Breaking News

డ్రై ఫ్రూట్స్ లో రారాజు – అంజీర్…

కొంచెం వగరు, కొంచెం తీపి, కాస్త వులువు ఉండే అంజీర్‌ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆకట్టుకునే రంగూ, రూపం గానీ అంజీర్ కు లేవు. కాని ఇవీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అద్భుతమైన రుచితోపాటు పోషకవిలువలు కూడా పుష్కలంగా ఇందులో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా డ్రైఫ్రూట్స్ రూపంలోనే అంజీర్ వాడకం ఎక్కువ. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. అందుకే ఇవి ‘అకేషనల్’ నుంచి, నిత్యావసర వస్తువులుగా మారాయి. డ్రైపూట్లో ఐరన్ చాలా ఎక్కువ. కడుపు నొప్పి, జ్వరం, చెవినొప్పి, లైంగిక వ్యాధులను తగ్గించడంలో కీలకపాత్ర వహిస్తాయి. రక్తహీనత నుంచి విముక్తి కలిగిస్తాయి. ఎంతకాలమైనా నిలువ చేసుకో వచ్చు. దూర ప్రయాణాల్లోనూ వాడుకోవచ్చు.
నిత్యం రెండు అంజీర్ పండ్ల‌ను భోజనానికి ముందు తిన్న‌ట్ట‌యితే వారిలో ర‌క్తం బాగా ప‌డుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. మ‌లేరియా, టైఫాయిడ్‌, డెంగీ వంటి విష జ్వ‌రాల బారిన ప‌డి ప్లేట్‌లెట్లు త‌గ్గిన వారికి ఈ పండ్ల‌ను తినిపిస్తే వెంట‌నే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి. ప్రత్యేకించి అంజీర పండులో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌తో పాటు కావలసినంత పీచుపదార్థం కూడా ఉంటుంది. అంజీరలో ఉండే పీచుపదార్ధం పెక్టిన్ వలన మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. బరువు తగ్గడంలో పీచుపదార్థాలు చేసే మేలు అంతాఇంతా కాదు. అంజీర్‌లో అలాంటి పీచు ఎక్కువ. పేవుల్లోని గోడలకు అంటుకున్న వ్యర్థపదార్థాల్ని పీచుపదార్థం శుభ్రం చేస్తుంది. బరవుతగ్గడం తేలికవుతుంది. మొలలు ఉన్న వాళ్లు రెండు లేదా మూడు అంజీర్పళ్లను నానబెట్టి తీసుకోసుకుంటే తగ్గిపోతాయి.పలురకాల పోషకాలతో పాటు శరీరానికి ఎంతో మేలు చేసే ఫైటో కెమికల్స్‌ కూడా సమృద్ధిగా ఉంటాయి.
కిడ్నీ స్టోన్స్‌ను తగ్గించటానికి 4-5 అంజీర పండ్లను నానబెట్టి క్రమం తప్పకుండా తింటుంటే రాళ్లు కరుగుతాయి. సరిగ్గా నిద్రలేని వారు రాత్రి ఏడు గంటల తరువాత మూడు అంజీరపు పళ్ళు తిని, పాలు తాగితే చక్కగా నిద్ర పడుతుంది. తరచూ జలుబు చేసిందంటే ఈ అంజీరపు పళ్ళ రసం తాగితే బాగుంటుంది. ఆడపిల్లలు రోజు రెండు పళ్ళు తింటే మొటిమలు తగ్గి ఆకర్షణీయంగా తయారవుతారు. కొలెస్ట్రాల్‌ను తగ్గి స్తుంది. స్త్రీ – పురుషులిద్దరూ రెండు అంజీరా పండ్లు, పాలు తీసుకుంటే యవ్వనాన్ని చిరకాలం ఉంచుకోవచ్చు.
ఎదుగుతున్న పిల్లలు ఈ పండ్లను తినడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. తలలోని చుండ్రును నివారిస్తుంది. 3-4 అంజీరలను నానబెట్టి తలకు మర్దన చేయటం వల్ల తలలోని చుండ్రు పోతుంది. ఇన్ని ఉపయోగాలు గల అంజీరను క్రమం తప్పకుండా తినటం వల్ల చాలా లాభాలు పొందవచ్చును. కఫం బాగా పేరుకుపోవడం వల్ల వచ్చే దగ్గుతో పాటు, శ్వాసకోశ పరమైన ఇబ్బందులు, ఉబ్బసం వంటి ఇతర సమస్యల నుంచి చక్కని ఉపశమాన్ని ఇచ్చేవి ఎండు అంజీర పండ్లు. ఒకటి రెండు పండ్లను రెండు గంటల పాటు నీళ్లల్లో నానబెట్టి, ఆ తర్వాత గ్లాసు పాలల్లో వేసి మరిగించి, రోజుకు రెండు పూటలా సేవిస్తే, చాలా త్వరితంగా ఉపశమనం పొందవచ్చు. కొంత మంది కళ్లు ఏమాత్రం తేమ లేనంతగా పొడిబారిపోతాయి, కళ్లల్లో దురద, మంట కూడా రావచ్చు. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండే అంజీర పండ్లు కళ్లకు ఆ దృష్టిలోపాలు కూడా చాలావరకు తగ్గుతాయి. ఎండు పండ్లలో ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండటం వల్ల హృద్రోగ నివారణకీ తోడ్పడతాయి. ఎండు అంజీరాలలో ఫెనాల్, ఒమేగ3 మరియు ఒమెగ6 ఫ్యాటీ ఆసిడ్స్ చాలాఎక్కువగా ఉన్నాయి. అందువల్ల గుండె జబ్బుల రిస్క్ నుండి బయట పడవచ్చు. అధిక బ్లడ్ ప్రెజర్ తో బాధపడే వారికి ఇది ఫర్ ఫెక్ట్ ఫ్రూట్. హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడేవారు, వారి రెగ్యులర్ డైట్ లో పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలిని సూచిస్తుంటారు. చాలామందికి శారీరక బలహీనతవల్ల నోటిలో పుండ్లు, పెదవుల పగుళ్లు, నాలుకు మంట వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివారు అత్తిపండ్లను తీసుకుంటే హితకరంగా ఉంటుంది. అంజీర ఆకులు మరియు పండ్లు షుగరు పేషెంట్లకు అల్పాహారం క్రింద వాడుకొవచ్చు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *