Breaking News

చియా గింజలు

 

ఈ మధ్య మనం చియా గింజల్ని గురించి ఎక్కువగా వింటున్నాం. ఆరోగ్యపరంగా ఎంతో ప్రయోజనకరమైన చియా గింజల్ని గురించి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

25594394_1684304971640227_5451581346721318104_n

తులసి జాతి (Mint Family) అంటే లామియేసీ కుటుంబానికి
( Lamiaceae Family) చెందిన శాల్వియా హిస్పానికా (Salvia hispanica ) అనే శాస్త్రీయ నామం కలిగిన మొక్క విత్తనాలే ఇవి. ఈ మొక్క జన్మస్థలం మధ్య అమెరికా లోని దక్షిణ మెక్సికో, గ్వాటెమాలా దేశాలు. ఒకప్పుడు అక్కడి అజ్టెక్(Aztec ) జాతులకు మొక్కజొన్న, బీన్స్ తరువాత ఈ చియా గింజలే ప్రధాన ఆహారం. కొన్ని దక్షిణ అమెరికా దేశాలలో నేటికీ వీటిని పండిస్తారు. ఆహార పానీయాల తయారీలో వీటిని వినియోగిస్తారు. ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైన ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ ( Omega -3 Fatty acids ) పుష్కలంగా ఉండే కారణంగా ఇప్పుడు అందరూ వీటి సాగు, వినియోగం మీద దృష్టి పెడుతున్నారు. ఈ గింజల్ని ఏదైనా ద్రవపదార్థంలో నానబెడితే ప్రతి గింజ చిత్రంగా తన బరువుకి పన్నెండు రెట్ల బరువుగల ద్రవాన్ని పీల్చుకుంటుంది. ఆ గింజలపైన తెల్లటి గుజ్జు వంటి మ్యూకస్ పొర ఏర్పడుతుంది.

ఈ గింజల్ని ఆహారంలో పలు రకాలుగా వినియోగిస్తారు. వీటితో కార్న్ ఫ్లేక్స్ లా చేసి బ్రేక్ ఫాస్ట్ సెరియల్స్ (Breakfast Cereals) గానూ, ఈ పిండితో స్మూతీస్ చేసుకుని, ఈ పిండిని పాకంపట్టి జెల్ లాగా తయారు చేసుకుని తింటారు. ఈ పిండితో బ్రెడ్ తయారుచేసుకుంటారు. కొన్ని దేశాలలో ఈ గింజలతో షర్బత్ తయారు చేసుకుంటారు.

ఎండు చియా గింజలలో 42 శాతం పిండిపదార్థం, 16 శాతం మాంసకృత్తులు, 31 శాతం కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఈ గింజల్లో బి – విటమిన్లు (Thiamin, Niacin) 54, 59 శాతం చొప్పున, Riboflavin, folate 14 శాతం, 12 శాతం చొప్పున ఉన్నాయి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, జింక్ వంటి ఉపయుక్త ఖనిజాలు ఈ గింజలలో పుష్కలంగా ఉంటాయి.

కొందరు తెలియక వీటిని సబ్జా గింజలుగా పొరబడుతుంటారు. నానబెట్టినప్పుడు గింజల మీద గుజ్జువంటి మ్యూకస్ ఏర్పడడం సబ్జా, చియా గింజలలో సామాన్య లక్షణం.ఈ రెండు మొక్కలూ తులసి జాతి ( Mint Family- లామియేసీ) కి చెందినవే. అయితే ఈ రెండూ వేర్వేరు. చియా గింజలు ఎండువి కూడా ఆహారంగా ఉపయోగపడతాయి. సబ్జా గింజలు నానబెట్టి మాత్రమే వినియోగించాలి. సబ్జా తులసి మొక్క శాస్త్రీయ నామం Ocimum basilicum.

మనకు గుండె జబ్బులు రాకుండా మన ఆరోగ్యం చక్కగా ఉండాలంటే ఒమేగా 3 ఫాటీ ఆమ్లాలు చాలా ముఖ్యం. ఈ ఫాటీ యాసిడ్ చేపలలో ఎక్కువగా లభిస్తుంది. చేపలు తినని శాకాహారులకు ఉపయోగకరంగా ఉండేందుకు సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CFTRI) చియా నూనెను అభివృద్ధి చేసింది. చియా కొవ్వుతో తయారుచేసిన చాకొలెట్లు, ఐస్ క్రీములు కూడా త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. ఇదివరలో ఒమేగా 3 ఫాటీ ఆమ్లాల లోపమున్న శాకాహారులు (కాడ్ లివర్ ఆయిల్ – Cod liver oil ) అనే చేపనూనెను వాడుకునే వారు. వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలోనూ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలోని కొన్ని ప్రదేశాలలోనూ చియా గింజలు సాగుచేస్తున్నారు. అయితే సాగు విస్తీర్ణం చాలా తక్కువ. చియా గింజలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చియా గింజల నూనెతో తయారు చేసిన పదార్థాలు తింటే శరీరం బరువు తగ్గుతుందని శాస్త్రపరిశోధనలలో రుజువైంది.

కనుక రానున్న రోజులలో ఆరోగ్య పరిరక్షణ కోసం మనమంతా చియా గింజలు, నూనె వాడుకొనడానికి అలవాటుపడాల్సి ఉంటుంది.

— మీ.. రవీంద్రనాథ్.

9849131029

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *