Breaking News

కోవిడ్-19 నేపథ్యంలో 60 సంవత్సరాలకు పైబడిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలి

కోవిడ్-19 వైరస్ ప్రభావం వృద్ధులపై అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకనగా యువకులతో పోలిస్తే వృద్ధుల్లో రోగ నిరోధకశక్తి తక్కువ. అందుకే కోవిడ్ వైరస్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అదే సమయంలో కోవిడ్ పాజిటివ్ పేషెంట్లలో 60ఏళ్లకు పైబడిన వారి మరణాల రేటును తగ్గించేందుకు దిగువ ప్రతిపాదించిన సూచనలను పాటించాల్సిన అవసరం ఉంది.

మరింత జాగ్రత్తగా ఉండడానికి సూచనలు:

* వృద్ధులలో రోగనిరోధక శక్తి మరియు శరీర పటుత్వము తక్కువగా ఉంటుంది. అలాగే బహుళ అనుబంధ వ్యాధుల వల్ల కోవిడ్-19 వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. వృద్ధులు ఇంట్లోనే ఉండాలి, సందర్శకులను కలవకుండా ఉండాలి. ఒకవేళ కలవాల్సి వస్తే కనీసం ఒక మీటరు దూరం పాటించాలి.

* ప్రభుత్వం నిబంధనలు సడలించిందని ఏమాత్రం కోవిడ్ జాగ్రత్తలు తీసుకోకుండా పబ్లిక్ ట్రాన్స్ పోర్టు, కూరగాయల మార్కెట్లు ఇతర రద్దీ ప్రాంతాల్లో నిర్లక్ష్యంగా తిరగడం మానుకోండి.

* సబ్బు మరియు నీటితో క్రమం తప్పకుండా చేతులు, ముఖం కడుక్కోవాలి. దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు మోచేయిని అడ్డుపెట్టడం, టిష్యూ పేపర్ వాడి పారవేయడం లేదా రుమాలును ఉపయోగించి తరువాత శుభ్ర పరచడం లాంటివి అలవాటు చేసుకోవాలి.

* తాజాగా ఇంట్లో వండిన వేడి భోజనం తీసుకుంటూ, ఒంట్లో తరచూ హైడ్రేటింగ్ మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి తాజా పళ్లరసాలు తీసుకోవాలి.

* వృద్ధులు కంటి శుక్లం, మోకాలి మార్పిడి వంటి శస్త్ర చికిత్సలను వాయిదా వేసుకోవాలి. ఆరోగ్య సంరక్షణకు ఎప్పటికప్పుడు వైద్యులను ఫోన్ లో సంప్రదించి తదనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.

* పార్కులు, మార్కెట్లు, మత సంబంధమైన ప్రదేశాలు వంటి రద్దీ ప్రాంతాలకు వెళ్లకూడదు

* మరీ ముఖ్యంగా 60ఏళ్లు పైబడిన వయసు ఉన్నవారు ఇంట్లోనే ఉండాలి. ఎటువంటి రిస్క్ తీసుకోకూడదు.

వెంటిలేటర్ల గురించి తెలుసుకోండి:

* ‘వెంటిలేటర్ అనేది ఒక సంక్లిష్టమైనది. దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే రోగిని ప్రమాదంలో పడేస్తుంది. సాంకేతిక అంశాలు సవాళ్లతో కూడుకుని ఉంటాయి. వాటి గురించి అవగాహన ఉన్న మత్తుమందు నిపుణుల వంటి వారిని వాడుకోవచ్చు. నిజానికి వారికి ఉండే నైపుణ్యాలు భిన్నమైనవి. థియేటర్లో వారు కొంత మెరుగైన రోగుల్నే ఆపరేషన్ కోసం సిద్ధం చేస్తుంటారు. ఐసీయూల్లో ఉండే పేషెంట్ల ఆరోగ్యం మరింత దిగజారి ఉంటుంది.

* వెంటిలేటర్ మీద ఉన్న వ్యక్తి మాట్లాడలేరు, తినలేరు, లేదా సహజంగా ఏమీ చేయలేరు. అన్నీ యంత్రమే మిమ్మల్ని సజీవంగా ఉంచుతుంది అంతే. దీని నుండి వారు అనుభవించే అసౌకర్యం మరియు నొప్పి అంతా ఇంతకాదు. యంత్రానికి అవసరమైనంత కాలం ట్యూబ్ టాలరెన్స్ ఉండేలా వైద్య నిపుణులు మత్తు మందులు మరియు నొప్పి నివారణ మందులను ఇవ్వాలి. ఇది ఒకరకంగా కృత్రిమంగా కోమాలో ఉండటం లాంటిది.

* వెంటిలేటర్ చికిత్సలో 10-20 రోజుల తరువాత ఒక యుక్తవయసు గల రోగి 40శాతం వరకు బరువు కోల్పోతాడు. నోరు లేదా గొంతులో గాయం, అలాగే పల్మనరీ లేదా గుండె సమస్యలను ఎదుర్కొంటాడు.

* ఈ కారణంగానే వృద్ధులు లేదా అప్పటికే బలహీనంగా ఉన్నవారు చికిత్సను తట్టుకోలేక చనిపోతారు. మనలో చాలా మంది ఈ కోవలోనే ఉన్నారు. కాబట్టి మీరు ఇక్కడ కోవిడ్ బారినపడి ఈస్థాయిలో ఇబ్బంది పడకూడదు అనుకుంటే సురక్షితంగా ఉండండి.

కోవిడ్ బారినపడిన వృద్ధుల మరణాల రేటు తగ్గించేందుకు మార్గదర్శకాలు

కరోనా పాజిటివ్ పేషెంట్లలో 60ఏళ్లకు పైబడిన వారి మరణాల రేటును తగ్గించేందుకు దిగువ ప్రతిపాదించిన చర్యలను తీసుకోవాల్సిందిగా ఇదివరకే కేంద్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ మార్గదర్శకాలు జారి చేసింది. .

1. 60 సంవత్సరాలు పైబడిన వారికి వెంటనే ట్రూనాట్ టెస్ట్ చేయాలి. ఒకవేళ పాజిటివ్ అని వస్తే వెంటనే ఈ కింది ప్రొటోకాల్ పాటించాలి.

2. ట్రునాట్ పరీక్ష ద్వారా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను ఊహాజనిత సానుకూల కేసులుగా పరిగణించబడతాయి. ఈ కేసులనన్నింటినీ దగ్గరలో ఉన్న కోవిడ్ హాస్పటల్ కు తరలించి ఎవరితోనూ కలిసే అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి కేసులన్నింటికి మరుసటి రోజు RT-PCR టెస్ట్ చేయాలి. ఆ ప్రకారం కోవిడ్ చికిత్స కొనసాగించాలి.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *