Breaking News

ఎన్నికల కమీషన్ నియమించిన మధ్యంతర సీఎస్ ను నేను…

ఎన్నికల కమీషన్ నియమించిన మధ్యంతర సీఎస్ ను నేను…

క్యాబినెట్ సమావేశం నిర్వహించుకోవచ్చు

క్యాబినెట్ సమావేశం కోసం 39 అంశాలతో నోట్ సిద్ధం

ఎలక్షన్ కమీషన్ కు నివేదించిన అనంతరమే క్యాబినెట్

అనుమతుల కోసం కనీసం 48 గంటల గడువు కోరిన ఈసీ

కోడి రామ్మూర్తి స్టేడియం విషయంలో విచారం వ్యక్తం చేసిన ఎల్‌వి

ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే పనులు పరుగులు పెట్టిస్తానన్న సీఎస్

tm9news  ప్రతినిధులతో ఇష్టాగోష్టి

tm9news – అమరావతి

క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించి తీరుతానంటూ… రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో, ఈ సమావేశం పై ఉత్కంఠ నెలకొంది.. క్యాబినెట్ సమావేశ నిర్వహణ, ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఒక‌వర్గం వాదిస్తుండగా, క్యాబినెట్ సమావేశాలు కేంద్రంలో జరుగుతున్నాయి కనుక తాము కూడా నిర్వహించి తీరుతామని, తెలుగుదేశం నాయకులు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే… ఈ నేపథ్యంలో రాష్ట్ర క్యాబినెట్ కార్యదర్శిగా వ్యవహరించే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం IAS తో.. tm9news ప్రతినిదులు మంగళవారం సచివాలయంలోని సీఎస్ ఛాంబర్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపి సీఎస్ ఎల్.వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ… క్యాబినెట్ సమావేశం నిర్వహించుకోవడానికి ఎటువంటి ఆటంకం లేదని, స్పష్ఠతనిచ్చారు, అయితే క్యాబినెట్ లో చర్చించిన అంశాలను ఈసీ అనుమతి తో నిర్ణయించాల్సి ఉంటుదన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు ఆయా అంశాలపై పూర్తి వివరాలు అందించిన తర్వాత రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ ముందుకు ఆయా అంశాలు వస్తాయని ఎల్.వి సుబ్రహ్మణ్యం చెప్పారు. వీటిలో ఉన్న వివరాలను ఆధారంగా చేసుకొని తాను భారత ఎన్నికల కమీషన్ కు నివేదించి, అనుమతులు పొందాల్సి ఉంటుందని వివరించారు.
తాను ఎన్నికల సంఘం నియమించిన మధ్యంతర సీఎస్ అని అందరూ అంటున్నారని చమత్కరించారు….

రాష్ట్ర క్యాబినెట్ అంటే.. విధాన నిర్ణయాలు తీసుకొనే వేదిక అని గుర్తించాలన్నారు. గతంలో లేని, విషయాలపై నిర్ణయం తీసుకొనేందుకే క్యాబినెట్ సమావేశం జరుగుతుందని ఎల్.వి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. క్యాబినెట్ సమావేశానికి ముందుగానే ఎజండాను రూపొందించి ఈసీ అనుమతులు తీసుకొని, అటుపిమ్మట, మంత్రివర్గ సభ్యులకు వివరాలు తెలియపరుస్తామని సీఎస్ చెప్పారు. ఎజండాలో లేని అంశాలపై క్యాబినెట్ లో చర్చ జరిగే అవకాశం చాల తక్కువని, ఒక వేళ అలాంటి చర్చ జరిగినా దానిని ఈసీ కి నివేదించాల్సి ఉంటుందన్నారు. ఏయే అంశాలను ఈసీ అనుమతికి పంపాలనే విచక్షణాధికారం అంతిమంగా సీఎస్ దే అని పేర్కొన్నారు ఎల్.వి
గతంలో క్యాబినెట్ ముందుకు వచ్చి, నిర్ణయం కాని అంశాలు ఏవీ లేవని, సీఎస్ చెప్పారు. ఈ సందర్బంగా ఎన్నికల సంఘం అధికారుల తో తాను సంప్రదించగా.. క్యాబినెట్ లో చర్చించే అంశాలపై నిర్ణయం తీసుకొనేందుకు తమకు కనీసం 48గంటల సమయం కావాలని వారు తెలిపినట్లు సీఎస్ పేర్కొన్నారు.

ప్రస్తుతం తన దృష్టికి వచ్చిన 39 అంశాలలో నాలుగు మినహా మిగిలినవి అన్నీ రివాజుగా వచ్చే అంశాలేనని సీఎస్ అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో IAS అధికారుల పై ఇటీవల ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను నిజం ప్రస్తావించగా… ముఖ్యమంత్రి కి సైతం తనలాగే ఐఏఎస్ అధికారుల పట్ల ఎంతో ఆపేక్ష ఉందని, అయితే అది, సీఎం బయటకు వ్యక్తీకరించరని నర్మగర్బంగా వ్యాఖ్యానించారు.

శ్రీకాకుళం జిల్లాలో గడచిన ఐదేళ్ళలో నిర్మాణం పూర్తి చేసుకోని, కోడి రామ్మూర్తి స్టేడియం అంశాన్ని నిజం సీఎస్ దృష్టికి తీసుకు రాగా ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంలో ఆయనపై కొన్ని ఆరోపణలు ప్రచారంలో ఉన్న విషయాన్ని ఖండించారు ఎల్.వి
రాష్ట్ర ప్రభుత్వం లో ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు పూర్తి పారదర్శకంగా పనిచేయాలని చూస్తారు తప్ప అభివృద్ధికి అడ్డుపడరని ఎల్.వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలు నిర్వహిస్తున్న తాను కోడి రామ్మూర్తి స్టేడియం విషయంలో చొరవ తీసుకొంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రం లో ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం కోడి రామ్మూర్తి స్టేడియం పనులను వేగవంతం చేసి ప్రజలకు,క్రీడాకారులకు అంకితం ఇస్తానని ఆయన భరోసా ఇచ్చారు.

— స్రవంతీ చంద్ర(tm9news)

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *