Breaking News

అమెరికాలో తెలుగు రాష్ట్రాలకి చెందిన వారు క్షేమంగా వున్నారు

అమెరికాలో తెలుగు రాష్ట్రాలకి చెందిన వారు క్షేమంగా వున్నారని తానా ఎక్జిక్యూటివ్ వై స్ ప్రెసిడెండ్ లావు అంజయ్య చౌదరి తెలిపారు.అమెరికాలో తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారందరూ క్షేమంగా ఉన్నారని, వారి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు.ఇప్పటికే తెలుగు వారందరినీ కోవిడ్-19 విషయంలో పూర్తిగా అలెర్ట్ చేశామని, కరోన రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలని భారత కాన్సులేట్లతో కలిసి వివరించి చెప్పామని అన్నారు. అమెరికాలో ఇప్పటివరకు 4 లక్షల పైచిలుకు పాజిటివ్ కేసులు వున్నా కోవిడ్ -19 తీవ్రత న్యూ జెర్సీ,న్యూ యార్క్ లలోనే అధికంగా ఉందని పేర్కొన్నారు. కరోనా విషయంలో తెలుగు వారు ఎవరికి వారు స్వీయ నిర్భందంలో ఉన్నారని అన్నారు.తెలుగు వారందరూ బయటకి రాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారని అమెరికన్ ప్రభుత్వం సూచించిన ప్రతీ నిబంధనను తెలుగు వారు పాటిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం నేరుగా లాక్డౌన్ప్రకటించనప్పటికీ.. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో సాధారణ జనజీవనం నిలిచిపోయిందని పేర్కొన్నారు.అమెరికాలో కోవిడ్ 19 వైద్య సేవలు అందిస్తున్న వారిలో తెలుగు వైద్యులు ఎక్కువమంది వున్నారని ..తానా వీరితో నిరంతరం టచ్లో ఉండటంతో మిగిలిన తెలుగు వారికి ఎప్పటికప్పుడు కరోనా తీవ్రత పై అవగాహన కల్పించడం సులభమవుతుందన్నారు.అమెరికన్ యూనివర్సిటీలలో హాస్టల్స్ మూసివేయడంతో అక్కడ చదువుకొంటున్నతెలుగు విద్యార్థులకు వివిధ ప్రాంతాలలో వున్నా తెలుగు వారి ఇళ్లల్లో వసతి సౌకర్యాలు కల్పించామన్నారు. విజిటర్ పేరెంట్స్ ఈ కోవిడ్-19 వళ్ళ తిరిగి వెళ్ళలేనివాళ్ళకి మెడిసన్ పరంగా కావల్సిన సహాయం చేస్తున్నాము అని తెలిపారు.
ఇళ్లలోనే ఉండిపోతున్న తెలుగు వారికి ఆధ్యాత్మిక ,సామాజిక అంశాలపై అవగహన కల్పించడానికి ,మనో వికాసానికి ,మానసిక స్థైర్యం కోసం వివిధ రంగాల ప్రముఖులతో వెబ్ నైర్ ద్వారా వర్చువల్ గా ప్రసంగాలను అందిస్తున్నట్లు వివరించారు.ఇదే సమయంలో హెచ్ వన్ బి జాబ్స్ విషయంలో భవిష్యత్ ఎలా వుంటుందనే దానిపై తెలుగు వారిలో ఆందోళన నెలకొందని చెప్పారు.అందుకే బఫర్ పీరియడ్ ని పస్తుతం వున్న 60 రోజుల నుండి 180 రోజుల వరకు పొడిగించాలని అమెరికన్ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
గతంలో (1982,2008) వచ్చిన ఆర్థిక మాంద్యం కన్నా తీవ్రతరమైన ఆర్థిక సంక్షోభం మరోసారి వస్తుందన్నఆందోళన నెలకొందన్నారు.కోవిడ్ నుంచి కోలుకొన్నా ఆర్థిక సంక్షోభం దాటడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చని అభిప్రాయపడ్డారు.
అమెరికన్ ప్రభుత్వం ప్రకటించిన రెండు ట్రిలియన్ డాల్లర్ల ప్యాకేజ్ ఇక్కడి తెలుగు వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అందరికీ వివరిస్తున్నామన్నారు.ఉభయ తెలుగు రాష్ట్రాలలో కరోనా సహాయక చర్యలు కు తమ వంతు సాయం అందించేందుకు ఇప్పటికే పలు ప్రాంతాలలో మాస్క్లు లు ,శానిటైజెర్స్,పీ ఈ పీ కిట్స్ పంపిణీ చేసినట్లు వెల్లడించారు.కరోనా మహమ్మారిని అరికట్టడంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న డాక్టరు,హెల్త్ సిబ్బంది,పోలీస్,పారిశుధ్య సిబ్బందికి సహాయం చేసేందుకు తానా ఆధ్వర్యంలో విరాళాలు సేకరిస్తున్నామన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.ప్రభుత్వాలు సూచించిన నిభందనలు కచ్చితంగా పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఎంత జాగ్రత్తగా ఉంటే అంత దూరంగా ఈ మహమ్మారి వుంటుందనే విషయం గమనించాలని కోరారు

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *