Breaking News

ఈ శివుని గుడి విశిష్టత వింటే వెంటనే వెళ్లి దర్శించుకుంటారు !

ఈ శివుని గుడి విశిష్టత వింటే వెంటనే వెళ్లి దర్శించుకుంటారు !

11 నెలలు నీటిలో ఉంటుంది ఆ శివాలయం, సంవత్సరం లో…… వైశాఖ మాసం 1 నెల రోజులు మాత్రమే స్వామి వారి దర్శనం లభిస్తుంది.

👉 కరోనా లాక్ డౌన్ కారణం గా స్వామి వారి దర్శనం నిలిపివేత
తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దర్శనానికి అనుమతించడం కుదరదన్న ఆలయ అధికారులు

ఈలోపు వైశాఖ మాసం పూర్తి అయితే….. ఆలయం యథావిధిగా నీట మునుగుతుంది.

దేశం లో – సుప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటైన – అత్యంత మహిమకలిగిన శైవ క్షేత్రం ,, ఒకే ప్రాంగణంలో
రెండు శివలింగాలు ఉన్నవి ,
ఆ రెండు శివలింగాలు తో పాటు గా ఆ ఆలయానికి పక్కన గొస్తాని నది ఉన్నది ,
ఆ నదికి అవతలి వైపు మరొక శివాలయం ఉన్నది.

ఆ శివలింగాన్ని 1 నత్తారామలింగేశ్వర స్వామి–. 2.పరశురామలింగేశ్వరస్వామి , 3. లక్ష్మణేశ్వర స్వామి అని పిలుస్తారు.

👉 వైశాఖ మాసం ప్రారంభం సందర్భంగా……. త్రిలింగ క్షేత్ర శివాలయాలపై ప్రత్యేక కథనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ,
పశ్చిమ గోదావరి జిల్లాలో ….. తణుకు పట్టణం నుండి ఈ క్షేత్రము 14 కి.మీ. దూరంలో వున్నది. తాడేపల్లి గూడెం నుండి 28 కి.మీ. అత్తిలి నుంది. 6 కి.మీ. మార్టేరు నుండి 15 కి.మీ. దూరంలో ఈక్షేత్రమున్నది.

శ్రీరాముడు సీతాదేవి కలిసి గోస్తనీ నదితీరం దగ్గరికి చేరుకోగానే అక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని అనుకొన్నాడు. 

దానికి మద్యాన్న సమయంలో గోస్తనీ నదిలో త్రికోటి తీర్ధములు వచ్చి చేరుతాయని తలచి హనుమంతుని వారణాసికి పంపి శీవలింగమును తెమ్మని చెప్పేను. అయితే హనుమ వచ్చు సమయం మద్యాన్నం దాటుతుండుట వలన అక్కడే నదిలో నుండి నత్తలతో కూడిన ఇసుకమట్టిని తీసుకొని సీతాసమేతంగా ఒక శివలింగాన్ని తయారుచేసి ప్రతిష్ట చేసాడు. శ్రీరాముడు,సీతాదేవి కలిసి లింగాన్ని తయారు చేసాకా మిగిలిన ఇసుకముద్దని కూడా అక్కడే ఉంచేసారు. అలా నత్తలు, ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి ప్రతిష్టచేసారని పురాణ కధనం.

👉 అలాగే పరశురాముడు కూడా తను పూజ చేసిన శివలింగాన్ని తీసుకొచ్చి అదే గోస్తనీ నదీ తీరంలో శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం పక్కనే ప్రతిష్ట చేసాడు.

ముఖ్యంగా గోస్త‌నీన‌దిలో ఉన్న రామ‌లింగేశ్వ‌ర‌స్వామి ఆల‌యం కేవ‌లం వైశాఖ‌మాసంలోనే భ‌క్తుల సంద‌ర్శ‌నార్థం తెరిచి ఉంటుంది.
ఈ స్వామిని పళ్ళ రసాలతో అభిషేకిస్తేముక్తిని పొందుతామని భక్తుల నమ్మకం. అందుకే వైశాఖ మాసంలో స్వామి దర్సనానికి పరిసర ప్రాంతాలనుండి కొన్ని వేల మంది భక్తులు వస్తారు.
3 శివాలయాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *