Breaking News

చివరి రోజు చాలా హాట్ హాట్‌గా ..

అసెంబ్లీలో సియం జగన్ , మాజీ సియం చంద్రబాబుల మద్య హోదా పై స్వల్ప మాటల యుద్దం జరిగింది .. హోదా కోసం పోరాటం చేస్తాము.. సాధిస్తాము అని అధికార వైసీపీ అంటుంటే …. మేము కూడా  చాలా ఎక్కువగానే పోరాటం చేసాము అని టిడిపి అంటోంది  … దీనిపై అసెంబ్లీ ఆఖరిరోజు ఆఖరి సమయంలో స్వల్ప వివాదం చెలరేగింది…

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు చాలా హాట్ హాట్‌గా సాగింది… అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు తాను ఎంతో చేశానని ప్రతిపక్ష నేత చంద్రబాబు అంటే.. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనంటూ సీఎం వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని సీఎం జగన్  ఆరోపించగా.. చంద్రబాబు ఆ ఆరోపణలు తోసిపుచ్చారు. హోదా కోసం తాము ప్రయత్నించలేదనడం పచ్చి అబద్ధం అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత పరస్పర విమర్శలతో సభ దద్దరిల్లింది. హోదా విషయం జగన్ మాట్లాడే సమయంలో చంద్రబాబు అవకాశం ఇవ్వాలని కోరగా సియం జగన్ ప్రసంగాన్ని ఆపి నేను మీలా మైకులు కట్ చేయనని , ఎంతసమయం కావాలన్నా తీసుకోమని చంద్రబాబుకు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చారు ..

చంద్రబాబు మాటలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉన్నాయని, చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తారని సీఎం జగన్  అన్నారు .. ప్రజలు టిడిపికి ఇంత బుద్ది చెప్పినా ఆ పార్టీలో మార్పురాలేదని , వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 13 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ఇసుక నుంచి మరుగు దొడ్ల వరకు గ్రామ స్థాయిలో అంతా అవినీతి మయమేనని ఆరోపించిన సీఎం జగన్… ఇలాంటి పరిస్థితిని మార్చేందుకే తాను వచ్చానన్నారు. చేడిపోయిన వ్యవస్థను మార్చడానికే నా పాదయాత్ర  సమయంలో ఒక్క అవకాశం అడిగానని దానికి ప్రజలు నన్ను ఆశీర్వదించారని సీఎం జగన్ అన్నారు… జ్యూడిషియల్ కమిటీ తో పారదర్శక పాలనకు తొలి అడుగు పడుతుందని సియం తెలిపారు..

రాష్ట్రంలో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు ….  ప్రాజెక్టుల టెండర్ల విషయంలో పారదర్శకంగా ముందుకు వెళ్తామని.. రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతి, దుబారాకు అడ్డుకట్ట వేస్తున్నామని చెప్పారు. ప్రతీ ప్రాజెక్టు పనులపై అధ్యయనం జరుగుతోందని..  ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయంలో జరిగిన అవినీతిని తేలుస్తామని మరోసారి సియం జగన్ స్పష్టం చేశారు..  ప్రాజెక్టు పనుల్లో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో కూడా ప్రజలకు తెలియజేస్తామని, ఎక్కడ అవినీతి తక్కువగా ఉంటుందో.. అక్కడ పర్ కాపిటా ఇన్‌కం పెరుగుతుందన్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా కళ్లారా చూశానని, వారికి మంచి చేయడం కోసం నిరంతరం ప్రయత్నిస్తానని చెప్పారు ముఖ్యమంత్రి … తాము తీసుకొచ్చిన నవరత్నాలతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆయన దేశ చరిత్రలోనే అత్యున్నత సామాజిక మంత్రిమండలిని ఏర్పాటు చేశామన్నారు. పదవుల విషయంలో సామాజిక న్యాయం పాటిస్తున్నామని సియం జగన్ అన్నారు..

నవరత్నాల ద్వారా విద్యను ప్రాథమిక హక్కుగా ఏర్పాటు చేస్తామని . వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పేరుతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తామని..  ఎన్నికల మేనిఫెస్టోకి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయబోమన్నారు. ఎన్నికల ముందు ఓ మాట.. ఎన్నికల తర్వాత మరోమాట చెప్పే తత్వం తమది కాదని,  తనతో సహా మంత్రులందరికీ మేనిఫెస్టో కళ్లముందే ఉండేలా ఆదేశాలు ఇచ్చామని సియం జగన్ తెలిపారు.

చిన్న చిన్న విమర్శలతో , స్వల్ప వివాదాలతో , సియం , మాజీ సియంల ప్రతివిమర్శలతో ఆఖరిరోజు సభను స్పీకర్ తమ్మినేని ముగించారు …

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *