Breaking News

తాటిముంజులు

Thati Munjalu

 

వేసవికాలంలో అరుదుగా దొరికే తాటిముంజులకు మంచి గిరాకీ ఏర్పడింది. తాటిచెట్ల ద్వారా ప్రకృతిపరంగా లభించే ఈ తాటిముంజులు తింటే వేసవిలో చల్లదనం వస్తుందని ప్రజల నమ్మకం. ఈ తాటిముంజులు మాడుగుల పట్టణంలో వీధివీధినా తట్టలతో విక్రయిస్తున్నారు. డజను తాటిముంజులు రూ.15లకు ధర పలుకుతుంది.వేసవిలో మాత్రమే ఈ ముంజులు తాటిచెట్ల ద్వారా లభ్యమవుతాయని, వేసవి మూడునెలల్లోనే అమ్మకాల ద్వారా జీవనోపాధి కొనసాగిస్తామని ముంజుల వ్యాపారులు చెబుతున్నారు.

1) ప్రకృతి సహజ సిద్ధంగా దొరికే తాటిముంజులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
2) వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి.
3) శరీరం మొత్తాన్ని హైడ్రేట్ చేసి , జీర్ణవ్యవస్థకు చలవ చేస్తాయి.
4) శరీరంలో పేరుకున్న చెడ్డ కొలెస్ట్రాల్ , అధికబరువు తగ్గిస్తాయి.
5) చర్మం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *