Breaking News

ఎన్నికల కమిషనర్‌పై సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు వాయిదాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఎస్‌ఈసీ రమేశ్ కుమార్‌ తాము నియమించిన వ్యక్తి కాదని.. చంద్రబాబు హయాంలోనే నియమించారన్నారు. తన సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించారన్నారు. ఈసీ వ్యాఖ్యలు బాధాకరమన్నారు.

ఈసీకి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం నిష్పాక్షికత అని..  రమేశ్ విచక్షణ కోల్పోయినట్లుగా ప్రవర్తించారన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకతీతంగా పనిచేయాలని.. అప్పుడే ఆ మనిషికి గౌరవం వస్తుందన్నారు. రమేశ్ ఓ వైపు కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేస్తున్నామని చెప్పారని..  అదే ప్రెస్‌మీట్‌లో గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, ఎస్సీలను బదిలీ చేశారన్నారు. మరికొంత మంది అధికారులను తప్పిస్తూ ప్రకటన చేశారన్నారు. ఆ అధికారం ఈసీకి ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లేసి 151 స్థానాలు ఇస్తే తాము అధికారంలో ఉన్నామని.. అధికారం జగన్‌ మోహన్‌రెడ్డిదా.. లేదా రమేశ్ కుమార్‌దా? అని ఘాటుగా ప్రశ్నించారు. ఏమన్నా అంటే విచక్షణ అధికారం అంటారని.. ఈ మధ్య ఇదో ఫ్యాషనైపోయిందన్నారు. ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం ఎందుకన్నారు. 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *