Breaking News

జయహో బిసి జయహో చంద్రన్న కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర,

కృష్ణ జిల్లా మచిలీపట్నంలో జయహో బిసి జయహో చంద్రన్న కార్యక్రమంలో న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర టీడీపీకార్యదర్శి కొనకళ్ల జగన్నాధ రావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గొర్రెపాటి గోపిచంద్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రములో బిసి లకు సముచిత న్యాయం కల్పించింది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే అని, టీడీపీ ప్రభత్వంలో బిసిలకు 33.5శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక పార్టీ తమదేనని, తెలిపారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి బిసిల కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం బిసి లకు కేవలం 37 కోట్లు మాత్రమే ఖర్చు చేసారని వారి హయాంలో బీసీలను మరిచారని బిసి కార్పొరేషన్ ద్వారా నిధులను ఇవ్వలేదు అని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిసిలకు 1400 కోట్లు ఖర్చుచేసమని బిసి విద్యార్థులు విదేశాలలో ఉన్నత చదువులకు 15 లక్షలు ఇచ్చామని, ఆదరణ పధకం ద్వారా 90 శాతం సబ్సిడీతో చేతి వృత్తులు చేసే పనివారికి పనిముట్లు ఇచ్చామని తెలియచేసారు. బిసిల అభ్యున్నతి కి పెద్ద పీట వేస్తున్న పార్టీ తమదేనని ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *