Breaking News

తనిఖీ అధికారులూ! మీ వైఖరి మార్చండి – ఎం.డి సురేంద్రబాబు

 తనిఖీ అధికారులూ! మీ వైఖరి మార్చండి – ఎం.డి సూచన.

surendra babu surendra babu rtc
ఈ రోజు అంటే జనవరి 8, మంగళవారం నాడు విజయవాడ, విద్యాధరపురం నందలి ఏ.పి.ఎస్.ఆర్.టి.సి జోనల్ శిక్షణా కళాశాలలో బస్సు చెకింగ్ అధికారులకు మరియు ఫాటల్ ఏక్సిడెంట్లు చేసిన డ్రైవర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు.
ఈ తరగతులకు సంస్థ వి.సి అండ్ ఎం.డి శ్రీ ఎన్. వి సురేంద్రబాబు, ఐ.పి.ఎస్ ముఖ్య అతిథిగా హాజరై చెకింగ్ అధికారుల నుద్దేశించి పలు సూచనలు చేశారు. బస్సులు తనిఖీ చేసే సమయాలలో తనిఖీ అధికారులు బస్సు సిబ్బంది పట్ల, ప్రయాణీకుల పట్ల స్నేహపూర్వక వాతావరణం కనబరచాలని సూచించారు. అలాగే తనిఖీ కోసం బస్సు ఆపగానే ప్రయాణీకులకు తాము తనిఖీ అధికారులమని తెలియచేసి, బస్సు తనిఖీ చేసుకునేందకు కొద్దీ సేపు సహకరించాలని అభ్యర్థించాలన్నారు. సిబ్బంది పట్ల వారు తప్పు చేస్తారనే కోణంలో కాకుండా సహేతుకమైన ధోరణి ప్రదర్శించాలన్నారు. ఆ సమయంలో తనిఖీ అధికారులమన్నభావనతో ఆధిక్యం ప్రదర్శించకుండా సంయమనం పాటించాలన్నారు. కేసులు వ్రాయాలన్నధోరణిలో కాకుండా, నిజమైన లోటుపాట్లు ఏమిటో గుర్తించి కేసులు వ్రాయాలన్నారు. సిల్లీ రీజన్స్ తో కేసులు వ్రాయకుండా సంస్థ ఆదాయానికి నష్టం కలిగించే తీవ్రత కలిగిన కేసులను పసిగట్టి సంబంధిత సిబ్బందిపై ఎప్పటికప్పుడు నిఘా పెంచుతూ ఉండాలన్నారు. అప్పుడే దారి తప్పే సిబ్బంది కూడా సక్రమంగా నడుచుకొంటారన్నారు. చూసేందుకు వినేందుకు ఆషామాషీగా అనిపించే కేసులు కాకుండా అసలైన కేసులు కనిపెట్టాలన్నారు. ఎక్కడైనా ఏదైనా తప్పుగా అనిపించినప్పుడు అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, లేక పొరపాటున జరిగిందా అనే విచక్షణ చూపాలన్నారు, తనిఖీ అధికారులు తమ అనుభవాలతో వృత్తి నైపుణ్యాలు మెరుగు పరుచుకోవాలని తెలిపారు. తనిఖీ అనేది పూర్తిగా బస్సులో గానీ, ఏదైనా గదిలో గానీ చేయాలని, అంతేగానీ నలుగురి ముందు నిలబెట్టి దోషిలా ప్రశ్నించవద్దని, దానివలన ఏ తప్పు చేయని వారు బాధపడే అవకాశం లేకపోలేదని, ఆ సున్నిత విషయాన్ని గుర్తించాలన్నారు. తనిఖీకి ముందు చక్కగా పలకరించి మరియు తనిఖీ తర్వాత కరచాలనం చేసి బస్సు సిబ్బందికి ధన్యవాదాలు తెలపాలని, అలా చేస్తే సిబ్బంది మళ్ళీ తిరిగి మరింత ఉత్సాహంగా విధుల్లో నిమగ్నమవుతారని సూచించారు. అలాగే బస్సు ప్రయాణీకులకు కూడా వారు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలపాలన్నారు. ప్రయాణీకుల పట్ల ప్రమాదకరమైన సెల్ ఫోన్ డ్రైవింగ్ కనిపెట్టేందుకు, బస్సులో ప్రయాణీకులతో కలసి ప్రయాణించాలని తెలిపారు.
ఈ శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రీజియన్ల నుండి 74 మంది తనిఖీ అధికారులు హాజరైనారు.
తదనంతరం ఫాటల్ ఏక్సిడెంట్లు చేసిన డ్రైవర్ల తో వారు ప్రమాదాలకు గురి కావదానికి గల కారణాల గురించి ఎం.డి శ్రీ సురేంద్రబాబు ఆరా తీశారు. చాలా మేరకు ప్రమాదాలు మానవ తప్పిదం వలెనే సంభవిస్తున్నాయని, కాబట్టి ఆ ప్రమాదాలను నివారించే అవకాశాలు కూడా మన చేతుల్లోనే ఉన్నాయని ఆ డ్రైవర్లకు తెలియచెప్పారు. డ్రైవర్ల నిర్లక్ష్యం వలన జరిగిన ప్రమాదాల పట్ల తాను కఠినంగా, నిర్మొహమాటంగా వ్యవహరిస్తానని ఎం.డి తెలిపారు. ప్రమాదాల కారణంగా జరిగే ప్రాణ నష్టం తిరిగి పూడ్చలేమని, పోయిన వాళ్ళని బ్రతికించడం జరగదని అందుకే ముందుగానే ప్రమాదాల పట్ల అన్ని రకాల అప్రమత్తతలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలన్నారు. అది అసాధ్యమేమీ కాదన్నారు. సంస్థలో ఎన్నో ఏళ్లుగా ఒక్క ప్రమాదం కూడా చేయని డ్రైవర్లు ఎంతో మంది ఉన్నారని వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ప్రమాదాలు లేకుండా బస్సులు నడిపితే సంస్థ ప్రతిష్ట కూడా పెరుగుతుందని సూచించారు. మద్యపానం సేవించడం ప్రమాదాలకు దారి తీస్తుందని, కాబట్టి అలాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ జి. జయరావు, సి.టి.ఎం శ్రీ బ్రహ్మానంద రెడ్డి లు కూడా పాల్గొన్నారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *