Breaking News

నాది మంగళగిరి..ఆర్కే ది పొన్నూరు

నాది మంగళగిరి..ఆర్కే ది పొన్నూరు
-నేనుండే చోటు, నా ఓటు మంగళగిరి నియోజకవర్గంలోనే ఉంది
-ఆర్కే ఓటు, అడ్రస్ పొన్నూరులో ఉందంటూ అఫిడవిట్ ఇచ్చారు
-నియోజకవర్గంలో 12 వేల ఇళ్ల నిర్మాణం
-ఇప్పటికే ఇళ్లు కట్టుకుంటే వారికి పట్టాలు
-మంగళగిరిని గచ్చిబౌలిలో ఐటీ హబ్ గా మారుస్తా
-ఎన్నికల ప్రచారంలో మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్

lokesh01

మంగళగిరి నియోజకవర్గానికి నేను లోకల్, ఆర్కే నాన్ లోకల్ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. తాను ఉండే చోటు, తన ఓటు నియోజకవర్గ పరిధిలోనే ఉందని, ఆళ్ల రామక్రిష్నారెడ్డి ఓటు, అడ్రస్ కూడా పొన్నూరులో ఉందని..తానే అఫిడవిట్ పేర్కొన్నారని లోకేశ్ వివరించారు. లోకల్, నాన్ లోకల్ అంటూ రెచ్చగొడుతున్న ఆర్కే పొన్నూరు వాడని, మరి మంగళగిరికి లోకల్ ఎలా అవుతాడో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్లు లేని వారి కోసం 12 వేల ఇళ్లు నిర్మిస్తామని టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఇదివరకే ఇళ్లు కట్టుకున్నవారైతే వారికి పట్టాలు ఇప్పిస్తామన్నారు. శనివారం ఆయన దుగ్గిరాల మండలం తుమ్మపూడి, చిలువూరు, దుగ్గిరాల, మంచికలపూడిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సొంతింటి కల నెరవెర్చేందుకు అత్యాధునిక సౌకర్యాలతో 12 వేల ఇళ్లు నిర్మించనున్నామని చెప్పారు. ఇదివరకే ఇళ్లు కట్టుకున్నవారికి పట్టాలు ఇప్పిస్తామన్నారు. మంగళగిరికి ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చానని, రాబోయే రోజుల్లో మంగళగిరి గచ్చిబౌలిగా తీర్చిదిద్దుతానని చెప్పారు.

జగన్ వెనుక మోడీ, కేసీఆర్…చంద్రబాబు వెనుక 5 కోట్ల ఆంధ్రులు
వైకాపా అధ్యక్షుడు జగన్ రెడ్డి వెనుక ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారని…మన ముఖ్యమంత్రి చంద్రబాబు వెనుక ఐదు కోట్ల ఆంధ్రులం ఉన్నామని లోకేశ్ పేర్కొన్నారు. లక్షల కోట్ల ప్రజాధనం దోపిడీ చేసిన దొంగ జగన్ కు మన ఇంటి తాళాలు ఇస్తామా అని ప్రశ్నించారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ,తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో 2 వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం లేదని, ఏపీకి లోటు బడ్జెట్ ఉన్నా,ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన దానికి మించి 54 లక్షల కుటుంబాలకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. రెండు వేల పెన్షన్ మూడు వేలు చేస్తున్నామన్నారు. దేశంలో ఏ ఒక్క రాష్ర్టంలోనూ అమలుకాని పసుపు-కుంకుమ పథకం మన చంద్రన్న ఆంధ్రప్రదేశ్ మహిళలకు కానుకగా అందిస్తుంటే…దానిని అడ్డుకునేందుకు జగన్ కోర్టుకు వెళ్లారని ఆరోపించారు. చంద్రన్న కంటే 20 సంవత్సరాలు తక్కువ వయస్సు ఉన్న ప్రతిపక్ష నేతలు ప్రచారం చెయ్యలేక చతికలబడ్డారు… ముఖ్యమంత్రి మాత్రం దూసుకుపోతున్నారని చెప్పారు.

ముస్లిం సోదరులకు ఉప ముఖ్యమంత్రి పదవి
తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకొస్తోందని, ముస్లింలకే ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నామని లోకేశ్ చెప్పారు. ఇస్లామిక్ బ్యాంక్ ద్వారా మైనార్టీ సోదరులకు రుణాలు ఇప్పిస్తామన్నారు. మంగళగిరి ప్రజలు ఎప్పుడు వచ్చినా మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని ప్రకటించారు. మంగళగిరి లో క్యాంపు ఆఫీస్ ఏర్పాటు చేసుకొని ప్రతి రోజు రెండు గంటలు మీ సమస్యలు పరిష్కారం చేసిన తరువాత నేను సచివాలయంకి వెళ్తానని హామీ ఇచ్చారు. పసుపు -కుంకుమ పెట్టే చంద్రన్న కావాలా? …పసుపు కుంకుమ చెరిపే జగన్ కావాలా?40 సంత్సరాల పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు కావాలా? 16 నెలలు జైలులో ఉండొచ్చిన జగన్ వ్యక్తి కావాలా?ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడే చంద్రబాబు కావాలా?ఆంధ్రుల ఆత్మగౌరవం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టే జగన్ కావాలా? అనేది తేల్చుకునే సమయం ఇది అన్నారు. నిరంకుశ మోడీ కి వ్యతిరేకంగా పోరాడుతున్న చంద్రబాబు, మమతా బెనర్జీ పైన మాత్రమే దాడులు జరుగుతున్నాయని వివరించారు.

ప్రచారంలో హైలైట్స్

తుమ్మపూడి గ్రామంలో ఎడ్ల బండిపై నారా లోకేశ్ ని ఊరేగింపుగా తీసుకెళ్లారు
తుమ్మపూడి గ్రామంలో లోకేష్ సమక్షంలో టీడీపీ లో చేరిన రిటైర్డ్ డిఎస్పీ వాసిరెడ్డి హనుమంతరావు,గ్రామస్తులు మస్తాన్,బాల స్వామి,నాగుల్ మీర,రాంబాబు,సాంబశివరావులు
దుగ్గిరాల ఆలీ నగర్ జెండా చెట్టు సెంటర్ లో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న నారా లోకేశ్

నేటి ఎన్నికల ప్రచార షెడ్యూల్
నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మున్సిపాలిటీ నందు 8,14,15,16,19 వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం మంగళగిరి మండలం లోని పెద్దవడ్లపూడి ,చిన్నవడ్లపూడి గ్రామాలలో నారా లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *