సిరిధాన్యాలతో అన్నం , ఇడ్లీ లు, దోశ, ఉతప్ప, పెరుగన్నం, సాంబారు అన్నం , సర్వపిండి, మురుకులు, దోసకాయరొట్టె, గారెలు, ఇలా 30 రకాల పైన వెరైటీ లు వండుకోవచ్చు. వరి బియ్యం తో వండే ప్రతి వంటను సిరిధాన్యాలతో వండుకోవచ్చు.
ఎందుకు తినాలి ?
ఆహారపు అలవాట్ల ద్వారా సంక్రమిస్తున్న అన్ని వ్యాధులను దూరం చేసుకోవడానికి, పూర్తి ఆరోగ్యంగా ఏ వ్యాధి రాకుండా ఉండడానికి, ఊబకాయము సమస్య పోవడానికి సిరిధాన్యాల ను సంపూర్ణ ఆహారంగా తీసుకోవాలి.
ఎన్నిరోజులు తినాలి?
మన ఊపిరి ఉన్నంత కాలం సిరిధాన్యాల నే సంపూర్ణ ఆహారంగా స్వీకరించాలి.
ఎలా తినాలి ?
ఆరోగ్యంగా ఉన్నవారు సిరిధాన్యాల రెండు, రెండు రోజులు మార్చి, మార్చి తినాలి, అంటే రెండు రోజులు కొర్రలు, రెండు రోజులు సామలు, రెండు రోజులు ఊదలు అలా…సైకిల్ లా తీసుకోవాలి.
అన్ని విడివిడిగా తినాలి,
ఒక దానితో ఒకటి కలుపవద్దు
5 రకాలు తప్పనిసరిగా తినాలా?
అన్ని తప్పనిసరిగా తినాలి, ఎవయినా అందుబాటులో లేనప్పుడు అందుబాటులో ఉన్న సిరిధాన్యాలను తినాలి.
పొట్టు తీయని unpolished వే తినాలా?
పొట్టు తీయని(unpolished) తినడం ఉత్తమం.
Unpolished లభించనప్పుడు పొట్టు తీసిన polished సిరిధాన్యాలు ఆహారంగా తీసుకొన్నా నష్టం లేదు.
సిరిధాన్యాల ధరలు ఎందుకు అధికంగా ఉన్నాయి?
సిరిధాన్యాలను పండించే వారు తక్కువగా వున్నారు, స్వీకరించే వారు అధికమయ్యారు, డిమాండ్ కు సరిపడా సప్లయి లేనందున, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా సప్లయి చేయాల్సివస్తుంది…ఇతర రాష్టలు సిరిధాన్యాల ను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నందున వాటి ధరలు అధికంగా ఉన్నాయి.
ఏ నూనెల ను వాడాలి ?
ఎట్టి పరిస్థితుల్లో రెఫైన్డ్ నూనెలు వాడవద్దు. గానుగలో పట్టిన నూనెలను వాడడం ఉత్తమం.ఆరోగ్యానికి కొబ్బరినూనె, కుసుమ నూనె లు చాలా మంచిది, కొబ్బరి, కుసుమ, పల్లి, నువ్వుల నూనెలు మార్చి, మార్చి వాడాలి. కొబ్బరినూనె వాసన ఉన్నట్లు అనిపిస్తే కుసుమ నూనె వాడండి, పల్లి నూనెలగా ఉంటుంది, వాసన తో ఇబ్బంది ఉండదు.