Breaking News

ఎంతకీ తగ్గని మొండి దురద .. అలర్జీ నివారణ కు సలహాలు

అలర్జీ అనేది కేవలం శరీరంపై దద్దుర్ల రూపేణా మాత్రమే వస్తుందనుకోరాదు. తలలో కూడా వస్తుంది. తల దురదకు కేవలం పేలు, డ్యాండ్రఫ్ మాత్రమే కారణం అనుకోరాదు. అలర్జీ కూడా కారణమే. తల దురద వచ్చిందంటే ఆ బాధ చెప్పలేము. బాస్‌తో, సహోద్యోగులతో, స్నేహితులతోనో మాట్లాడే సమయంలో లేదా ఏమయినా ముఖ్యమైన పనులలో ఉన్నప్పుడు తల దురద పెడితే కలిగే చికాకు ఇంతా అంతా కాదు.
👉🏿తలదురదకు ఇలా చెక్ పెట్టండి…
ఇలా ఇబ్బందిపెట్టే తల దురద నుంచి తప్పించుకోవటానికి మిరియాలు బాగా ఉపయోగపడుతాయి. అర స్పూన్ మిరియాలు, అర స్పూన్ పాలతో కలిపి బాగా దంచాలి తర్వాత కొద్దిగా నీళ్లలో ఉడికించి పేస్టు మాదిరిగా చేసి దాన్ని ఆరబెట్టి కొంత వేడి ఉండగానే తలకు రుద్దాలి. అరగంట తర్వాత శీకాయ పొడితో తలస్నానం చేయాలి. ఈవిధంగా వారానికి మూడు, నాలుగు రోజులు చేస్తే తలదురద పూర్తిగా పోతుంది.

2.-అరికాళ్ళు, అర చేతుల్లో దురద వల్ల వాపు, శరీరంలో దద్దుర్లు ఉన్నాయా..?
ముందుగా ఎందుకు ఈ దురద వచ్చిందో తెలుసుకుంటే దాన్ని నివారించడం సులభమవుతుంది. కింది విషయాలను గమనించి ఎందువల్ల ఈ దురద వచ్చిందో తెలుసుకోండి. కొన్ని రకాల క్రిముల వల్ల, కొంతమందికి సాధారణంగానే అరచేయి, అరికాళ్లలో ఎక్కువ చెమట పడుతుంది. ఎప్పటికప్పుడు చెమటను తుడుచుకుంటూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఇన్‌ఫెక్షన్స్‌కు దారితీస్తుంది. కొంతమంది ఎక్కువగా నీటిలో నానుతూ పనిచేస్తుంటారు. నీటిలో అదేపనిగా నానడం కూడా అలర్జీకి కారణమవుతుంది. కొన్ని సార్లు డిటర్జెంట్‌లు కూడా కొంతమందిలో అలర్జీకి కారణమవుతాయి. అదే విధంగా కొన్ని రకాలైన నూనెలు, ఎరువులు, ఇంధనాలతో కూడా ఈ సమస్య వస్తుంది.

ఆహారం: ఉప్పు, పులుపు, కారం తక్కువగా ఉండే, బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు అధికంగా ఉండే తాజా పళ్ళు, గ్రీన్ సలాడ్‌లను తీసుకోవడం మంచిది. నీటిని బాగా తాగండి. తగినంత వ్యాయామం, ధ్యానం చేయండి.
3.-దురద, దద్దుర్లు నిరోధించేందుకు మరికొన్ని జాగ్రత్తలు…
– ఎందుకు దురద వచ్చిందో తెలుసుకోండి. నిర్లక్ష్యం చేయడం వల్ల ఆరోగ్యానికి నష్టం జరుగుతుంది.
– దురద సమస్య ఎక్కువగా ఉంటే ముందు జాగ్రత్తగా తీపి పదార్ధాలను తినటం తగ్గించాలి.
– శరీరాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచితే దురద నుంచి తప్పించుకోవచ్చు.
– మీరు వాడుకునే సబ్బు మీ చర్మానికి సరిపడేదిగా ఉండాలి.
– బయటకు వెళ్లొచ్చిన ప్రతీసారి చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలి.
వ్యక్తిగత భాగాలలోని దురదను నివారించేందుకు హోమ్ రెమెడీస్
వ్యక్తిగత భాగాలలో దురద కలగడం కొంచెం ఇబ్బందికరమైన సందర్భం. ప్రత్యేకంగా, బహిరంగ స్థలాలలో ఈ సమస్య కలిగితే మరింత ఇబ్బందికి దారి తీస్తుంది. ఇది సహజమే అయినా దీనిని నివారించేందుకు ప్రయత్నించవచ్చు. పనిమీద బయటికి వెళ్ళినప్పుడు వ్యక్తిగత భాగాలలో దురద కలగడం చేత దురదను నియంత్రించలేకపోవటంతో ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. అసలు, ఈ దురదకి కారణాలేంటో తెలుసుకుందాం. జననేంద్రియ మొటిమలు, మెనోపాస్, ఇన్ఫెక్షన్, కెమికల్స్ తో పాటు కొన్ని చర్మ సంబంధిత సమస్యల వలన దురద కలుగుతుంది. వీటితో పాటు వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం కూడా వ్యక్తిగత భాగాలలో దురద కలగటానికి ప్రధాన కారణంగా భావించవచ్చు. సంభోగం తరువాత పాటించవలసిన కనీస పరిశుభ్రతా చర్యలు లేకపోవటం కూడా వ్యక్తిగత భాగాలలో దురదకు దారితీస్తుంది. ఈ సమస్య ఇలాగే కొనసాగితే సమస్య మరింత జఠిలంగా మారుతుంది.
తులసి ఆకులు: యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ మైక్రోబయాల్ ప్రాపర్టీలు పుష్కలంగా కలిగి ఉండటం చేత వ్యక్తిగత భాగాలలోని దురదను తరిమికొట్టే శక్తి తులసి ఆకులకు కలదు. కొన్ని తులసి ఆకులను కొంత నీటిలో 20 నిమిషాల పాటు మరగనివ్వండి. ఆ తరువాత చల్లార్చి, వడగట్టిన ఆ నీటిని సేవించండి.

కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో నున్న హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ వలన చర్మానికి ఉపశమనం కలుగుతుంది. ప్రభావిత ప్రాంతంపై కొబ్బరినూనెను అప్లై చేయడం వలన దురద తగ్గుతుంది. వ్యక్తిగత భాగాలలో ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గించే గుణం కొబ్బరి నూనెలో కలదు. ప్రతి రోజూ ప్రభావిత ప్రాంతంపై కొబ్బరి నూనెను అప్లై చేయాలి. ఆరు కప్పుల నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను కలిపి ఈ మిశ్రమంతో మీ వ్యక్తిగత భాగాలను శుభ్రపరచుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

సముద్రపు ఉప్పు: వ్యక్తిగత భాగాలలో ఇన్ఫెక్షన్స్ ను నశింపచేసే అద్భుతమైన గుణం సముద్రపు ఉప్పులో కలదు. హానికర బాక్టీరియా మరియు ఫంగై యొక్క పెరుగుదలను అడ్డుకుని వ్యక్తిగత భాగాల వద్ద దురదను నివారిస్తుంది. 2 కప్పుల నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కలిపి ఈ మిశ్రమంతో మీ వ్యక్తిగత భాగాలను శుభ్రం చేసుకోండి. ప్రతి రోజూ ఈ రెమెడీని పాటిస్తే దురద సమస్య తగ్గుముఖం పడుతుంది.

వేపాకులు: వేప ఒక ఔషధ మొక్క. శతాబ్దాలుగా అనేక రకాలైన ఆరోగ్య సమస్యలకు వేప నుంచి అద్భుతమైన పరిష్కారాలు లభిస్తున్నాయి. వేపలో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలతో పాటు యాంటీ ఫంగల్ ప్రాపెర్టీలు కలవు. గుప్పెడు వేపాకులను స్నానపు నీటిలో వేసుకుని ఆ నీటితో స్నానం చేయండి. 4 కప్పుల నీటిలో కొన్ని వేపాకులను కలిపి పదినిమిషాల పాటు మరిగించాలి. చల్లార్చి, వడగట్టిన ఆ నీటితో మీ వ్యక్తిగత భాగాలను శుభ్రం చేసుకోవాలి.

పెరుగు: పెరుగులో మంచి బాక్టీరియా ఉంటుంది. అందుకే, వ్యక్తిగత భాగాలలో దురదను నివారించేందుకు సమర్థవంతమైన సహజసిద్ధ రెమెడీగా పెరుగును పేర్కొంటారు. తీపిలేని పెరుగుని ప్రతి రోజూ తీసుకున్నట్లైతే శరీరంలోని మంచి బాక్టీరియా స్థాయిలను పెంపొందిస్తుంది.

వెల్లుల్లి: వెల్లుల్లిలో యాంటీ బయాటిక్ మరియు యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు కలవు. ఇవి, వ్యక్తిగత భాగాలలో విపరీతమైన దురదని నివారించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. కొన్ని చుక్కల వెల్లుల్లి నూనెను తీసుకుని అందులో విటమిన్ ఈ నూనెను కలపండి. ఈ మిశ్రమాన్ని ప్రభావితమైన వ్యక్తిగత భాగాలపై అప్లై చేసి కాసేపటి తరువాత స్వచ్ఛమైన నీటితో శుభ్రపరచండి ఏమి సమస్య లు ఉంటే మి
నవీన్ నడిమింటి అడిగి తెలుసు కొండి
👉🏿6అమ్మయిలు లో సాధారణ సమస్య:
మా పాప వయసు 7 సంవత్సరాలు. తనకి రెండేళ్లుగా తెలుపు అవుతోంది. ఒకసారి డాక్టర్‌కు చూపించాం. వాసన, దురద వంటివేవీ లేవు కాబట్టి పెద్ద సమస్యేమీ కాదని చెప్పారు. అయినా మాకు ఆందోళనగానే ఉంది. అసలేంటీ సమస్య? దీనికి పరిష్కారమేంటి?*

సలహా: చిన్న వయసులోనే జననాంగం నుంచి స్రావాలు రావటమనేది తరచుగా చూసే సమస్యే. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే పెద్ద ఇబ్బందేమీ లేకపోవచ్చనే అనిపిస్తోంది. ఆడపిల్లల్లో రజస్వల కావటానికి ముందు శరీరంలో కొన్ని మార్పులు తలెత్తుతుంటాయి. వీటి ఫలితంగా తెలుపు కావటం వంటి సమస్యలు మొదలవుతుంటాయి. అందువల్ల రొమ్ములు ఎదుగుతున్నాయా? చంకల్లో వెంట్రుకలు మొలుస్తున్నాయా? అనేవి చూడాల్సి ఉంటుంది. త్వరలో రజస్వల అయ్యే అవకాశముంటే ఇలాంటి మార్పులు కనబడతాయి. అలాంటప్పుడు కొద్దిగా తెలుపు అవుతుంటుంది. కటి భాగంలో ఇన్‌ఫెక్షన్‌తోనూ కొందరికి తెలుపు కావొచ్చు. అయితే దురద, వాసన వంటివేవీ లేవని అంటున్నారంటే ఇన్‌ఫెక్షన్‌ లేదనే అనుకోవచ్చు. అలాగే కొందరిలో నులి పురుగుల మూలంగానూ తెలుపు కావొచ్చు. కాకపోతే ఇందులో దురద కూడా ఉంటుంది. మీ అమ్మాయికి ఇతరత్రా ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. మరీ దుస్తులు తడిసిపోయేంతగా తెలుపు కాకపోతే కంగారు పడాల్సిన పనేమీ లేదు.అప్పుడప్పుడు లోదుస్తుల్లో మరకల వంటివి కనబడితే పెద్ద ఇబ్బందేమీ లేదనే చెప్పుకోవచ్చు. నొప్పి, దురద వంటివి లేకపోతే మున్ముందు సమస్యాత్మకంగానూ పరిణమించకపోవచ్చు. కాకపోతే అమ్మాయికి శుభ్రతను పాటించటం నేర్పించాలి. కాటన్‌ లోదుస్తులు ధరించేలా, తరచుగా లోదుస్తులను మార్చుకునేలా చూసుకోవాలి. మరీ బిగుతుగా ఉండే జీన్స్‌ జోలికి వెళ్లకపోవటం మంచిది. కొందరు శుభ్రంగా ఉండటం కోసం మూత్రానికి వెళ్లినపుడు, మల విసర్జన చేసినపుడు యాంటీసెప్టిక్‌ ద్రావణాలను నీటితో కలిపి శుభ్రం చేసుకోవాలని చెబుతుంటారు. వీటితో మంచి కన్నా చెడే ఎక్కువ. ఇలాంటి ద్రావణాలతో జననాంగాల వద్ద ఉండే మంచి సూక్ష్మక్రిములు చనిపోయి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు. కాబట్టి శుభ్రంగా ఉండే మామూలు నీటితో కడుక్కోవాలి. అలాగే మల విసర్జన చేశాక ముందు నుంచి వెనక్కు కడుక్కోవటం నేర్పించాలి. ఎందుకంటే ఆడవాళ్లలో మలద్వారం జననాంగానికి దగ్గరగా ఉంటుంది. సరిగ్గా కడుక్కోపోతే జననాంగంలోకి మల పదార్థం వెళ్లిపోయి ఇన్‌ఫెక్షన్‌కు దారితీయొచ్చు. దీంతో తెలుపు వంటి సమస్యలు బయలుదేరొచ్చు. కాబట్టి శుభ్రత చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *