Breaking News

జ‌న‌సేన పార్టీ ప‌ద‌వితో పాటు అధికార‌మూ ఇస్తుంది

జ‌న‌సేన పార్టీ ప‌ద‌వితో పాటు అధికార‌మూ ఇస్తుంది

* అన్ని కులాలు బాధ్య‌త‌గా మెల‌గాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది

* జనసేన అధ్యక్షులు శ్పవన్ కళ్యాణ్ 

* జ‌న‌సేన పార్టీలోకి మాజీ మంత్రి  కిషోర్ బాబు

pawan WhatsApp Image 2018-12-01 at 15.03.09 WhatsApp Image 2018-12-01 at 15.03.13

రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ‌కి ప్ర‌తి ఒక్క‌రు న‌డుం బిగించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు  ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పిలుపునిచ్చారు. అన్ని కులాలు బాధ్య‌త‌గా మెల‌గాల్సిన తరుణమని చెప్పారు. జ‌న‌సేన పార్టీ అంద‌రికీ స‌మాన హ‌క్కులు, అవకాశాలు క‌ల్పిస్తుంద‌ని తెలిపారు. శ‌నివారం విజ‌య‌వాడ‌లోని జ‌న‌సేన పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో మాజీ మంత్రి  రావెల కిషోర్‌బాబు త‌న అనుచ‌రుల‌తో క‌ల‌సి జ‌న‌సేన పార్టీలో చేరారు. ఆయ‌న్ని, ఆయ‌న స‌తీమ‌ణి శ్శాంతిజ్యోతిని  ప‌వ‌న్‌క‌ళ్యాణ్  సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్బంగా   పవన్ కళ్యాణ్   మాట్లాడుతూ.. “రాజ్యాంగ బ‌ద్దంగా ఎమ్మెల్యే ప‌ద‌వికి, పార్టీ ప్రాధ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేసి జ‌న‌సేన పార్టీలో చేరేందుకు వ‌చ్చిన రావెల కిషోర్‌బాబు గారికి మ‌న‌స్ఫూర్తిగా ఆహ్వానం ప‌లుకుతున్నాం. కులాల‌కీ, మ‌తాల‌కీ, ప్రాంతాల‌కీ అతీతంగా జ‌న‌సేన పార్టీ ప్ర‌తి ఒక్క‌రికీ అండ‌గా ఉంటుంది. రావెల కిషోర్‌బాబు గారు నాకు 2009 నుంచి ప‌రిచ‌యం. ఆనాటి రాజ‌కీయ ప్ర‌స్థానంలో ఆయ‌న స‌తీమ‌ణి శాంతిజ్యోతి గారు తాడికొండ నుంచి పోటీ చేసి, 15 వేల ఓట్ల పైగా సాధించారు. 2019 లో  ఖ‌చ్చితంగా కిషోర్ బాబు గారిని ఎమ్మెల్యేని చేస్తాం. బ‌ల‌మైన మంత్రిని చేస్తాం. ఆయన  చెప్పిన విధంగా టీడీపీ మాదిరి ప‌ద‌వులు ఇచ్చి అధికారం మా చేతుల్లో పెట్టుకోం. జ‌న‌సేన పార్టీ ప‌ద‌వీ ఇస్తుంది. అధికార‌మూ ఇస్తుంది. 2009 త‌ర్వాత 2014లో రెండు, మూడు సంద‌ర్బాల్లో రావెల కిషోర్‌బాబు గారితో క‌ల‌సి ప్ర‌యాణించాను. ఆ రోజునే ఆయ‌న ఆవేద‌న గుర్తించా. ఆయ‌న కోరుకుంటుంది ఆత్మ‌గౌర‌వం, వ్య‌క్తికి ఇవ్వాల్సిన గుర్తింపు. ద‌ళితుల ఆత్మ‌గౌర‌వం. నేను టీడీపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి గ‌ల ఒక కార‌ణం కూడా కులాల మ‌ధ్య ఐక్య‌త సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కంతోనే. రాష్ట్ర విభ‌జ‌న నేపథ్యంలో ఇప్ప‌టికే న‌లిగిపోయాం. సంపూర్ణ అవ‌గాహ‌న లేక‌పోతే ఇబ్బందులు వ‌స్తాయి. పైగా ప‌దేళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు కాబ‌ట్టి కాస్తయినా జ్ఞానం వ‌చ్చి ఉంటుందని భావించా. అవ‌కాశవాద రాజ‌కీయాలకి దూరంగా ఉంటార‌నుకున్నా. జ‌న‌సేన పార్టీ అభివృద్దికి తోడ్ప‌డ‌తార‌ని మాత్రం ఏనాడు ఊహించ‌లేదు. రాష్ట్రానికి అనుభవం ఉన్నవారు కావాల‌నుకున్నా, అవినీతిర‌హిత పాల‌న వ‌స్తుంద‌ని ఆశించా. కానీ నా అంచ‌నాల‌ని తెలుగుదేశం పార్టీ అందుకోలేక‌పోయింది. ఏ మూల‌కి వెళ్లినా, ఏ నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లినా వేల కోట్ల అవినీతి, శాంతిభ‌ద్ర‌త‌లు క‌రువైన ప‌రిస్థితులు. ముఖ్యంగా కులాల మ‌ధ్య స్ప‌ర్ధ‌ల‌కు రాకుండా చూడ‌మంటే, ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. బ‌య‌టికి కులాల గురించి మాట్లాడ‌రు, లోప‌ల చేసేదంతా కుల రాజ‌కీయాలే. ఆడ‌ప‌డుచుల మీద‌, అధికారుల మీద ఎమ్మెల్యేలు దాడులు చేసే ప‌రిస్థితి వచ్చింది. అంటే ముఖ్య‌మంత్రికి పాల‌న మీద పూర్తిగా ప‌ట్టు త‌ప్పింది. మాట్లాడితే విజ‌న్ 2050 అంటున్నారు. ఇప్ప‌టికే వ‌య‌సు మ‌ళ్లి ముఖ్య‌మంత్రి ఏం చేస్తున్నారో అర్ధం కావ‌డం లేదు. యువ‌త‌, మ‌హిళ‌లు రోడ్డు మీద‌కి వ‌స్తున్నారంటే, బ‌ల‌మైన మార్పు కోరుకుంటున్నారు. జ‌న‌సేన కులాల ఐక్య‌త గురించి బ‌లంగా మాట్లాడ‌డానికి కార‌ణం, రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో కులాల‌తో సంబంధం లేకుండా ఆంధ్రులంద‌ర్నీ తిట్టారు. ఇలాంటి ఉద్య‌మాల వ‌ల్ల ద‌ళితుల ఐక్య‌త‌, ఆభివృద్ది దెబ్బ‌తిన్నాయి. ఆర్ధికంగా, రాజ‌కీయంగా వెనుక‌బ‌డిన కులాలు దెబ్బ‌తిన్నాయి. ఈ వ్య‌వ‌స్థ ఎక్క‌డో ఒక చోట మారాలి. అవ‌కాశ‌వాద రాజ‌కీయాలు, డ‌బ్బుతో ముడిప‌డిన రాజ‌కీయాలు కాకుండా ప్ర‌జ‌ల‌కి ఎంతోకొంత ఉప‌యోగ‌ప‌డే రాజ‌కీయాలు అవ‌స‌రం అనిపించింది. యూపీ త‌ర‌హా కుల రాజ‌కీయాలు వ‌స్తే అభివృద్ది పూర్తిగా కుంటుప‌డుతుంద”న్నారు.

* ప‌ద‌వులు ఇస్తున్నారు. అధికారం ఇవ్వ‌డం లేదు-  రావెల‌ 

అంత‌కు ముందు  రావెల  మాట్లాడుతూ “జ్యోతిబా పూలే ఉద్య‌మ స్ఫూర్తి, అంబేద్క‌ర్ గారి ఆద‌ర్శాలు, ఆశ‌యాల‌ని పుణికిపుచ్చుకున్న నాయకుడు  పవన్ కళ్యాణ్ . నిట్ట‌నిలువునా అస‌మాన‌త‌ల‌తో నిండిన‌, అవినీతితో నిండిన స‌మాజాన్ని ప్ర‌క్షాళ‌ణ చేసి న‌వ‌స‌మాజ‌, స‌మ స‌మాజ స్థాప‌న‌కి న‌డుం బిగించిన  ప‌వ‌న్‌ గారికి ధ‌న్య‌వాదాలు. ఆంధ్ర‌ప్రదేశ్‌లో స‌మాజాన్ని మార్చాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అవినీతి దోపిడితో కూడిన వ్య‌వ‌స్థ‌ల‌ని ప్ర‌క్షాళ‌ణ చేసి నూత‌న వ్య‌వ‌స్థ ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌జా స్వామ్యం కాస్త కుల‌స్వామ్యంగా మారిపోయింది. సారా స్వామ్యంగా మారిపోయింది. అంబేద్క‌ర్ గారు మ‌న‌కిచ్చిన ఓటు అనే ఆయుధాన్ని ప్ర‌లోభాల‌తో దోచుకుంటున్నారు. ఇలాంటి వ్య‌వ‌స్థ‌ని ప్ర‌క్షాళ‌ణ చేసి అంబేద్క‌ర్ గారి క‌ల‌ల‌ని సాకారం చేసేందుకు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో నా వంతు పాత్ర పోషించ‌డానికి సిద్ధ‌మ‌య్యా. టీడీపీలో అలుపెరుగ‌ని పోరాటం చేశా, అడుగ‌డుగునా అవ‌రోధాలు, అవ‌మానాలు. ప‌ని చేసే విధానంలో అడ్డంకులు. ప‌ద‌వులు అయితే ఇస్తారు, అధికారం మాత్రం మ‌న‌కివ్వ‌ర‌ని తెలుసుకున్నా. ఇలాంటి వ్య‌వ‌స్థ‌ని మార్చేందుకే  ప‌వ‌న్‌ పోరాటం చేస్తున్నార‌”ని చెప్పారు.

\జ‌న‌సేన నేత  నాదెండ్ల మ‌నోహ‌ర్‌ మాట్లాడుతూ “కుల‌, మ‌తాల‌కి అతీతమైన వ్య‌వ‌స్థ కోసం కృషి చేయాల‌న్న భావ‌న‌తో, ముందుగా శాస‌న‌స‌భ్య‌త్వానికి రాజీనామా చేసి పార్టీలో చేర‌డాన్ని అభినందిస్తున్నా. శాస‌న స‌భ్యుడిగా, మంత్రిగా  రావెల కిషోర్ బాబు గారు  చేసిన సేవ‌లు అంద‌రికీ తెలుసు. ఒక‌ప్పుడు పొగిడిన ముఖ్య‌మంత్రి శ్రీ కిషోర్ గారిని అవ‌మానాల‌కి గురి చేశారు. ఇన్నాళ్లు అన్నింటినీ భ‌రించుకుంటూ వ‌చ్చారు. ఏదో ఒక రోజు నిజాలు బ‌య‌టికి రాక త‌ప్ప‌దు. జ‌న‌సేన పార్టీలోకి శ్రీ రావెల‌ కిషోర్‌బాబు గారినిని సాద‌రంగా ఆహ్వానిస్తూ ఎస్సీ, ఎస్టీ స‌బ్‌ప్లాన్ అమ‌లుకీ, మ‌హిళాభ్యున్న‌తికీ మేం చేస్తున్న కృషికి స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌”ని కోరారు. ఈ సమావేశంలో జనసేన నాయకుడు శ్రీ పసుపులేటి బాలరాజు, శ్రీమతి శాంతిజ్యోతి పాల్గొన్నారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *