Breaking News

దాల్చిని చెట్టు

cinnamon-2 Cinnamon-Tree-2-450w slide_341376_3519890_free

 

 

 

 

 

 

 

 

 

 

 

 

దాల్చిని చెక్కను మనం మసాలా దినుసుగా వాడుకుంటాం. దాల్చిని (Dalchini) చెక్కను అందరూ దాచిన చెక్క అంటూ ఉంటారు. ఇంగ్లిష్ లో దీనిని Cinnamon అంటారు. లారేసీ (Lauraceae) కుటుంబానికి చెందిన దాదాపు డజను వృక్షాల కాండాల లోపలి పట్ట ( inner bark) ని మనం మిఠాయిలు, కారపు సరకుల తయారీలోనూ, పలావులు, కూరలు వగైరాలలోనూ, మసాలా దినుసుగానూ వాడుకుంటాం. Cinnamomum verum అనేది సిసలైన దాల్చిని (True Cinnamon) వృక్షం యొక్క శాస్త్రీయ నామం. కిన్నమోన్ అనే గ్రీకు పదంనుంచి ఆంగ్ల Cinnamon పదం ఏర్పడింది. క్రీస్తు పూర్వం 2 వేల సంవత్సరాలకు ముందునుంచే ఈ సుగంధ ద్రవ్యం ఈజిప్టుకు దిగుమతి అయ్యేది. భారతదేశంలోని మలబార్ తీరం, శ్రీలంక, బర్మా, నేటి బంగ్లాదేశ్ అనాదిగా దాల్చిని చెక్క ఉత్పాదనకు ప్రసిద్ధి పొందాయి. వీటిలో శ్రీలంకలో లభించే దాల్చిని చెక్క పలుచగా సుగంధభరితంగా ఉండే కారణంగా అంతర్జాతీయ సుగంధ ద్రవ్యాల మార్కెట్లో దానికి డిమాండ్ ఎక్కువ. గ్రీకులు దాల్చినిని కెసియా అనీ, మలబాత్రాన్ అనీ కూడా అనేవారు. ఈ చెట్టు ఆకులను వారు ద్రాక్ష సారాయికి సుగంధం తేవడం కోసం వాడేవారట. చైనీస్ దాల్చిని (Cinnamomum cassia), కర్పూరం చెట్టు (Camphor – Cinnamomum camphora), తమాల లేక తాళీస వృక్షం (Cinnamomum tamala), శ్రీలంక దాల్చిని లేక సిసలైన దాల్చిని
( Cinnamomum verum), భారతదేశపు దాల్చిని (Cinnamomum malabathrum) మొదలైన దాల్చిని రకాలు ప్రసిద్ధం. దాల్చిని చెట్టు ఆకులు పరిమళ భరితంగా ఉంటాయి. వీటిని ఎండబెట్టి నిల్వ ఉంచుకుంటే కొన్నేళ్ళ వరకూ కూడా ఆ పరిమళం నిలిచే ఉంటుంది. మద్యానికి సువాసన తెచ్చేందుకే కాక, ఈ ఆకుల్ని పలావులలో సువాసన కోసం కూడా ఉపయోగిస్తారు. పలావు ఆకుల పేరుతో ఇవి మార్కెట్లో లభిస్తాయి. దాల్చిని చెక్క నుంచి, ఆకుల నుంచి తీసే నూనె (Cinnamon oil) ని కేకులు, చాక్లెట్లు, సాస్ లు, కెచప్ లు, ఊరగాయ పచ్చళ్ళు, శీతల పానీయాలు, ఔషధాలు, మద్యం మొదలైన వాటికి సువాసన తీసుకురావడానికి ఉపయోగిస్తారు. దీనిని సెంట్లు, అత్తర్ల తయారీలోనూ ఉపయోగిస్తారు. అయితే ఈ నూనె చాలా ఘాటుగా ఉంటుంది కనుక నూటికి ఒకటి అంతకంటే తక్కువ పాళ్ళలోనే దీనిని వినియోగించాలి. మోతాదు మించితే చర్మం మీద బొబ్బలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ ఆయిల్ చురుకుదనం కలిగిస్తుంది. కడుపులోని గ్యాస్ ను వెడలింప జేస్తుంది (Carminative). మెలికలు తిరిగే కడుపునొప్పిలోనూ, పన్నుపోటు ఉపశమనానికి, నాలుకకు పక్షవాతం వచ్చినప్పుడు దాల్చిని ఆయిల్ ని ఉపయోగిస్తారు. వికారం కలిగించే రుచి, వాసన కలిగిన కొన్ని ఔషధాలకు సువాసన కలిగించడానికి దాల్చిని నూనెను వాడతారు. ఈ ఆయిల్ ఎక్కువ మోతాదులో తాగితే పేగులు కాలి, మరణం సంభవిస్తుంది. ఇవీ దాల్చిని వృక్షం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు.


— మీ.. రవీంద్రనాథ్.

09849131029

 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *