Breaking News

కరోనా వైరస్ సోకినవారికి దివ్యౌషధంగా తిప్పతీగ

THIPPATHEEGA

కరోనా వైరస్ సోకినవారికి తిప్పతీగ దివ్యౌషధంగా పనిచేస్తుంది. మన శరీరానికి సహజసిద్ధంగా ఉండే రోగనిరోధక శక్తిని పెంపొందించటంతోపాటు, తిప్ప అన్నిరకాల జ్వరాలను పోగొట్టే అద్భుతమైన జ్వరహారిణి ( Febrifuge) గానూ పేరొందింది. తిప్ప తీగను సంస్కృతంలో అమృతవల్లీ అంటారు. పేరుకు తగ్గట్టే ఇది మరణం లేనిది. ఈ తీగ ఏదైనా వృక్షానికి అల్లుకుంటే దాని మొదలు కోసివేసినా చిత్రంగా అది పెరిగి, పుష్పించి, ఫలిస్తుంది. ఆధారవృక్షం నుంచి తనకు కావలసిన ఖనిజ లవణాలను స్వీకరిస్తూ తన ఆకులలోని పత్రహరితం( క్లోరోఫిల్) సాయంతో సూర్యరశ్మిలో తన మనుగడకు అవసరమైన పిండి పదార్థాన్ని మిగిలిన మొక్కలలాగే తానే స్వయంగా తయారు చేసుకుంటుంది. హిందీలో దీనిని ‘గులాంచా’ అనీ ‘అమృతా’ అనీ అంటారు. సంస్కృతంలో దీనికి ‘గుడూచీ’ అనే మరో పేరు ఉంది. లేత పసుపు వన్నెలో ఉండే దీని పూలు ఆడవి, మగవి వేర్వేరుగా ఉంటాయి. మగపూలు గుత్తులుగా, ఆడ పూలు ఒంటరిగా ఉంటాయి. గుత్తులుగా కాసే దీని చిన్న, గుండ్రని కాయలు పండితే ఎర్రగా, ఆకర్షణీయంగా తయారౌతాయి. ఈ తీగ కాండానికి ఎన్నో వైద్యపరమైన ప్రయోజనాలున్నాయి. కాండం చేదుగా ఉండి శరీరపు వాపులు, నొప్పులను తగ్గిస్తుంది. కడుపులోని క్రిములను నశింపజేస్తుంది. అన్నిరకాల జ్వరాలను పోగొడుతుంది. వాంతులను నివారిస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపులోని గ్యాస్ ను వెడలిస్తుంది. నోటికి రుచి పుట్టిస్తుంది. గుండెకు బలాన్నిస్తుంది. కాండం పసరు నీళ్లలో కలిపి గాయాలు, పుళ్ళు శుభ్రం చేయటానికి వాడతారు. రక్తహీనతను పోగొట్టి, రక్తవృద్ధి కలిగించటానికి, ఉబ్బసం, దగ్గు నివారించి, కళ్ళెను వెడలించటానికి కూడా ఇది ప్రయోజనకరం. కడుపు ఉబ్బరం, కాలిక్ (Colic) వంటి తీవ్రమైన కడుపు నొప్పులను తగ్గిస్తుంది. కుష్ఠు, ఎరిసిపెలాస్ వంటి చర్మవ్యాధులను పోగొడుతుంది. పురుషుల వీర్యంలోని దోషాలను పోగొట్టి వారిని పునర్యవ్వనవంతులను చేస్తుంది. సాధారణ బలహీనతలకు కూడా ఇది దివ్యౌషధం. తిప్ప తీగలోని ఔషధ గుణాలను అన్నిటినీ మనం అమృతారిష్ట అనే ఆయుర్వేద ఔషధం వాడితే పొందవచ్చు. ఈ ఔషధం తయారీలో తిప్పతీగతోపాటు దశమూలాలు, ఏడాకులపొన్న, కటుకరోహిణి, నాగకేసరములు, అతివస, కొడిశపాల విత్తులు, తుంగముస్తలు, జీలకర్ర, త్రికటుకములు ( మిరియాలు, శొంఠి, పిప్పళ్ళు) మొదలైనవన్నీ వేసి పాత బెల్లంతో కాస్తారు. ప్రతిరోజూ రెండు పూటలా భోజనం తరువాత మూడు నుంచి ఆరు టీ స్పూనుల అమృతారిష్టను అంతే మొత్తం నీటితో కలిపి తాగితే ఎంతో ప్రయోజనకరం. మార్కెట్లో దొరికే జండు, బైద్యనాథ్ కంపెనీల అమృతారిష్ట ప్రశస్తమైనవి. జండు కంపెనీది 450 ml. బాటిల్ రూ. 122 /- కాగా బైద్యనాథ్ వారిది రూ. 96/-. ఈ ఔషధాలకు ఎలాంటి ఎక్స్ పైరీ తేదీ ఉండదు. ఎంత నిల్వ ఉంటే ఔషధం అంత బాగా పనిచేస్తుంది.

THIPPATHEEGA00 THIPPATHEEGA01 THIPPATHEEGA02

తిప్పతీగ కాండం నుంచి తీసే తిప్ప సత్తు లేక గుడూచీ సత్వము ( Amorphous Crystals) కూడా వైద్యపరంగా ఎంతో ప్రయోజనకరం.

మెనిస్పెర్మేసీ ( Menispermaceae) కుటుంబానికి చెందిన తిప్పతీగ శాస్త్రీయ నామం Tinospora cordifolia.వైద్యపరంగా ఇన్నిన్ని ప్రయోజనాలున్న తిప్పతీగ నిమ్మ చెట్లకు మాత్రం ఎంతో అపకారం కలిగిస్తుంది. నిమ్మ చెట్లకు బలంగా అల్లుకున్న తిప్పతీగలు వాటి సారాన్ని గ్రహిస్తూ, వాటిని ఒంచేసి, వాటి పెరుగుదలను అడ్డుకుంటాయి. ఒకోసారి తిప్పతీగల కారణంగా బలహీనమైన చిన్న నిమ్మమొక్కలు చచ్చిపోతూ ఉంటాయి కూడా. అందుకే నిమ్మ రైతులు తిప్పతీగల పట్ల చాలా మెలకువ కలిగి ఉంటారు.తిప్పతీగ ( అమృతవల్లీ లేక గుడూచీ) కాండం కషాయం తో తయారు చేసే ఆయుర్వేద ఔషధం అమృతారిష్ట. ఆసవారిష్టాలు వేటిని వాడటానికైనా గడువు తేదీ అంటూ ఏదీ లేదు. అవి ఎంత నిల్వ ఉంటే అంత శ్రేష్టం. అయినా పదేళ్లకు మించి నిల్వ ఉన్న ఆసవారిష్టాలు కూడా వాడకపోవటమే మంచిది.

మొదటి ఫోటో ఇటీవలి ముసురు వానలకు మా నిమ్మతోటలో పెరిగిన కలుపు తీయించే సందర్భంగా నేను తీసినది. తిప్పతీగ పూలు, కాయల ఫోటోలు కూడా చూడవచ్చు.

— మీ..రవీంద్రనాథ్.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *