Breaking News

పతనమైన మామిడి దిగుబడి…

 

తుఫాన్ దెబ్బతో మరింత దిగాలు

ఆకాశాన్నంటుతున్న మామిడిపళ్ల ధర

డజను మేలురకం పళ్ళు కొనాలంటే 500 వెచ్చించాల్సిందే

సామాన్యులకు అందుబాటులోలేని మామిడి పళ్లు ధరలు

దిగుబడి లేకపోవడంతోధరవున్నా రైతులకు దక్కని ఫలం

 

       మామిడి తోటల  రైతులకు కష్ట, నష్టాలు తప్పడంలేదు. ఈసారి పచ్చడి కాయకు కూడా ఆశించిన ధర రైతులకు దక్కలేదు. ఇక  పళ్ళ విషయానికి వస్తేవాటికి ధర అధికంగా ఉన్నా…  దిగుబడి   సన్నగిల్లడంతో మామిడి రైతులకు నష్టాలు తప్పడంలేదుపుచ్చు తెగులు, పూత రాలిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని మామిడి రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్ ని ముచెత్తుతున్న మామిడిపళ్ల పరిస్థితిపైదాని వెనక రైతులకు దక్కుతున్న ధరపై tm9news అందిస్తున్న ప్రత్యేక కథనం

 

  వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన తూర్పుగోదావరి జిల్లాలో మామిడి తోటలుకూడా అధికామే. ఏజెన్సీ ప్రాంతంతో పాటు.. సీతానగరం, రాజానగరం, గోకవరం, తుని, పత్తిపాడు, కిర్లంపూడి తదితర మండల ప్రాంతాల్లోనూ రైతులు వేల ఎకరాల్లో మామిడి తోటలు పెంచుతూ జీవనం సాగిస్తున్నారు. అయితేఎక్కువశాతం ప్రకృతిపైనే ఆధారపడి ఉండే పంటవల్ల తరచూ రైతులకు కష్ట నష్టాలు తప్పడంలేదు. ఏడాది దిగుబడితో పాటు ధరకూడా లేకపోవడంతో మామిడి రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. పూత గా ఉండగానేమంచు మామిడి రైతులను ముంచేసింది. మంచు, వడగళ్ల వానలవల్ల మామిడి కాయ దిగుబడి భారీగా తగ్గిపోయింది. మరోపక్క ముడ్డి పుచ్చు అధికంగా రావడంతోతీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభావం అందరికీ ఎంతో ఇష్టమైన మామిడి పళ్ళ ధరపై పడటంతోప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ధరకు సామాన్యులు సీజనల్ పండును కనీసం రుచిచూడలేని పరిస్థితిలో ఉన్నారు.

 

    జిల్లాలో అటవీ ప్రాంతంలో కలుపుకుని దాదాపు 10 వేలకు పైనే ఎకరాల బూముల్లో మామిడి తోటలున్నాయి. వీటిల్లో బంగినపల్లి, కలకటేరు, నీలం, కొత్తపల్లి కొబ్బరి, పండూరు మామిడి, బొండాలు తో పాటు వివిధారకాల దేశవాళీ రసాల మామిడి రైతులు పండిస్తున్నారు. ఎకరానికి మందులు, కూలీ నిమిత్తం లక్షల్లో పెట్టుబడి పెట్టామని రైతులు చెబుతున్నారు. గత ఏడాది కనీస దిగుబడి లేకపోయినా.. ధర అధికంగా పలికిందని రైతులతో పాటు, వ్యాపారులూ చెబుతున్నారు. అయితే.. ఏడాది కాపు తక్కువగా వుండటమేకాకుండా.. పచ్చికాయకు  ధరకూడా హీనంగా ఉందని రైతులు వాపోతున్నారు. అయితే మామిడి పళ్లకు మాత్రం ధర అధికంగానే లభిస్తోందని రైతులతో పాటు వ్యాపారులూ వెల్లడిఅటున్నారుఅయితే గత ఏడాదితో పోలిస్తే.. దిగుబడి గణనీయంగా తగ్గడంతో మాకు నష్టాలు తప్పేటట్టు లేవని మామిడి సాగు రైతులు వాపోతున్నారుకష్టమొచ్చినా, నష్టమొచ్చినా తమని ప్రభుత్వమూ ఆదుకోవడంలేదని రైతులు చెబుతున్నారు. రాజమహేంద్రవరం హోల్ సెల్ మామిడి మార్కెట్ లో.. ప్రస్తుతం రకాన్ని బట్టి 100 మామిడి 1000 నుండి 3000 వేల రూపాయిల వరకూ మార్కెట్ లో రైతువారీ ధర పలుకుతోంది. ఇదే  మార్కెట్ బయట చిల్లర వ్యాపారులవద్ద మాత్రం డజను పళ్ళు రకాన్ని బట్టి 300 నుండి 500 వరకూ ధరకు  విక్రయిస్తున్నారుగతంలో అయితేఇవే 100 పళ్ళు రకాలను బట్టి.. 300 నుండి 1000  వరకూ మాత్రమే ధర పలికేదని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ఏడాది.. మామిడి దిగుబడి తక్కువ, ధర అధికంగా ఉండటంతోసామాన్యులు బయట మార్కెట్ లో పళ్ళు కొనుగోలుచేసి తినలేని పరిస్థితిలో ఉన్నారుకాపు తక్కువ వల్ల.. సీజన్ ముగిసే వరకూ మామిడిపళ్ల ధర రేజ్ లొనే నడుస్తుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.

 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *