Breaking News

ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో మైలురాయి…HCL

ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో మైలురాయిHCL

  • అక్టోబర్ 8న గన్నవరం, కీసరపల్లి గ్రామంలో హెచ్సిఎల్ భూమి పూజ కార్యక్రమం…
  • 8న మధ్యాహ్నం 3 గంటలకు హెచ్సిఎల్ గన్నవరం క్యాంపస్ కి శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్…
  • కార్యక్రమం లో పాల్గొననున్న హెచ్సిఎల్ అధినేత శివ్ నాడార్ కుమార్తె హెచ్సిఎల్ కార్పొరేషన్ సిఈఓ రోషిని నాడార్…
  • రెండు దశల్లో హెచ్సిఎల్ కంపెనీ కార్యకలాపాలు…
  • ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో మొదటి మెగా ఇన్వెస్ట్మెంట్ హెచ్సిఎల్…
  • రెండు దశల్లో 750 కోట్ల పెట్టుబడి,7500 మందికి ఉద్యోగాలు కల్పించనున్న హెచ్సిఎల్…
  • మొదటి దశలో 400 కోట్ల పెట్టుబడి,4000 మందికి హై ఎండ్ ఐటీ ఉద్యోగాలు…
  • మొదటి దశలోనే ఐటీ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం ప్రారంభం…
  • హెచ్సిఎల్ ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర…
  • మే 12,2017 న ఢిల్లీ లోని హెచ్సిఎల్ కార్యాలయంలో అధినేత శివ్ నాడార్ ని కలిసి భూమి పత్రాలు అందజేసిన మంత్రి నారాలోకేష్…
  • హెచ్సిఎల్ తో ఒప్పందం చేసుకున్న 45 రోజుల్లోనే అన్ని అనుమతులతో కూడిన భూమి పత్రాలు హెచ్సిఎల్ అధినేత కి అందజేసిన లోకేష్…
  • ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగం అభివృద్ధి కి తీసుకుంటున్న చర్యలు,పాలసీలు,కల్పిస్తున్న రాయితీలు తదితర అంశాలను హెచ్సిఎల్ అధినేత శివ్ నాడార్ కి వివరించిన లోకేష్
  • ఐటీ రంగంలో 2019 కి లక్ష ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని వివిధ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ కి తీసుకొస్తున్న లోకేష్
  • ఇప్పటికే ఐటీ రంగంలో 36 వేల ఉద్యోగాల కల్పన

హెచ్సిఎల్ భూమి పూజ

అక్టోబర్ 8 న గన్నవరం, కీసరపల్లి గ్రామంలో హెచ్సిఎల్ భూమి పూజ కార్యక్రమం జరగనుంది.మధ్యాహ్నం 3 గంటలకు హెచ్సిఎల్ గన్నవరం క్యాంపస్ కి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు.ఈ కార్యక్రమంలో హెచ్సిఎల్ అధినేత శివ్ నాడార్ కుమార్తె హెచ్సిఎల్ కార్పొరేషన్ సిఈఓ రోషిని నాడార్ పాల్గొననున్నారు.స్థానిక ప్రజాప్రతినిధులు,మంత్రులు దేవినేని ఉమ,కొల్లు.రవీంద్ర తదితరులు పాల్గొననున్నారు.

నలభై ఏళ్ల చరిత్ర

ప్రపంచ ఐటీ రంగంలో హెచ్సిఎల్ ఒక నమ్మకమైన కంపెనీ గా పేరుగాంచింది.40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో హెచ్సిఎల్ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 250 కంపెనీలకు,గ్లోబల్ 2000 కంపెనీల్లో 650 కంపెనీలకు వివిధ ఐటీ సర్వీసెస్ అందించి అగ్రగామిగా ఎదిగింది.8 యూఎస్ బిలియన్ డాలర్ల రెవిన్యూ సాధించింది.41 దేశాల్లో కార్యకలాపాలు,ప్రపంచవ్యాప్తంగా 1 లాక్షా 24 వేల మంది ఉద్యోగులు హెచ్సిఎల్ కంపెనీలో పనిచేస్తున్నారు.ప్రపంచవ్యాపంగా ఐటీ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి,నూతన ఆవిష్కరణల పరిశోధన కేంద్రాలు,డెలివరీ కేంద్రాలు హెచ్సిఎల్ నిర్వహిస్తుంది.

 నవ్యాంధ్రప్రదేశ్ లో హెచ్సిఎల్

ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో మొదటి భారీ పెట్టుబడి హెచ్సిఎల్ పెట్టబోతోంది.750 కోట్ల పెట్టుబడి,7500 మందికి ఉద్యోగాలు పది ఏళ్లలో కల్పించబోతుంది. రెండు దశల్లో హెచ్సిఎల్ అమరావతి లో కంపెనీ కార్యకలాపాలు విస్తరించనుంది.గన్నవరం లోని కీసరపల్లి గ్రామంలో 28 ఎకరాల విస్తీర్ణంలో మొదటి దశ పనులు ప్రారంభించబోతుంది.ఇక్కడ 400 కోట్ల పెట్టుబడితో పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించనుంది హెచ్సిఎల్.ఈ కేంద్రంలోనే 4000 మందికి హై ఎండ్ ఉద్యోగాలు రానున్నాయి.కేవలం ఒక్క సంవత్సరంలోనే మొదటి భవనం నిర్మాణం పూర్తి చేయనుంది హెచ్సిఎల్.మిగిలిన భవనాలను రానున్న ఏడేళ్లలో పూర్తి చేయనుంది.రెండొవ దశలో హెచ్సిఎల్ కంపెనీని అమరావతి నూతన రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది.20 ఎకరాల్లో కంపెనీ ఏర్పాటు కానుంది.5 సంవత్సరాల కాల వ్యవధిలో 350 కోట్ల పెట్టుబడి,3500 మందికి ఉద్యోగాలు రెండొవ దశలో భాగంగా హెచ్సిఎల్ కల్పించనుంది.

హెచ్సిఎల్ రాక లో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర… ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ 1 అనడానికి ఉదాహరణ…

మే 12,2017 న మంత్రి నారా లోకేష్ హెచ్సిఎల్ అధినేత శివ్ నాడార్ ని ఢిల్లీ లోని హెచ్సిఎల్ కార్యాలయంలో కలిసారు.ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ 1 అనడానికి ఈ భేటీ ఒక ఉదాహరణ గా నిలిచింది.హెచ్సిఎల్ తో ఒప్పందం చేసుకున్న 45 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చి,భూమి కేటాయించి,ఆ భూమి పాత్రలను తీసుకోని నేరుగా హెచ్సిఎల్ కంపెనీకి వెళ్లి అధినేత శివ్ నాడార్ కి అందజేసారు మంత్రి నారా లోకేష్.ప్రభుత్వాల చుట్టూ కంపెనీలు తిరగడం కాదు,రాష్ట్ర యువత కు ఉద్యోగాలు కల్పించాలి అనే లక్ష్యంతో నేరుగా ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో ప్రత్యక్షంగా చూపించిన మంత్రి నారా లోకేష్ మాత్రమే.అదే భేటీ లో లోకేష్ రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి కి తీసుకుంటున్న చర్యలు,పాలసీలు,కల్పిస్తున్న రాయితీలు గురించి వివరించారు.నూతన రాష్ట్రంలో ఉన్న కష్ఠాలు,అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర కృషి గురించి వివరించారు.ఐటీ రంగంలో 2019 నాటికీ లక్ష ఉద్యోగాలు కల్పించడానికి పెట్టుకున్న లక్ష్యాలను వివరించారు.ఆ సమావేశంలోనే హెచ్సిఎల్ అధినేత శివ్ నాడార్ దేశంలో మొదట ఐటీ గురించి మాట్లాడింది,ఐటీ రంగం అభివృద్ధి గురించి చర్యలు తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబే అని అన్నారు.ఆ రోజే గన్నవరం తో పాటు అమరావతిలోనూ కంపెనీ ఏర్పాటు చెయ్యడానికి అంగీకరించారు.

గన్నవరానికి ఐటీ వరాలు

గన్నవరం లో ఐటీ అభివృద్ధి కోసం మేధా టవర్స్ నిర్మించారు.అయితే అనేక కారణాల వలన సుమారు 10 ఏళ్లు మేధా టవర్స్ ఖాళీగా ఉంది.కానీ మంత్రి నారా లోకేష్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు.మన రాష్ట్రంలో అద్భుతమైన యువతీ,యువకులు ఉన్నారు.కంపెనీలను తీసుకురావాలి అని లక్ష్యంతో అనేక కంపెనీల ప్రతినిధులను కలిసి పెట్టుబడులు పెట్టాలి అని ఆహ్వానించారు.దీనితో ఒక్క సరిగా మేధా టవర్స్ కి మహర్దశ వచ్చింది.పది ఏళ్లు ఖాళీగా ఉన్న మేధా టవర్స్ నిండిపోయింది.2 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ నిండింది.దాదాపు 2 వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు వచ్చాయి.హెచ్సిఎల్ భాగస్వామ్య కంపెనీ అయినా స్టేట్ స్ట్రీట్ లాంటి దిగ్గజ కంపెనీలు మేధా టవర్స్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అంతే కాకుండా మేధా టవర్స్ ఫేజ్ 2 నిర్మాణానికి కూడా మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేసారు.2 దశలో భాగంగా 4 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానుంది.నూతన భవనంలో 4 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.

రాష్ట్రంలో ఐటి ఉద్యోగాల కల్పన

రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఐటీ లో 36,583 ఉద్యోగాలు వచ్చాయి.ఒప్పందం కుదుర్చుకుని,భూముల కేటాయింపు పూర్తి అయ్యి,పనులు ప్రారంభం అయిన కంపెనీల ద్వారా 27,500 ఉద్యోగాలు రాబోతున్నాయి.మరో 40 వేల ఉద్యోగాల కల్పనకు వివిధ కంపెనీల తో ఒప్పందం జరిగింది.ఇండియా బిపిఓ స్కీం ద్వారా 19,380 ఉద్యోగాలు రాష్ట్రంలోని యువతి యువకులకు వచ్చాయి.

ఐటి అభివృద్ధి-వికేంద్రీకరణ

ఐటి రంగం అభివృద్ధి కేవలం ఒకే ప్రాంతంలో జరగకొడదు, అన్ని ప్రాంతాల్లోనూ ఐటి అభివృద్ధి జరగాలి అనే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో నాలుగు ఐటి క్లస్టర్లు ఏర్పాటు చెయ్యాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు.విశాఖపట్నం,అమరావతి,తిరుపతి, అనంతపురం లో ఐటి క్లస్టర్లు ఏర్పాటు చెయ్యాలి అని నిర్ణయించారు.కేవలం పెద్ద కంపెనీలు మాత్రమే కాదు మధ్య,చిన్న తరహా కంపెనీలు కూడా ఉంటేనే పూర్తి స్థాయి లో ఐటి రంగం అభివృద్ధి చెందుతుంది అని అందరికి సమాన ప్రాధాన్యత కల్పించారు.

విశాఖపట్నం

తీసుకొచ్చిన వివిధ పాలసీల వలన అనేక పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాయి

1.ఫ్రాంక్లిన్ టెంపుల్టన్(ప్రపంచంలోనే ఉత్తమ ఫింటెక్ కంపెనీల్లో ఒక్కటి)

2.కాన్డ్యూయెంట్

3.ఏఎన్ఎస్ఆర్(గ్లోబల్ ఇన్ హౌస్ సెంటర్ కంపెనీ)

4.గూగుల్ ఎక్స్(ప్రపంచంలో అమెరికాలో తప్ప ఇంక ఎక్కడా కార్యాలయం లేని కంపెనీ) మారు మూల ప్రాంతాలకు సైతం ఎఫ్ సాక్ టెక్నాలజీ తో ఇంటర్నెట్ సదుపాయం

విశాఖపట్నం లో ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న హిల్ 1,2 ఇప్పుడు ఐటి కంపెనీలతో నిండిపోయాయి

మిలీనియం టవర్స్ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది

కాపులపాడ లో ఐటి పార్క్ ఏర్పాటుకు పనులు ప్రారంభం అయ్యాయి.

 

అమరావతి

1.హెచ్ సిఎల్ కంపెనీ రాక తో అమరావతి ఐటి ముఖ చిత్రం మారిపోబోతుంది.అధునాతన టెక్నాలజీల పరిశోధన మరియు అభివృద్ధి ఇక్కడ జరగబోతుంది

2.పై డేటా సెంటర్.టియర్ ఫోర్ డేటా సెంటర్ ఏర్పాటు అయ్యింది 

సుదీర్ఘ కాలం ఖాళీగా ఉన్న మేధా టవర్స్ లోకేష్ స్పీడ్ తో ఫుల్ అయ్యింది.ఇప్పడు ఫేస్ 2 నిర్మాణం ప్రారంభం అయ్యింది

మంగళగిరి మినీ ఐటి హబ్ గా మారుతుంది ఫై కేర్,ఇన్వికాస్ సహా అనేక కంపెనీలు మంగళగిరి లో కొలువుతీరాయి.ఏపీఎన్ఆర్టి సహకారంతో విజయవాడ,గుంటూరు,విశాఖపట్నం లో ఇండ్ వెల్ టవర్స్,మేధా టవర్స్,కే బిజినెస్ స్పేస్,ఫై కేర్,ఎన్ఆర్టి టెక్ పార్క్ భవనాల్లోకి ఐటి కంపెనీలు వచ్చాయి.

తిరుపతి

1.జోహో తన కార్యకలాపాలను ప్రారంభించింది.

అనంతపురం

బెంగుళూరు సిటి కి దగ్గరగా అనంతపురం జిల్లాలో బెంగుళూరు ప్లస్ ప్లస్ పేరుతో ఐటి పార్క్ ఏర్పాటు చేయబోతున్నారు.

పారిశ్రామిక విప్లవం 4.0

పాతకాలం టెక్నాలజీలకు కాలం చెల్లింది.ఇప్పుడు బిగ్ డేటా,అనలిటిక్స్,సైబర్ సెక్యూరిటి,ఫింటెక్,బ్లాక్ చైన్ టెక్నాలజీలు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ లో ఉన్నాయి.

ఫింటెక్

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతిపెద్ద ఫింటెక్ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు విశాఖపట్నం లో ఫింటెక్ వ్యాలీ ఏర్పాటు చేసారు.

బ్లాక్ చైన్ టెక్నాలజీ

బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి ఇంకా ప్రపంచంలోని ఎన్నో దేశాలకు తెలియక ముందే బ్లాక్ చైన్ కాన్ఫరెన్స్ నిర్వహించి లోకేష్ తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించారు.కేవలం సమావేశం నిర్వహించడమే కాదు బ్లాక్ చైన్ టెక్నాలజీ తో ల్యాండ్ రికార్డ్స్ కు భద్రత కల్పించే ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టారు.

సైబర్ సెక్యూరిటీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగిస్తుంది.అదే స్థాయి లో సైబర్ అటాక్స్ జరిగే ప్రమాదం కూడా ఉంది అని గ్రహించిన మంత్రి నారా లోకేష్ సైబర్ వారియర్స్ ని తయారు చేసే పనిలో పడ్డారు

తిరుపతిలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజిస్ ద్వారా అధునాతన టెక్నాలజీల పై విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నారు నారా లోకేష్… ఇటీవల కాలంలో జరిగిన ఐఐడిటి గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఒక విద్యార్థి మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న అన్ని పెద్ద ఐటి కంపెనీలు ఉన్న హైదరాబాద్లో అధునాతన టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చే ఐఐడిటి లాంటి ఇన్స్టిట్యూట్ లేదు అని అన్నాడు అంటే…మంత్రి లోకేష్ విజన్ ఎంటో అర్థం అవుతుంది.రాష్ట్రంలోని యువతి యువకులను పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా సిద్ధం చేసేందుకు అధునాతన టెక్నాలజీలు అయిన బిగ్ డేటా,అనలిటిక్స్,సైబర్ సెక్యూరిటి,ఫింటెక్,బ్లాక్ చైన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి ఆయా రంగాల్లో మేటి కంపెనీలు సహకారం రాబట్టడంలో లోకేష్ విజయం సాధించారు.

స్టార్ట్ అప్ ఎకో సిస్టమ్

ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ స్టార్ట్ అప్ కంపెనీలకు వరంలా మారింది.మంత్రి నారా లోకేష్ మార్గానిర్దేశంతో అద్భుతమైన కంపెనీలు తయారు కావాలి అంటే ఫ్యాన్సీ ఆఫీస్లు అవసరం లేదు.సరైన మార్గనిర్దేశం,శిక్షణ ఉంటే చాలు అన్న మాటను ఏపిఐఎస్ తూచాతప్పకుండా పాటిస్తుంది.

సంవత్సరానికి 6 కోట్ల ఖర్చుతో నిర్వహిస్తున్న ఎక్స్ఎల్ఆర్ 8 యాసిలిరేటర్ ఇప్పుడు దేశంలోనే ఉత్తమ 6 వ యాసిలిరేటర్ గా ఎదిగింది.స్టార్ట్ అప్ అంటే కేవలం ఐటి మాత్రమే కాదు అన్న మంత్రి నారా లోకేష్ పిలుపుతో అనేక స్టార్ట్ కంపెనీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.అరటి నారా తో షేవింగ్ బ్రష్లు తయారు చెసే బోధా కంపెనీ ఎక్స్ఎల్ఆర్ 8 నుండి వచ్చింది

ఏపి ఇన్నోవేషన్ సొసైటీ ఆధ్వర్యంలో స్టార్ట్ అప్ కంపెనీ తో కలిసి అమరావతి డ్రోన్స్ కంపెనీని ఏర్పాటు చేసారు. చైనా లో తయారు అయ్యే డ్రోన్ల కంటే తక్కువ ధర,నాణ్యతతో డ్రోన్ల తయారీ ప్రారంభించారు

స్టార్ట్ అప్ కంపెనీలను ప్రోత్సహహించేందుకు 100 కోట్ల నిధులు కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.మరి కొంత మంది ఏంజెల్ ఇన్వెస్టర్స్ నుండి మరో 400 కోట్లు సమీకరించి స్టార్ట్ అప్ కంపెనీలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి అని నారా లోకేష్ పనిచేస్తున్నారు

టై అమరావతి,ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ అమరావతి చాప్టర్ లను మంత్రి లోకేష్ ప్రారంభించారు.వీటి ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.ఫాల్కన్ ఎక్స్ యాసిలిరేటర్ ప్రారంభించడం ద్వారా అమెరికా స్టార్ట్ అప్ ఎకో సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ లోని స్టార్ట్ అప్ కంపెనీలకు అందిస్తున్నారు.

 

 

 

 

 

 

 

 

 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *