Breaking News

బీట్‌రూట్‌తో అల్జీమర్స్‌కు బ్రేక్‌

 బీట్‌రూట్‌తో అల్జీమర్స్‌కు బ్రేక్‌
********
వయసు పైబడటం అనేది సాధారణమే అనిపించవచ్చు. ఆ వయసులో మతిమరుపు రావడం కూడా సహజమే అనిపించవచ్చు. అయితే ఈ సమస్యలు వచ్చిపడే వేగాన్ని బాగా తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయనే విషయం చాలా సార్లు మన గమనంలోకి రాదు. అలా అని, ఆ ప్రక్రియ ఏవో మందులు, మాత్రలతో జరుగుతుందని కూడా కాదు. ప్రకృతి సహజమైన సాధారణ ఆహార పదార్థాల్లోనే అవన్నీ ఉన్నాయి. ఈ సందర్భంగా బీట్‌రూట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బీట్‌రూట్‌లో సాధారణ పోషకాలతో పాటు, అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా, వ్యర్థపదార్థాలను శరీరంలోంచి తొలగించడంతో పాటు, గుండె ఆరోగ్యాన్ని పెంచడంలోనూ ఇది బాగా ఉపయోగపడుతుంది.
 
వీటన్నింటికీ మించి మరో విశేష ప్రయోజనం కూడా బీట్‌రూట్‌ వల్ల కలుగుతుందని అమెరికాలోని సౌత్‌ ఫ్లోరిడా యూరివర్సిటీకి చెందిన పరిశోదకులు ఇటీవల తమ అధ్యయనంలో కనుగొన్నారు. బీట్‌రూట్‌ వినియోగం వల్ల మతిమరుపు కలిగించే అల్జీమర్‌ వ్యాధి పెరిగే వేగం బాగా తగ్గిపోవడమే ఆ విశేషం. ప్రత్యేకించి మెదడులో తయారై అల్జీమర్‌ వ్యాధిని కలిగించే ఒక ప్రత్యేకమైన ప్రొటీన్‌ చర్యలను బీట్‌రూట్‌ నియంత్రిస్తుందని వీరు కనుగొన్నారు. అలాగే అల్జీమర్‌ వ్యాధి పెరిగేలా చేసే మెదడులోని కొన్ని రసాయన చర్యలను బీట్‌రూట్‌లోని బెటానిన్‌ అనే మూలకం కట్టడి చేస్తుందని పరిశోధకుల్లో ఒకరైన లి-జూన్‌ మింగ్‌ స్పష్టం చేశారు.

కండరాల శక్తి కోసం..!

కొందరు చూడ్డానికి ఎంత ఆరోగ్యంగా కనిపించినా.. కండరాల బలం మాత్రం ఉండదు. ఆ కండర శక్తి సొంతం కావాలంటే… బీట్‌రూట్ రసం తాగాల్సిందే! ఇందులో నైట్రేట్‌లు ఎక్కువగా ఉంటాయి. అవి శరీరానికి నైట్రిక్ ఆమ్లాన్ని అందిస్తాయి. జీవక్రియల రేటుని మెరుగుపరుస్తాయి. గుండె నుంచి ప్రతి శరీర భాగానికి ముఖ్యంగా కండరాలకు రక్తప్రసరణ బాగా అందుతుంది. అంతేకాదు, గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి వరసగా కొన్నాళ్లపాటు బీట్‌రూట్ రసం తాగించడం వల్ల… కండరాలూ, శరీరం దృఢంగా తయారైనట్టు వైద్యులు గుర్తించారు. నైట్రేట్లు శరీరానికి అందడం వల్ల శరీరంలో రక్తనాళాలు ఉత్తేజిమతమై, రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. దీనివల్లా కండరాల నొప్పులు తగ్గుముఖం పడతాయి. అందుకే వయసు పెరిగే కొద్దీ బీట్‌రూట్ రసానికి తగినంత ప్రాధాన్యమివ్వాలి. కనీసం వారానికి రెండు సార్లయినా బీట్‌రూట్‌ని ఆహారంలో తీసుకుంటే మంచిది.

• బీట్‌రూట్‌  పడగ్గదిలో ఇద్దరూ చురుగ్గా ఉండేదుకు ఉపకరిస్తుంది బీట్‌రూట్‌. ఇందులో నైట్రేట్‌ అధికం. దీనివల్ల మడుచుకుపోయిన రక్తనాళాలు సేచ్ఛగా విచ్చుకుని.. రక్తప్రసరణ సుఖవంతం అవుతుంది. ఫలితంగా దాంపత్యసౌఖ్యం మీ ఆసక్తి ఏర్పడుతుంది.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *