Breaking News

జిల్లాలో వినూత్న వేషాలుతో అవగాహన తెస్తున్న అనంతపురం జిల్లా పోలీసుశాఖ

కరోనా జాగ్రత్తలు, లాక్ డౌన్ నిబంధనల పాటింపుపై మేలుకొలుపు పేరున ప్రజల్లో చైతన్యం

* జిల్లాలో వినూత్న వేషాలుతో అవగాహన తెస్తున్న జిల్లా పోలీసుశాఖ

atp police (3) atp police (2) atp police (4)

అనంతపురం జిల్లా పోలీసుశాఖ కరోనా వైరస్ వ్యాధిపై ప్రజల్లో చైతన్యం తెస్తోంది. వినూత్న వేషాలతో పోలీసులు జిల్లా ప్రజల్లో అవగాహన చేస్తున్నారు. కరోనా మాయల పకీర్ … కరోనా యమధర్మరాజు…. గురువయ్య…ఇలా వివిధ వేషాలతో మేలుకొలుపు పేరున జిల్లా పోలీస్ శాఖ ప్రజల్లోకి వెళుతోంది. ” నేను కరోనా మాయల పకీర్ ని… నాకు లేదు కరుణ… మీరు ఇంట్లో ఉంటే నేను బయట ఉంటా… మీరు బయటకు వస్తే నేను ఇంట్లోకి వస్తా… తస్మాత్ జాగ్రత్త” అంటూ ఈ వేషధారులు ప్రజల్లో చైతన్యం చేస్తున్నారు. మేలుకొలుపు కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఒక ప్రచార రథాన్ని ప్రత్యేకంగా కేటాయించి ఆ వాహనానికి రెండు వైపుల మరియు వెనుక, ముందు భాగాన కరోనా వైరస్ వ్యాధి సంబంధించి ఫ్లెక్సీలు అతికించారు. ఈ వాహనం మరియు కరోనా ఫకీర్ లేదా కరోనా యమధర్మరాజు వేషధారులు జనసమ్మర్థ ప్రాంతాలైన కూరగాయల మార్కెట్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రధాన కూడళ్లు… లాక్ డౌన్ సడలింపు సమయంలో వీధుల్లోకి వెళ్తున్నారు. కంటైన్మెంట్ జోన్ల ప్రాంతాల్లోని ప్రజలను జాగృతం చేస్తున్నారు. ముందుగా వేషధారులు తమ హావభావాలు, విజ్ఞప్తులతో చైతన్యం చేస్తున్నారు. ఆ తర్వాత ప్రచార వాహనంలో ఉన్న మైకు ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి నివారణ మరియు లాక్ డౌన్ నిబంధనలుపై అవగాహన చేస్తున్నారు. వేషధారిగా అనుభవమున్న ఏ.ఆర్ కానిస్టేబుల్ కిశోర్ కుమార్ తో పాటు ప్రయివేట్ కళాకారులైన ఆనంద్ , మల్లికార్జున, నాగరాజుల ద్వారా కరోనా ఫకీర్ లేదా కరోన యమధర్మరాజులుగా వేషాలు వేయించి ప్రజల్లో హత్తుకుపోయేలా కరోనాపై వివరిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు ఉన్న పట్టణాల్లో ప్రచార రథం, వేషధారులను తిప్పుతున్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కంటైన్మెంట్ జోన్ల నిబంధనలు పాటించేలా విజ్ఞప్తి చేస్తున్నారు.

……….ప్రతిమ దర్మరాజు —–

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *