Breaking News

ఫస్ట్ లుక్ ఏదైనా కథ సోల్ ని రిప్రజెంట్ చేయాలి…..

ఈ సినిమా పింక్ రీమేక్ కాకుండా , మరో కథ ఏదైనా అయ్యుంటే ఈ లుక్ ని అభినందించేవాడిని.

పింక్ బేసిగ్గా ముగ్గురు అమ్మాయల కథ, ఆ ముగ్గురు అమ్మాయలకు సహాయం చేసే ఒక లాయర్ అందులో అతి ముఖ్యమైన పాత్ర…

ఫస్ట్ లుక్ ఏదైనా కథ సోల్ ని రిప్రజెంట్ చేయాలి. ఈ పోస్టర్ లో అది మిస్ అయ్యింది. ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ ని స్టైల్ గా ప్రజంట్ చేసేలా ఉంది. ఎక్కడా అసలు సినిమా కి ముఖ్యమైన ఆ ముగ్గురు అమ్మాయిలు లేరు…లేదా కనీసం సినిమా ఆత్మ అయిన మహిళా సాధికారత అనే అంశానైనా రిప్రజెంట్ చేయటం లేదు. నిజానికి వకీల్ సాబ్ అనే పేరే దీనికి కరెక్ట్ కాదు.. ఆ సినిమా రిప్రజెంట్ చేయాల్సింది మహిళా సాధికరత ని.. in fact this movie is against male chaunivism వకీల్ సాబ్ పేరులో పురుష ధ్వని స్పష్టంగా ఉంది, అదే ఆ సినిమా ఆత్మ కు కాంట్రాస్ట్. ఈ ఫస్ట్ లుక్ పవన్ కళ్యాణ్ ని ఒక హీరో లా చూపిస్తుందేమో కానీ, పింక్ ఆత్మ మాత్రం లేదు..

ఈ సినిమా తమిళంలో కూడా రీమేక్ అయ్యింది. అజిత్ హీరోగా వచ్చిన ఈ సినిమా పోస్టర్, టైటిల్ సినిమా ఆత్మనే రిప్రజెంట్ చేశాయి ..తమిళ పేరు ‘ నేర్కొండ పార్వై” అంటే “ఆలోచించే చూపు “… ( తమిళం పూర్తిగా రాదు/ అనువాదం తప్పు అయితే you can correct me). తెలుగు కి వచ్చేసరికి ఒక హీరో టైటిల్ వచ్చింది..

మూడు భాషల ఫస్ట్ లుక్ ఇస్తున్నా ! చూడండి..

MOHAN RAVIPATI-80742 32502

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *