Breaking News

ట్రాఫిక్ సెన్స్ పాటించే పరిస్థితిలో అసలు రోడ్లు ఉన్నాయా ??

ఇండియా లో వాహనదారులకు ట్రాఫిక్ సెన్స్ తక్కువ, నిబంధనలు పాటించరు.. ఒప్పుకుంటాను.. కానీ, అసలు నిబంధనల ప్రకారం ఉన్న రోడ్లు ఉన్నాయా ?? ట్రాఫిక్ సెన్స్ పాటించే పరిస్థితిలో అసలు రోడ్లు ఉన్నాయా ??

ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర 3 నిమిషాల పాటు ట్రాఫిక్ ఆపేయటం మరే డెవలపెడ్ కంట్రీలో నైనా చూస్తామా ? రోడ్ల మీద వాహనాల రాకపోకలను ఆపేలా ఉండే ఆక్రమణలను చూస్తామా ? ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది అనుకుంటే అక్కడ ఉన్న క్రాస్ రోడ్స్ ని మూసేసి మూడు కి. మీ తర్వాత యూ టర్న్ పెట్టి అక్కడ వరకు ట్రాఫిక్ ని స్లో చేసే ట్రాఫిక్ ప్లానింగ్ ని మనం ఇక్కడ తప్ప మరెక్కడైనా చూడగలమా ? ఎక్కడైనా రోడ్డు కుడి/ఎడమ మలుపులు సరైనా ప్లానింగ్ తో నిర్మింఛారా ? రోడ్లు పొరపాటున ఎప్పుడైనా రిపేర్ చేస్తే అక్కడ ఎత్తు లో తేడా లేకుండా ఉన్న రోడ్లు ఉన్నాయా ? ఎవడు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు స్పీడ్ బ్రేకర్లు వాళ్ళింటిముందు పెట్టుకోనే వ్యవస్థ ఎక్కడైనా ఉందా ? మా కాలనీలోకి ప్రైవేటు వెహికల్స్ రాకూడదు, అంటూ కాలనీ వాళ్ళు డెసిషన్ తీసుకోని గేట్లు పెట్టుకొనే వ్యవస్థ ఉందా ?

అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం డ్రైవింగ్ ఉండాలి అనుకోవటం లో ఎలాంటి తప్పు లేదు. కానీ అ ప్రమాణాల తగ్గట్లు రోడ్లు ఉన్నాయా ?? ఉదాహరణకు హైదరాబాద్ తీసుకుందాం, అందులో కూడా అతి ముఖ్యమైన రహదారులైన యల్.బి. నగర్ నుండి బి.హెచ్.ఇ.యల్ వరకు ఉన్న రహదారి లో ఎన్ని చోట్ల బాటిల్ నెక్ ఉంది . అతి ముఖ్యమైన నాంపల్లి, ఖైరతాబాద్, పంజా గుట్ట,… ప్రతి చౌరస్తా బాటిల్ నెక్.. ఉప్పల్ నుండి హైటెక్ సిటీ, ఏకంగా గవర్నర్, సియం నివాసముండే రాజ్ భవన్ రోడ్. పరిసరాలు. ఎమ్మేల్యేలుండే బంజారా హిల్స్, సెలబ్రటీస్ ఉండే జూబ్లీ హిల్స్, స్టేట్ కి ఇన్ కమ్ తెచ్చే టెక్కీస్ ఉండే మాధాపూర్,, గచ్చి బౌలి .. వీటిలో ఎక్కడైనా కనీసం ఒక 5 కి. మీ పొడుగున అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రోడ్లు ఉన్నాయా ? వర్షం వస్తే ఈ రొడ్ల లో నీళ్ళు ఎందుకు ఆగిపోతున్నాయి ? అక్కడకు వచ్చి ఆ వర్షం లో నిబంధనలు పాటించాలి అని చెప్పటం సమంజసమా ? ముందుగా ఆ అంతర్జాతియ నిబంధనలు పాటించాల్సింది ప్రభుత్వం కాదా ? వర్షం వచ్చి నీళ్ళు ఆగిపోయి, మోకాళ్ల లోతులో బండి ని నడుపుతూ ఎక్కడ సైలెన్సర్ లో కి నీళ్ళి పోతాయో అని టెన్షన్ పడే వాడిని ఆ వర్షంలో అలాగే నిలబెట్టి పొల్యూషన్ సర్టిఫికేట్ అడుగుదామా ? గంటకు ఒక అంగుళం కూడా కదల్లేని కార్లో కూర్చొన్నొడి దగ్గరకెళ్ళి బ్లూటూత్ లో మాట్లాడుతున్నాడా లేదా అని చెక్ చేద్దామా ?

మన దేశంలో జరిగే యాక్సిడెంట్శ్ మరణాల్లో 60 % రోడ్ల మీదున్న గుంటలు, రోడ్ల ప్రమాణాల వల్ల జరుగుతుంటే, 30 % మానవతప్పిదాల వల్ల/ నిర్లక్ష్యాల వల్ల జరుగుతున్నాయి. ఇప్పుడు 60 % ని వదిలి, 30 % ని శిక్షిద్దామా ?

ట్రాఫిక్ సెన్స్, స్వీయభధ్రత చాలా ముఖ్యం, కాదని ఎవరూ అనరు . కానీ అసలు అవి పాటించే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ఎవరిది ??

ట్రాఫిక్ రూల్స్ పాటించటానికి నేను సిద్దం, కానీ రూల్ ప్రకారం ట్రాఫిక్ నడిపించటానికి ప్రభుత్వం సిద్దంగా ఉందా ???

( ఈ సమస్య ఒక్క హైదరాబాద్ దే కాదు. దేశంలో ప్రతి నగరం/ పట్టణంలో ఉన్న సమస్యే )

………………మోహన్ రావిపాటి ……….

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *