Breaking News

బూడిద గుమ్మడి ఔషధ గుణాలు

బూడిద గుమ్మడి ఔషధ గుణాలు
●●●●●●●●●●●●●●●●●●●●●

బూడిద గుమ్మడికాయను ఔషధంగా కూడా తీసుకోవచ్చు ఆయుర్వేద వైద్యం లో కొన్ని రకాల ఔషధాలతో కలిపి చర్మవ్యాధులలో, పిత్త శాంతికి, శరీరంలో శక్తిని వృద్ధి చేయడానికి ఇస్తుంటారు. బుడిద గుమ్మడికాయను లేహ్యాలుగా
తయారు చేయలేనివారు కాయగానూ పుచ్చుకోవచ్చు. .

ఈ కాయ శరీరంలో వేడిని తగ్గించి, మూత్రం సాఫీగా అవడానికి సహాయపడుతుంది. విరేచకారిగా కూడా పనికొస్తుంది

మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఊబకాయులు కూడా ఈ కాయను తీసుకోవచ్చు.

ఆడవారికి బహిష్టు ఆగిపోయేముందు – చికాకు శరీరవేడి, మూత్రంలో మంట కాళ్ళు చేతులు మంటలు ఉన్నప్పుడు బూడిద గుమ్మడికాయ ముక్కలను రుబ్బి రసం తీసి 4 చెంచాలు తేనెతో పుచ్చుకుంటే ఫలితం ఉంటుంది. రోజుకు రెండు నుంచి మూడు సార్లు వంతున సుమారు 10- 15 రోజులు తీసుకోవాలి.

మూత్రంలో మంట, ముక్కు నుండి రక్తం కారడం, మూల వ్యాధి బాధితులు 4 చెంచాల గుమ్మడిపండు రసంలో చెంచాడు ఊసిరికాయ రసం పటికబెల్లం వేసి పుచ్చుకుంటే ఉపశమనం లభిస్తుంది

బూడిద గుమ్మడికాయ రసంతో పుళ్ళమీద కడితే యాంటీ సెప్టిక్గా పనిచేస్తుంది.

ముదిరిన కాయ గుజ్జు రసం విరేచనకారి, అధికంగా దాహం వేసే వారికి మంచి మందు

బూడిద గుమ్మడి కాయ రసం 30 ఎం.ఎల్ చొప్పున పది పదిహేను రోజులు పుచ్చుకుంటే కొన్ని రకాల విష ఖనిజాలు పాదరసం,సీసం లాంటి హానికర పదార్థాలను మూత్రం ద్వారా బయటికి పోతాయి

దీనిని విష హరిణీ అని కూడా పిలుస్తారు
ఆటలమ్మ తీవ్ర జ్వరం ఉన్నప్పుడు నాలుగు చెంచాల రసం తాగిస్తే మంచిది శరీరం వేడి తగ్గుతుంది.

ముదిరిన బూడిద గుమ్మడి కాయ లోని గింజలను ఎండబెట్టి పొడి చేసి చెంచాడు కొబ్బరిపాలతో పది రోజులు తీసుకుంటే కడుపులో పురుగులు పడి పోతాయి.

ఈ గింజల పొడిని సీకాయ గాని కుంకుడుకాయ పొడిని తో గాని తలంటుకుంటే చుండ్రు తగ్గుతుంది

ఈ కాయలో తేమ కొవ్వులు పిండిపదార్థాలు, క్యాలరీలు తక్కువగా ఉన్నందున బరువు తగ్గేటందుకు బూడిద గుమ్మడికాయ తాజా జ్యూస్ తీసుకుంటే మితాహారం వల్ల ఏర్పడే ఎసిడోసిస్’ పరిస్థితి చక్కబడుతుంది

మధుమేహ రోగులకిది మంచి ఆహారం, వారికి కాయను తరచు వండి పెట్టవచ్చు

గుండె జబ్బులు కలవారు. బీ.పి బాధితులు దీనిని సప్లిమెంటుగా తీసుకుంటే అందులో ని పొటాషియం వారికి మేలు చేస్తుంది.

వేసవిలోఈ కాయను తీసుకుంటే శరీరంలో వేడిని తొలగిస్తుంది. కొందరకి,అరికాళ్ళు చేతుల మంటలను తగ్గిస్తుంది.
6, మూత్రం ద్వారా, ముక్కు ద్వారా రక్తం పోతుంటే ఈ కాయను
తేనె ఉసిరికాయ తో కలిపి ఇస్తే రక్తము పోవుట తగ్గుతుంది

రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాసు తాగితే కడుపులో పురుగులు చచ్చి పడి పోతాయి

బూడిద గుమ్మడి గింజలలో ఒక రకమైన నూనె ఉంటుంది దీని గింజలపప్పు బాదంపప్పు తో కలిపి పిల్లలకు తినిపిస్తే దేహ పుష్టి చేకూరుతుంది.

పాలతో కలిపి తింటే కండరాలు వృద్ధి చెందుతా యి.

కొబ్బరిపాలతో కలిపి తీసుకుంటే కడుపులో ఉండే టేప్ వార్మ్ తదితర క్రిములు నాశనమవుతాయి.

బూడిద గుమ్మడి లేత కూర ఉప్పగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే మూత్ర రాళ్లు పడిపోతాయి.
12.తలలో చుండ్రు, ఎండిపోయినట్లుండే మాడు. గుమ్మడి గింజల పప్పును ఉసిరిక పొడితో కలిపి తరచు తలంటుకోండి.
సమస్య తొందరలోనే తగ్గు ముఖం పడుంది.

జాగ్రత్తలు –
లేత తీపి గుమ్మడికాయ వాతం చేస్తుంది. ఇందులో ప్రొటీన్ శాతం ఎక్కువ కనుక మితంగానే తినాలి లేకుంటే అది జీర్ణం చేస్తుంది,ముదురు గుమ్మడి మంచిది
విరుగుడు జీలకర్ర లవంగం సొంటి వాము

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *