Breaking News

కేశవర్ధిని మొక్క

 
కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన మిత్రులు, ప్రముఖ వైద్యులు డా. డి.ఆర్.కె. ప్రసాద్ గారు మొన్న పంపిన ఫోటోలివి. నీటి దాపులలో గుబురుగా పెరిగే ఈ మొక్క ఆకులు కొంచెం కర్పూరం వాసన కలిగుంటాయి. ఆకులు దళసరిగా, బల్లెం ఆకారంలో, నక్కు కలిగుంటాయి. గుంటకలగర ( Ectipta alba)మొక్కను భృంగరాజ అన్నట్లే దీనిని కూడా సంస్కృతంలో భృంగరాజ అనే పేరుతోనే పిలుస్తారు. ఇంకా సంస్కృతంలో ఈ మొక్కకు కేశరాజ, పీతభృంగి అనే పేర్లు కూడా ఉన్నాయి. దీని గుణాలు కూడా గుంటకలగరను పోలివుంటాయి. దీని ఆకుల పసరును తలకి రాసుకుంటే జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలదు. ఈ ఆకుల పసరును పచ్చ బొట్టు పెట్టటానికి ( Tattooing) ఉపయోగిస్తారు. ఈ పసరుతో వేసుకునే పచ్చబొట్లు చెరగని ముదురు నీలి వర్ణంలో ఉంటాయి. ఈ మొక్క వేళ్ళను నూరి, ఆ రసాన్ని అద్దకపు రంగుగా వాడతారు. ఈ మొక్క ఆకుల రసం బట్టతల ( alopecia) నివారణకు ఉపయోగిస్తారు. దగ్గు, తలపోటు ( cephalagia) నివారణకు వాడతారు. స్త్రీలకు అధిక ఋతురక్త స్రావం, వారికి వచ్చే ఎర్రబట్ట వ్యాధి నివారణకు ఈ మొక్కను సమూలంగా పీకి కషాయం కాచి వాడతారు. తెల్ల గుంటకలగర, నల్ల గుంటకలగర కాక దాదాపుగా అవే ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్కను సంస్కృతంలో పీల భృంగరాజ అనే పేరుతో కూడా వ్యవహరిస్తారు.యాస్టరేసీ Asteraceae) కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం వెడీలియా చినెన్సిస్ ( Wedelia chinensis). దీనికే Wedelia calendulaceae అనే మరొక శాస్త్రీయ నామం కూడా ఉంది. జర్మనీలోని యెనా ( Jena) విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేసిన Georg Wolfgang Wedel ( 1645-1721) పేరిట ఈ మొక్క శాస్త్రీయ నామం ఏర్పడింది. చైనా దేశపు మొక్క కనుక దీనిని చినెన్సిస్ ( chinensis) అన్నారు. ఈ మొక్క గురించి మరిన్ని వివరాలకు ఆసక్తి కలవారు దీని శాస్త్రీయ నామం కొట్టి గూగుల్ లో వెతకవచ్చు.
— మీ..రవీంద్రనాథ్.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *