Breaking News

ఆనందం ఆరేళ్ళల్లోనే ఆవిరైపోయింది

 

jalimudi_air water project01 గాలి నుంచి నీరు… పైపెచ్చు మినరల్ వాటర్ గా త్రాగే మంచినీరు.. కోటి రూపాయల ఖర్చుతో తమ గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ గా నెలకొల్పిన ప్రాజెక్ట్ తో అక్కడి ప్రజల్లో ఆనందం అవధులు దాటింది. మనకిక మంచినీటికి లోటులేదని సంబరపడిపోయారు. కానీ… ఆ ఆనందం ఆరేళ్ళల్లోనే ఆవిరైపోయింది. ఆ మహత్తర ప్రాజెక్ట్ పై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకోవడంతో… అధికాస్తా మూలనపడింది.  ఆ గాలినీరు సంగతులేంటి… అసలు గాలినీరు కూడా దక్కక అల్లాడుతూ గుక్కెడు నీటికోసం అర్రులు చాస్తున్న ఆ గ్రామం ఎక్కాడుందో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చూడాల్సిందే.

అదొక ఏటిపట్టు గ్రామం.. దానిపేరు జాలిమూడి.  పేరుకు తగ్గట్టుగానే

జాలిపడుతున్నట్టుగానే ఆ గ్రామం రోడ్డుకు, ఏటిగట్టుకు మధ్య గోదావరి చెంతనే వుంది.

తూర్పు గోదావరి జిల్లా సీతనగరం మండలంలో గల జాలిమూడి గ్రామం కాపవరం ప్రక్కనే వుంది.

 రాజమండ్రి నుంచి సీతాగనరం వెళ్లే ఏటిపట్టు ప్రధాన రహదారిలో రోడ్డుకు అనుకునే వున్న ఈ గ్రామంలో మంచినీరు అందక  ప్రజలు అల్లాడుతున్నారు. చుట్టూ గోదావరి జలాలు ఉన్నా.. ఇక్కడమాత్రం మంచినీటికి కష్టాలు తప్పడంలేదు. వీరి కష్టాలు గుర్తించి.. 2009 లో అప్పటి కేంద్రప్రభుత్వం ఈ జాలిముడి గ్రామంలో ఎయిర్ వాటర్ పేరుతో విదేశీ టెక్నాలజీతో ఒక ప్రాజెక్ట్  నిర్మించింది. గోదావరి ఒడ్డునే వున్న జాలిమూడి గ్రామానికి గోదావరి నీరు దొరకడ కష్టమే.. అందుకే ఈ గ్రామంలో ప్రయోగాత్మకంగా గాలినీరు దాదాపు కోటి రూపాయలు ప్రాజెక్టును నిర్మించారు.  గాలిని పీల్చుకుని,

అందులోని తేమను వేరు చేసి ఒక టాంకులో చుక్కచుక్కనీరు నింపుతోంది.  భారీ రిఫ్రిజిరేటర్ తరహాలో కన్పించే ఆ యంత్రం రోజుకు 1500 లీట్లర్ల వరకూ నీటిని గాలిద్వారా ఉత్పత్తి చేస్తుంది. కరెంట్ నిత్యం వుంటేనే ఈ ప్రాజెక్టు పనిచేస్తుంది. దానికయ్యే విద్యుత్ ను ప్రభుత్వమే భరిస్తుందని అప్పట్లో వెల్లడించారు. రోజు విడిచి రోజుకురెండు వాటర్ టాంకుల నీరు ఉత్పత్తి అవుతుంది గాలిద్వారా.. ఈ నీటిని జాలిమూడి ప్రజలు లైనులో వుండిపట్టుకుని తీసుకెల్లెవారు. అయితే గ్రామ అవసరానికి సరిపడే నీటిని గాలినీరు ప్రాజెక్టు ఉత్పత్తి చేయకపోయినప్పటికీ.. గ్రామస్తులు ఆనీటినే సర్దుకునేవారు.

   అయితే మరమ్మతులు మినహా… విద్యుత్ ఖర్చులు భరించాలని పంచాయితీకి అప్పగించడంతో ఈ ప్యాయజెక్టు మూలనపడింది. 9 సంవత్సరాలుగా 20 లక్షలు వరకూ దీనికి సంబంధించి విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. అటు ప్రభుత్వం నుండిగాని.. ఇటు పంచాయితీ గాని ఈ బిల్లులు చెల్లించకపోవడంతో.. విద్యుత్ శాఖ అధికారులు పలుమార్లు నోటీసులు జాయిచేశారు. స్పందన లేకపోవడంతో  గాలిజలం ప్రాజెక్ట్ కు అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఈ జాలిముడి  ప్రజలకు నీటి కష్టాలు మళ్ల్లీ మొదలయ్యాయి. పక్కనున్న కాటవరం వెళ్లి ఉదయం, సాయంత్రం మంచినీటిని తెచ్చుకుంటున్నారు. గుక్కెడు నీటికోసం తీవ్ర కష్టాలు పడుతున్నా.. ప్రజాప్రతినిదులు, ప్రజలు తమ గోడు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *