Breaking News

ఇంద్రకీలాద్రిపై వైభవంగా శ్రీ శంకర జయంతి

ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానములో ఇంద్రకీలాద్రిపై వైభవంగా శ్రీ శంకర జయంతి జరిపించినారు. శ్రీ  అమ్మవారి స్థలపురాణములో  శ్రీ అమ్మవారి పాదముల చెంత శ్రీ చక్రము స్థాపించి శ్రీ అమ్మవారిని శాంతి మూర్తిగా దర్శనము చేసుకొనే భాగ్యము కలగించి నారని ఇతిహాసములో చెప్పబడినడినది  మరియు సదాశివుడే ఆదిశంకరుల రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. శ్రీ ఆది శంకరులు వారు  వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు జన్మించారు. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీ.శ. 788 లో జన్మించి కాలక్రమములో షణ్మత స్ధాపన చేసి అనేక స్తోత్రమముల ద్వారా పరమేశ్వర అనుగ్రహము పొందుటకు తోడ్పడినట్లుగా   తెలుస్తున్నది. శ్రీ శంకరులు తన “గురు స్తోత్రం” ఆరంభంలో చెప్పిన “గురుర్బ్రహ్మా, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః, గురుఃసాక్షాత్ పరంబ్రహ్మా, తస్మై శ్రీ గురవే నమః” అనే స్తోత్రం ప్రార్థనా గీతంగా చాలా ప్రసిద్ధమైనదిగా పురాణాలలో చెప్పబడినది అని ఆలయ స్ధానా చార్య, వి.శివ ప్రసాద్ శర్మ గారు పేర్కొన్నారు.  శ్రీ శంకర చార్యుల వారికి అభిషేకము నిర్వహించి,  వేదపండితులు వేద ప్రవచనము చేసి స్వామి వారికి అర్పణ చేయటమైనది. వైదిక కమిటీ సభ్యులు, అర్చక సిబ్బంది, పరిపాలనా విభాగము సిబ్బంది, భక్త జనులు పాల్గొనగా  శ్రీ శంకర జయంతి కార్యక్రమము అత్యంత వైభవముగా జరిగినది.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *