Breaking News

ఈ విద్యా సంవత్సరం నుంచే అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు అమలు??

 

ఈ విద్యా సంవత్సరం నుంచే అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.. అన్ని విద్యా సంస్థల్లో 10 శాతం సీట్లు అదనంగా పెంచుకోవాలని సూచించనుంది..అయితే ఉద్యోగాల్లో మాత్రం ఎప్పటి నుంచి రిజర్వేషన్లు అమలు చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు..ఇప్పటికే ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్లు కు మాత్రం రిజర్వేషన్లు వర్తించే అవకాశం కనపడటం లేదు..

 

అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు అమలుపై  ఉన్నతస్థాయి కమిటీ సమావేశం…

విద్యా సంస్థల్లో ఐదు శాతం కాపులకు,ఐదు శాతం అగ్ర వర్ణ పేదలకు ఈఏడాది నుంచే అమలు..

అన్ని విద్యా సంస్థలు 10 శాతం  సీట్లు అదనంగా పెంచుకోవాలని సూచించనున్న కమిటీ..

ఉద్యోగాల భర్తీలో రాబోయే నోటిఫికేషన్ లకు వర్తింపచేయలని నిర్ణయం..

సీఎస్ కు రోస్టర్ పాయింట్ల ప్రతిపాదనలు సమర్పించనున్న కమిటీ..

మరోసారి సీఎస్ వద్ద సమీక్షించిన తర్వాత ఉత్తర్వులు విడుదల చేయనున్న ప్రభుత్వం..

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలుపై ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది..వీలయినంత త్వరగా  రిజర్వేషన్లు అమలు చేసేలా సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చర్యలు తీసుకుంటున్నారు..ఇప్పటికే రిజర్వేషన్లు అమలుకు నియమించిన ఉన్నతాధికారుల కమిటీ సచివాలయంలో సమావేశం అయింది..బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయ లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది.. మార్చి 8 న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రిజర్వేషన్లు,రోస్టర్ పాయింట్లు కేటాయింపుకు ఆమోదం తెలిపింది..ఈ ఏడాది నుంచే కాపులకు ఐదు శాతం,ఇతర అగ్రవర్ణ పేదలకు మరో ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది…దీనికి అనుగుణంగా అన్ని విద్యా సంస్థల్లో 10 శాతం అదనపు సీట్లు పెంచేలా చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం…పది శాతం అదనపు సీట్లలో ఐదు శాతం కాపులకు, మిగిలిన ఐదు శాతం ఇతర అగ్రవర్ణ కులాలకు కేటాయించనుంది..

ఇక ఉద్యోగాల విషయంలో నూ భవిష్యత్తులో రోస్టర్ విధానం అమలు చేయాలని కమిటీ నిర్ణయించింది..ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్ లకు రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదని కమిటీ తేల్చింది..మార్చి 8 తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం…కొత్తగా ఎలాంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో భవిష్యత్తు లో రోస్టర్ పాయింట్ల విషయంలో రిజర్వేషన్లు అమలు చేయాలని అధికారుల కమిటీ నిర్ణయించింది.. కమిటీ తీసుకున్న నిర్ణయాలను సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కు పంపించారు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి…సీఎస్ తుది నిర్ణయం తీసుకోగానే రోస్టర్ పోయింట్లపై విధివిధానాలు జారీ చేయనుంది ప్రభుత్వ…మరోవైపు అగ్రవర్ణ పేదలకు ఇచ్చే సర్టిఫికేట్ ల జారీ ని త్వరగా పూర్తి చేయాలని కమిటీ నిర్ణయించింది…

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *