Breaking News

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పై శాప్ మాజీ ఛైర్మన్ పోలీసులకు ఫిర్యాదు…

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పై శాప్ మాజీ ఛైర్మన్ పోలీసులకు ఫిర్యాదు…

2015, జనవరి 28 నుంచి, 2017 జనవరి 28 వరకు రెండేళ్ళ కాలానికి ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) ఛైర్మన్ గా పనిచేసిన పీ.ఆర్ మోహన్,తాను ఛైర్మన్ గా పనిచేసిన కాలానికి, ప్రభుత్వం నుంచి రావాల్సిన గౌరవ వేతనం… వసతి,ప్రయాణ ఖర్చులతో పాటు ఇతరత్రా అలవెన్సులను నేటికీ చెల్లించ లేదంటూ… బుధవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు.

గతంలో క్రీడలు,యువజన సర్వీసుల శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ప్రస్తుత సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తనకు రావాల్సిన బకాయిలు రాకుండా అడ్డుకొన్నారని, ప్రస్తతం ఆయనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నందున ఇకనైనా మంజూరు చేయాలని పీ.ఆర్ మోహన్ కోరారు.

శాప్ మాజీ ఛైర్మన్ మోహన్ పదవీకాలం ముగిసి రెండేళ్ళు దాటడం, అతని హయాంలోనే శాప్ పై అనేక ఆరోపణలు రావడం, తనకు బకాయిలు చెల్లించలేదనే అంశం పై గతంలో ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడని మోహన్, అకస్మాత్తుగా, ఏకంగా సీఎస్ పైనే పోలీసులకు ఫిర్యాదు చేయటం వంటి అంశాలను పరిశీలిస్తే…. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అతన్ని అధికార పార్టీ నేతలే వెనుక ఉండి నడిపిస్తున్నారని, శాప్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే అప్పటి క్రీడా విభాగం ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆ బిల్లులను ఇవ్వలేదు. నా పదవీ కాలం తో ముగిసింది. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న ఎల్వీ ఇకనైనా మంజూరు చేయాలి’ అని మోహన్‌ కోరారు.

 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *