Breaking News

ప్లూమేరియా ప్యూడికా ( Plumeria pudica)

 ఎపోసైనేసీ (Apocynaceae) కుటుంబానికి చెందిన ఈ అందమైన
పూలమొక్క శాస్త్రీయ నామం ప్లూమేరియా ప్యూడికా ( Plumeria pudica). అందరూ దీనిని ప్లూమేరియా అంటున్నప్పటికీ వాస్తవానికి దీనిని ప్లూమీరియా అని పలకాలి. ఈ ఉష్ణ ప్రాంతపు మొక్కలను ఫ్రాంజిపాని ( Frangipani) అని కూడా అంటారు. వింతైన ఉద్ధరిణ ( చెంచా) ఆకారంలోని ఆకులు ఈ మొక్క ప్రత్యేకత. మధ్యలో లేత పసుపుపచ్చ రంగు కలిగిన తెల్లని దీని పూలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. చక్కని పరిమళం కూడా కలిగి ఉంటాయి. క్రీ.శ. 16 వ శతాబ్దికి చెందిన ఇటాలియన్ రాజకుటుంబీకుడు ( Marquis ) M. Frangipani ఈ పూలనుంచి గ్లోవ్స్ ( gloves)కి వేసుకునే ఒక రకమైన సెంట్ ( Scent) ను తయారు చేశాడు. ఆయన పేరిట ఈ మొక్కలను ఫ్రాంజిపాని అంటున్నారు. ఇక ఈ మొక్కల శాస్త్రీయ నామం సుప్రసిద్ధ ఫ్రెంచ్ యాత్రికుడు, రచయిత ఛార్లెస్ ప్లూమియర్ ( Charles Plumier 1646- 1704) పేరిట పెట్టబడింది. సిగ్గుతో ముడుచుకుపోయే ( Bashful) దీని ఆకులను బట్టి దీనికి లాటిన్ భాషలో ప్యూడికా ( pudica) అనే పేరు ఏర్పడింది. మధ్య అమెరికాలోని పనామా దేశం ఈ మొక్క తొట్టతొలి జన్మస్థలం. ఇప్పుడు ప్రపంచంలో చాలా ప్రదేశాలలో ఈ పూల మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కను ఆంగ్లంలో గోల్డెన్ యారో ( Golden Arrow) అంటారు. దీనికి గిల్డెడ్ స్పూన్స్ ( Gilded Spoons ) అనే మరొక సాధారణ నామం ( Common name ) కూడా ఉంది. ఆ మధ్య కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ లో జరిగిన ఒక ఫంక్షన్ కి వెళ్లినప్పుడు అక్కడి ఒక ఫంక్షన్ హాల్ గార్డెన్ లో నేనీ ఫోటో తీశాను.
— మీ.. రవీంద్రనాథ్.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *