Breaking News

ఆధ్యాత్మిక చిత్రం బాలల సాయిబాబా చిత్రం: మ్యూజిక్ డైరెక్టర్ గుత్తికొండ తేజ

పాటల రికార్డింగ్ దశను పూర్తి చేసుకొన్న బాలల సాయిబాబా చిత్రం
***********************
అంతా కొత్తవారైన బాలలతో తీయనున్న భక్తిరస చిత్రం బాలల సాయిబాబాకు సంబంధించి పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని ఇటీవల స్థానిక ఆడియో ల్యాబ్స్ థియేటర్‌లో విజయవంతంగా పూర్తి చేశారు. బందరు జిల్లాకోర్టు కూడలి వద్ద ఉన్న సాయిబాబా గుడి ముఖ్య నిర్వాహకులు శ్రీ విఠల్ ఈ చిత్రానికి నిర్మాతగా వస్తోన్న చిత్రమిది. బందరుకు చెందిన ప్రముఖ గాయనీ గాయకులు బోల్ బేబీ బోల్ సింగర్ రాకేష్ , సుచరిత, చోటే బాబు మొహమ్మద్ తదితరులు ఈ సినిమాలో పాటలు పాడారు. ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజింగ్ తేజ సమకూరుస్తున్నారు. ప్రముఖ సంగీత తబలా విద్వాంసుడు గుత్తికొండ జ్ఞానేశ్వర సోదరుడు తేజ .. మచిలీపట్టణం లోతబలా విద్వాంసులు జ్ఞానేశ్వర్ బాటలోనే సోదరుడు కూడా పలు కార్యక్రమాలలో పాల్గొని శ్రోతలను తన భక్తి పాటలతో పరవశింపచేసేవారు.

బందరు నుండి చాలాకాలం తర్వాత నిర్మితమవుతున్న ఈ ఆధ్యాత్మిక చిత్రంలో అంతా కొత్తవారిని పరిచయం చేయనున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నట్లు శ్రీ విఠల్ వెల్లడించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *