Breaking News

అడుగ‌డుగునా సీఆర్డీఏ అధికారుల నిర్ల‌క్ష్యం !!!

 

అది రాష్ట్ర పాల‌న‌కు కేంద్ర‌బిందువు…అక్క‌డ ఉండే వేలాది ఉద్యోగులే కాదు…వంద‌లాది సంద‌ర్శ‌కులు సైతం నిత్యం అక్క‌డికి వ‌స్తుంటారు..పైగా సీఎం కార్యాల‌యంతో పాటు అమాత్యులు కొలువుదీరే ప్ర‌భుత్వ కేంద్రం…కానీ కొద్దిగా గాలివాన వ‌స్తే చాలు అక్క‌డ ప‌రిస్థితి దారుణంగా మారిపోతుంది..ఎక్క‌డ ఏం జ‌రుగుతుందోన‌నే భ‌యం ప‌ట్టుకుంటుంది..ఒక‌టి కాదు..రెండుసార్లు కాదు…ఎప్పుడు వ‌ర్షం వ‌చ్చినా ఇదే ప‌రిస్థితి..సీఆర్డీఏ అధికారుల నిర్ల‌క్ష్యానికి ప్ర‌త్య‌క్ష éక్ష్య‌మే ఏపీ స‌చివాల‌యం..

అమరావ‌తి స‌చివాల‌యంలో అడుగ‌డుగునా సీఆర్డీఏ అధికారుల నిర్ల‌క్ష్యం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది…రెండేళ్ల‌ క్రితం హైద‌రాబాద్ నుంచి అమరావ‌తి కి స‌చివాల‌యం త‌ర‌లివ‌చ్చింది.సచివాల‌యం నిర్మాణం ద‌గ్గ‌ర్నుంచి మొయింటెనెన్స్ వ‌ర‌కూ అన్ని బాధ్య‌త‌లూ రాజ‌ధాని ప్రాధికార అధారిటీ సీఆర్డీఏ చూíకుంటుంది…వెల‌గ‌పూడిలో రెండు నిర్మాణ సంస్ధ‌ల‌కు స‌చివాల‌యం నిర్మాణ బాధ్య‌త‌లు అప్ప‌గించింది సీఆర్డీఏ..మొత్తం ఐదు భ‌వ‌నాల‌తో పాటు శాస‌న‌స‌భ కోసం ఆరో భ‌వ‌నాన్ని నిర్మించారు..అయితే ఇక్క‌డికి సచివాల‌యం త‌ర‌లి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ ఏదో ఒక స‌మ‌స్య వెంటాడుతూనే ఉంది..ముఖ్యంగా వ‌ర్షాకాలం అయితే ఇబ్బందులు మ‌రింత ఎక్కువైపోతున్నాయి..ఇక చిన్న‌పాటి వ‌ర్షం,కొద్దిగా ఈదురు గాలులు వ‌స్తే ప‌రిస్థితి అస్త‌వ్య‌స్థంగా మారిపోతుంది..స‌చివాల‌యం లో గ‌త రెండేళ్లుగా  ఇదే ర‌క‌మైన ప‌రిస్థితి నెల‌కొంది..2017,2018 లో వ‌చ్చిన వ‌ర్ëల‌కు స‌చివాల‌యంలో చాలా బ్లాకుల్లో వ‌ర్ష‌పు నీరు వ‌చ్చి చేరింది..నాలుగో బ్లాకు లో ఉన్న రెవెన్యూ విభాగంలోకి పెద్ద ఎత్తున నీరు వ‌చ్చిచేరింది..దీంతో ఉద్యోగుల విధుల‌కు తీవ్ర ఆటంకం క‌లిగింది..అదృష్ట‌వ‌శాత్తూ ఫైల్స్ వ‌ర్షం బారిన ప‌డ‌క‌పోవ‌డంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు..ఇక అసెంబ్లీ లోని ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ చాంబ‌ర్ లో నీరు లీక‌వ‌డంతో అప్ప‌ట్లో పెద్ద సంచ‌ల‌నంగా మారింది…జ‌గ‌న్ చాంబ‌ర్ లోకి నీరు రావ‌డంపై అప్ప‌ట్లో రాజ‌కీయ దుమారం చెల‌రేగింది..ఇక రెండు,మూడో బ్లాకుల్లో టెర్రాస్ పైన రేకులు ఊడి కింద‌ప‌డ్డాయి..

ఇంత జ‌రిగినా సీఆర్డీఏ అధికారులు కళ్లు తెర‌డం లేదు..తాజాగా మంగ‌ళ‌వారం అమ‌రావ‌తిలో వీచిన ఈదురుగాలుల‌కు స‌చివాల‌యం అస్త‌వ్య‌స్థంగా మారింది..నాలుగో బ్లాక్ టెర్éస్ పైన ఏర్పాటుచేసిన రేకులు గాలికి ఎగురుకుంటూ వెళ్లి రెండు వంద‌ల మీట‌ర్ల దూరంలో రోడ్డుపై ప‌డింది.ఇంత‌దూరం రేకులు ఎగిరిప‌డ్డాయంటే అధికారులు,నిర్మాణ సంస్ధ‌ల నిర్ల‌క్ష్యం ఎంత‌మేర ఉందో అర్ధం అవుతుంది…ఇక మూడో బ్లాకు స‌మీపంలో íమారు 25 ల‌క్ష‌ల ఖ‌ర్చుతో ఏర్పాటుచేసిన స్మార్ట్ పోల్ నేల‌మ‌ట్టం అయింది..దీనికి కార‌ణం సీఆర్డీఏ అధికారుల నిర్ల‌క్ష్యం అని స్ప‌ష్టం అర్ధం అవుతుంది…స్మార్ట్ పోల్ నిర్మాణంలో క‌నీసం ప్ర‌మాణాలు పాటించ‌క‌పోవ‌డం,ఎంతో బ‌రువైన పోల్ ఏర్పాటు చేస్తున్న‌ప్ప‌డు దానికి తగ్గ‌ట్టుగా బోల్టులు ఏర్పాటుచేయ‌క‌పోవ‌డం పోల్ ప‌డిపోవ‌డానికి కార‌ణాలుగా తెలుస్తోంది.స‌చివాల‌యం మెయిన్ గేట్ వ‌ద్ద

పోలీíల కోసం ఏర్పాటుచేసిన టెంట్…గాలికి మొత్తం నేల‌మ‌ట్టం అయింది…అదృష్ట‌వ‌శాత్తూ డ్యూటీలో ఉన్న పోలీíలు ప‌క్క‌కు త‌ప్పుకోవ‌డంతో ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు…వంద‌ల కోట్లు ఖ‌ర్చుపెట్టి నిర్మించిన స‌చివాల‌యంలో ఎప్పుడు వ‌ర్షం వ‌చ్చినా…కొద్దిగా ఈదురు గాలులు వ‌చ్చినా ఉద్యోగులు మాత్రం తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు..నిర్మాణ సంస్థ‌లు,సీఆర్డీఏ అధికారుల తీరుపై ప్ర‌తిప‌క్షాలు సైతం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి..చిన్న‌పాటి సంఘ‌ట‌న‌ల‌కే స‌చివాల‌యం ఈర‌కంగా మారుతుంటే ఉద్యోగుల‌తో పాటు అమాత్యులు కూడా ఇబ్బందులు ప‌డుతున్నారు..అయితే నిర్మాణాల్లో లోపాల‌తో ఇలాంటి ప‌రిస్థితి ఎదుర‌వుతుంద‌నే వాద‌న‌లు కూడా వినిపిస్తున్నాయి..ఇప్ప‌టికైనా సీఆర్డీఏ అధికారులు

  భ‌విష్య‌త్తులో ఎలాంటి త‌ప్పిదాలు జ‌ర‌గ‌కుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీíకోవాల‌ని ఉద్యోగులు కోరుతున్నారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *