Breaking News

ఆరోగ్యానికి వేడిపాలు మంచివా.. చల్లటి పాలు మంచివా..

hot milk or Cold milk: పాలు సమీకృత ఆహారం. పాలల్లో ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, విటమిన్ డి ఉంటాయి. కనుక రోజు పాలను తాగితే.. అనేక అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు.. అయితే కొంతమంది వేడి వేడిగా పాలను తాగితే.. మరికొందరు చల్లారిన పాలను తాగడానికి ఇష్టపడతారు. వేడిపాలు తాగితే మంచిదా.. లేక చల్లటి పాలు తాగితే మంచిదా అంటే పాలను ఎలా తాగినా మంచిదే అంటున్నారు డాక్టర్లు. రోజూ ఒక గ్లాసు పాలను తాగేవారిలో ఎముకలు మంచి బలంగా ఉంటాయని శరీరానికి ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు.
చల్లటి పాలను తాగడం వలన కలిగే ఉపయోగాలు :
వర్షాకాలంలో , శీతాకాలంలో రాత్రిపూట వేడి వేడి పాలు తాగితే.. చర్మం వేడిగా ఉంటుంది. అంతేకాదు నిద్ర కూడా ఈజీగా పడుతుంది. వేడి పాలల్లో కూడా కాల్షియం, విటమిన్-డి, పొటాషియం ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక వేడి పాలు ఏ సమయంలో తాగినా ఈజీగా జీర్ణమవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *