Breaking News

పవన్ కళ్యాణ్ చేపట్టిన అఖిలపక్ష సమావేశంతో. టి కాంగ్రెసులో నిరసన సెగలు

కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత విబేధాలకు పెట్టింది పేరు ..అలాంటి ఆ పార్టీలోని నాయకులు ఎప్పుడు ఎట్లా మాట్లాడతారో తెలియని పరిస్థితి నెలకొంది.తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన అఖిలపక్ష సమావేశంతో. టి కాంగ్రెసులో నిరసన సెగలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి .

నల్లమలలో యురేనియం తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అఖిలపక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు రేవంత్, మాజీ ఎంపీ వీహెచ్‌ ,ఏఐసీసీ కార్యదర్శిసంపత్‌ కుమార్‌,వంశీ పలువురు నాయకులు  హాజరయ్యారు.అయితే రాజకీయంగా ఏమాత్రం బలం లేని పవన్ కల్యాణ్ పిలిస్తే కాంగ్రెస్ నేతలు వెళ్లడమేంటని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు.ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ వీరిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.పవన్ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లి.130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ బలంతో ఆయన్ను హీరోను చేశారని విమర్శించారు.

తెలంగాణలో అసలేమాత్రం ప్రభావం లేని పవన్ ముందు కూర్చొని..కాంగ్రెస్ నేతలు చర్చలు జరపడమేంటని మండిపడ్డారు.అసలు యురేనియం తవ్వకాలకు పవన్‌కు సంబంధమేంటని ప్రశ్నించారు.పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్ ఆర్సీ కుంతియా అధ్యక్షతన జరిగిన టీపీసీసీ సమావేశంలో సంపత్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సంపత్ వ్యాఖ్యలకు కుంతియా అడ్డుపడి.. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం ..యురేనియం తవ్వకాలపై ఇప్పటికే ఢిల్లీలో సంబంధిత అధికారులను కలిసి అభ్యంతరాలు వ్యక్తం చేశామని, సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ లేఖ కూడా రాశారని పేర్కోన్నారు .

 చొరవ తీసుకొని యురేనియం తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో అఖిలపక్ష సమావేశం

ఏర్పాటు చేయించానని కాంగ్రెస్ సీనియర్  నేత వి హనుమంతరావు అన్నారు .ఏఐసీసీ కార్యదర్శి సంపత్ వ్యాఖ్యలను అయన  ఖండించారు.ప్రజా సమస్యలపై ఎవరు పోరాడినా మద్దతివ్వాలన్నారు.త్వరలో యురేనియంపై మరో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. గతంలో కూడా ఇలాంటి అంశాలపై అఖిల పక్ష సమావేశాలు జరిగితే అందరం పాల్గొన్నామన్నారు .యురేనియం వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ గా సంపత్ వ్యాఖ్యల పట్ల బాధ పడుతున్నాని ఆవేదన వ్యక్తం చేశారు .

 తవ్వకాలపై  అఖిలపక్ష సమావేశంలో పీసీసీ చెప్పినట్టు గా నేను చేసానని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు .నేను యురేనియం మీద 2016  లో ఉద్యమం చేసినపుడు ఎవరు లేరని గుర్తు చెశారు.యురేనియం తవ్వకాలు వద్దని నేను అమ్రాబాద్ లో మీటింగ్ పెట్టానని పెర్కొన్నారు .అఖిలపక్ష

సమావేశంలో సంపత్ కు వంశీ కి మైక్ ఇవ్వక పోతే నాది బాధ్యత కాదన్నారు . వంశీ ,సంపత్ అందరికి కంటే ముందు అఖిలపక్షం మీటింగ్ కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు .సంపత్ ..పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగకపోతే నాది బాధ్యత కాదు కదా..సంపత్ కు మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి కదా ఇక్కడ ఎం పనంటూ వ్యాఖ్యానించారు .నా స్వంత ఊర్లో యురేనియం తవ్వకాలు చేస్తాను అంటే నేను ఎందుకు ఉరుకుంటా .అమెరికా లో మీటింగ్ పెట్టిన వెళుతానని ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు .

 

 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *