Breaking News

ఏపీ ఇంటర్‌ ఫలితాలు.. బాలికలదే హవా

ఏపీ ఇంటర్‌ ఫలితాలు.. బాలికలదే హవా
ప్రథమ సంవత్సరంలో 60 శాతం
 
ద్వితీయ సంవత్సరంలో 72 శాతం ఉత్తీర్ణత
 
ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్‌
 
ఏపీ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. తొలిసారిగా గ్రేడింగ్‌ విధానంలో ఈ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 60 శాతం, ద్వితీయ సంవత్సరంలో 72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంతో పోలిస్తే ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణత శాతం తక్కువగా నమోదైంది. అటు ప్రథమ, ఇటు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
 
ప్రథమ సంవత్సర ఫలితాల్లో.. జనరల్‌లో మొత్తం 60 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు అయ్యింది. వొకేషనల్‌లో 49 శాతం ఉత్తీర్ణత సాధించారు. కృష్ణా (72), పశ్చిమ గోదావరి (69), నెల్లూరు (67) జిల్లాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. జనరల్‌లో బాలికలు 64 శాతం, బాలురు 56 ఉత్తీర్ణత సాధించారు.
 
ద్వితీయ సంవత్సర ఫలితాల్లో.. జనరల్‌లో 72 శాతం ఉత్తీర్ణత నమోదు అవ్వగా.. వొకేషనల్‌లో 69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కృష్ణా (81), చిత్తూరు (76), నెల్లూరు, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలు 74 శాతం ఉత్తీర్ణత శాతాలతో తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. బాలికలు 75, బాలురు 68 శాతం ఉత్తీర్ణత సాధించారు.
 
24 రోజుల్లోనే ఫలితాలు..
 
ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 27న మొదలై 18తో ముగిశాయి. కేవలం 24 రోజుల్లోనే ఫలితాలు విడుదలవ్వడం విశేషం. మొత్తం 10.17 లక్షల మంది విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోగా.. 9.65 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఉదయలక్ష్మి తెలిపారు. వీరిలో 6.3 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణలు కాగా.. 3.3 లక్షల మంది ఫెయిలయ్యారు.
 
మొదటి సారి గ్రేడింగ్ విధానంలో ఇంటర్ ఫలితాలు
 
ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణత 60 శాతం..
 
బాలురు ఉత్తీర్ణత 56 శాతం..
 
బాలికల ఉత్తీర్ణత 64 శాతం..
 
కృష్ణా జిల్లా 72 శాతం మొదటి స్థానం
 
పశ్చిమగోదావరి రెండో స్థానం 69 శాతం..
 
చివరి స్థానం కడప 49 శాతం..
 
సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత 72 శాతం..
 
బాలురు ఉత్తీర్ణత 68 శాతం..
 
బాలికల ఉత్తీర్ణత 75 శాతం..
 
మొదటి స్థానం కృష్ణా జిల్లా 81 శాతం..
 
రెండో స్థానం చిత్తూరు 76 శాతం..
 
చివరి స్తానం కడప 61 శాతం..
 
మే 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
 
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ ఏప్రిల్ 24

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *