Breaking News

కంటి సమస్య-నివారణ

ఆయుర్వేద రీత్యా వాతదోషం ప్రకోపించడం వలన కంటిపొరలు ఏర్పడుతుంటాయి. ఈ వాత దోషం కంటిని పొడిబారినట్టు చేసి పారదర్శకత లోపించేట్టు చేయడం వలన కంట్లో పొరలు ఏర్పడి దృష్టిలోపం కలుగుతుంది. ఈ లోపం సరిచేయడానికి వాత దోష ప్రకోపాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తే మంచిదంటున్నారు నిపుణులు. ఈ కంటి పొరలను ప్రత్యేకించి కొన్ని మూలికలతో కలిపి పిండి తయారు చేసిన ఆవు నెయ్యిని వాడడమే మంచిది.

* 2 స్పూన్ల నెయ్యికి కొద్దిగా త్రిఫలచూర్ణం కలిపి రాత్రి నానబెట్టి ఉదయాన్నే వడబోసి సగం తాగి మిగిలిన నీటితో కళ్లను కడుక్కోవాలి. ఇలా చేయడం వలన రోగికి కంటి చూపు మెరుగవుతుంది.

* ఆవు పాలతో కొద్దిగా తెల్ల గలిజేరు వేరును ఆవునేతిలో మెత్తగా నూరి కంటికి పెడితే పొరలు కరుగుతాయి. ఇంకా చెప్పాలంటే.. బియ్యాన్ని నీటిలో మెత్తగా నూరి పెడితే కూడా అతిగా వ్యాపించే కంటి శుక్లాలు త్వరగా తగ్గిపోతాయి.

* పొద్దు తిరుగుడు చెట్టు గింజల చూర్ణాన్ని రోజుకు మూడు వేళ్లకు పట్టించి 21 రోజుల పాటు నీటితో వాడితే కంటి పొరలు తగ్గుముఖం పడుతాయి. కంటి సమస్య ఉన్నప్పుడు ముందుగా ఆయుర్వేద వైద్యున్ని సంప్రదించాకే.. వారి సలహా మేరకు అనుసరించడం మంచిది.

* తానికాయలోని గింజలను పాలలో అరగదీసి కంటికి పెడుతుంటే కంటి పొరలు తగ్గి దృష్టి మెరుగుపడుతుంది. ఆముదం గింజలోని రసాన్ని గుడ్డలో వడగట్టి 2 చుక్కల చొప్పున రెండు కళ్లల్లో ఉదయాన్నే వేస్తుంటే కంటి సమస్యలు తొలగిపోతాయి.

* పొడపత్రి గింజలను కలబంద గుజ్జులో 10 రోజులు నానబెట్టి నీడన ఎండించి ఒక గింజను నీళ్లతో అరగదీసి కంటికి కందిగింజంత పెడుతుంటే అవి కంటిపొరలను కోసి మంచి

*కంటి శుక్లాలు ( CATARACT )*

కంటిలో కను గుడ్డుపైన తెల్లటి పొర వస్తుంది . చూపులో స్పష్టత తగ్గుతుంది . వస్తువులు రెండుగా కనబడతాయి . పెద్ద వయసులో ఎలాంటి నొప్పి , బాధా లేకుండా క్రమేపీ చూపు తగ్గుతోందంటే , దానిని శుక్లంగా అనుమానించొచ్చు .

సలహాలు* :

1. ఒక గ్లాసు క్యారట్ రసం ప్రతి రోజు ఉదయం , సాయంత్రం త్రాగండి .

2 . రాత్రి కొన్ని ఎల్లిపాయ ( Garlic ) రెబ్బలను నీటిలో నానబెట్టండి . ఉదయం ఎల్లిపాయ రెబ్బలను నమిలి , నమిలి తినండి . తర్వాత ఆ నీళ్ళను త్రాగండి .

3 . స్వచ్చమైన తేనెను కళ్ళకు పూయండి .

4 . ధనియాలు + సోంపు + పటిక బెల్లం లను సమ పాళ్ళలో తీసుకొని , చూర్ణంగా తయారు చెయ్యండి .
1 spoon చూర్ణం + 1 గ్లాసు నీళ్ళలో కలిపి త్రాగండి . ఉదయం , సాయంత్రం త్రాగండి .

5 . తెల్ల ఉల్లిపాయ రసం + తేనెను సమపాళ్ళలో కలపండి.
1 భాగం రసం + 2 భాగాల గులాబి పూల నీళ్ళు ( Rose Water ) లను కలిపి , కొన్ని చుక్కలను కళ్ళలో వేయండి .

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *