరాని పక్షంలో తనకు బదులుగా మరణశిక్షను స్వీకరించటానికి సిద్ధపడే వేరొక వ్యక్తి ఉంటే తనకు అలాంటి అనుమతి ఇస్తానంటాడు రాజు. అప్పుడు పితియస్ ఆప్త మిత్రుడు
డేమన్ తన మిత్రుని స్థానంలో చెరసాలలో బందీగా ఉండేందుకు ముందుకొస్తాడు. పనులు ముగించుకుని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా అన్నిటినీ అధిగమించి ఇచ్చిన మాటప్రకారం గడువు లోపల తిరిగి వస్తాడు పితియస్. ఈ ఇరువురు మిత్రుల పరస్పర విశ్వాసానికి, త్యాగ నిరతికీ ఆశ్చర్యపోయి, ముగ్ధుడైన రాజు పితియస్ మరణశిక్షను రద్దు చేసి మిత్రులు ఇరువురినీ విడుదలచేస్తాడు. ఇక అప్పటి నుంచి అతి సన్నిహితులు, ఒకరికోసం మరొకరు ప్రాణమిచ్చే ఇరువురు మిత్రులను ఆంగ్ల భాషలో ఇడియమాటిక్ గా ‘డేమన్ అండ్ పితియస్’ ( Daymon and Pythias) అనటం వాడుకయింది.

https://www.google.com/imgres?imgurl=https://images-na.ssl-images-amazon.com/images/I/511UoIJqfLL._AC_SX385_.jpg&imgrefurl=https://www.amazon.com/Damon-Pythias-Original-Scene-Lobby/dp/B01MQPR4T1&docid=77xqDbYlPuwMeM&tbnid=1qK5h0sub5ZKnM&vet=1&w=385&h=305&hl=en-GB&source=sh/x/im

— మీ..రవీంద్రనాథ్.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *